Others

మఖ వలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంచ భూతాల్ని ప్రపంచిస్తున్న ప్రకృతిని
అమానుషతత్త్వ వేది మీద పరాభవించేటప్పుడు
వైఖరి గుడ్డిది
లోకులు పదవులు వదలలేని పెదవులు కదపలేని
‘‘కృభీద్రో’’హులే
ఐనా ఒక గీతమేదో ఆగామి కర్తవ్యాన్ని తట్టింది
అప్పుడే ఆవహం - ఆ పై ఆహవం...

నిజానికంతకుముందే
మొఱకడపుటెండ చల్లగాలిని తొడుక్కొని
నిద్రిస్తున్న తోటలోకి వచ్చి
తోటమాలి నేమార్చి
సీతాకోకచిలుక లాంటి శిరీషాన్నూడ్చుకుపోయంది
ఎంత చేస్తే
తోటలోకి తిరిగి తొలకరి చాలు కట్టిందని...

చిత్త విశ్వాంతరాళంలో
పరుగెత్తే ఈ భావాగ్ని వలయాన్ని ఎవడాపగలడు?
ఎవరి ఏకాంత తపో భూమికల్లో
ఒక భానుబింబం ఉదయస్తుందో
అది శబ్దజ్వాలగా కావ్యసృష్టి జరుగుతుంది
కావ్య గత వస్తు ప్రపంచంలో
మనిషి తన దేహాన్ని దాటి ఆదర్శ శిఖరాన్ని అందుకోగలడు...
సుతారపు తారా సంగత సౌమ్యాన్ని
నిద్రగా ధరించిన నేత్రశాఖల మీది స్వపాల్ని
యథార్థం చేయాలన్న సంకల్ప దీక్షతో
ఆకాశ దీపం దేదీప్యమానంగా కిరణగళానె్నత్తింది
అది మేలుకొలుపుల ముఖరింపో
సామాజిక జీవన వాద్య తంత్రీ సంఘటింపో
వికసించే పూవుకు వివరిస్తున్న సంగీత సారళ్యమో..

ఆ జగదతీత తేజో విరాజ మానమైన
నేత్రాంతర సీమలో
అందగా రాని తొలి సంజ తొగరు
ఱెప్పపాటుగా నడుస్తున్నప్పుడు
నేనొక మంచు చుక్కను - ఐతేనేం?
అస్మదాదిక రేణు సహస్రములు
చేతనాభ్యుదయ ప్రవాహ సూన...

వినిపిస్తున్నది పైకి తేలివస్తున్న గుండ్రని పాట
కనిపిస్తున్నది కాంతి ఖగోళ విన్యాస వైఖరి
వికసిస్తున్నది పృథివీ ఆశే్లషంతో నిర్మోకనీలిమ
చిగిరిస్తున్నది భవిష్య ద్విపినాంతరాల్లో ప్రఫుల్ల చికీర్ష
అవిశ్రాంతంగ నిలుపుకున్న ఆశే్లష మధురిమలో
రంగులు కలబోసుకున్న రాగం
ప్రతీకల నిశ్శబ్దపు ప్రాయోజిత వైభోగం!

- సాంధ్యశ్రీ, 8106897404