Others

ఒంటరి వసంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూల గిలకల సంగీతం మెరుపులతో
ఈ వసంతం మెరుస్తుందా!!
చిగుళ్ల సంతకాల వసంతం
జ్ఞాపకాల కరుణాక్షరాలతో
నిరంతర స్వప్నాల
ఆకుపచ్చని నిరక్షరాస్యతని
పంచి పెడుతుందా....

‘మొబైల్ ముఖాలే’ చిరునామాలా
మాలలు కట్టి మనుషులు
వేళ్లు లేని చెట్టు నాటాలని జూస్తున్నారు
అంతటా అపరాధ భావనల అలికిడితో
అడవులూ, మైదానాలు నిండిపోయి
కొండ చిలువ కబంధ హస్తాల్లో
గొర్రెపిల్లలు చిక్కుకుంటున్నాయి!

ఎండుటాకులూ, ఎండు బతుకులుగా
సంఘాలూ సంగమాలూ
చివికిపోయి చితికిపోయి
చితికుప్పలుగా దహించుకుపోతున్నాయి!

స్వేద ముత్యాల పల్లకీ మీద
కులం సవారీ చేస్తుంది!
కొండలని కళేబరాలుగా మార్చేస్తూ
కార్పొరేటు కొండలు పుట్టుకొస్తున్నాయి!
రాళ్లూ చెట్ల కొండల మీది వాన
నదులై నరాల్లోకి ప్రవహిస్తూ ఉంటుంది
కానీ
ఈ కార్పొరేటు కొండల మీది వాన
తొడుక్కున్న కోట్లలోనే ఇంకిపోతుంది!

విముక్తి గానాలాపన చేయాల్సిన
రాజకీయాలు
జోరీగ రొదలతో బందీలని చేస్తున్నాయి
ఈ వసంతం ఓ అపరాధ మంజరి
ఈ వసంతం ఓ ఒంటరిది!

ప్రశాంతాన్ని వెదజల్లే నీలాకాశాన్నీ
మనోరథం రంజిల్లే
శుభోదయ సూర్యాకాశాన్ని
దుస్తులుగా ధరింప చేసిన ముఖాలని అందివ్వగలదా?
తన పూలగిలకని ధర్మ గంటలుగా మోగించి
పూలగిలకల
వసంత శిశువుగా
మారుతుందా ఈ వసంతం

-- ఒబ్బిని