ఆంధ్రప్రదేశ్‌

సహనం భారతీయుల నరనరాల్లో ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత సంపర్క ప్రముఖ్ అనిరుధ్ దేశ్‌పాండే

అనంతపురం , డిసెంబర్ 5: తరతరాలుగా భారతీయులు సహనశీలురని, వారి నరనరాల్లో సహనం నిండివుందని ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత సంపర్కప్రముఖ్ అనిరుధ్ దేశ్‌పాండే పేర్కొన్నారు. ప్రజ్ఞా ప్రవాహము ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని డిఆర్‌డిఎ హాలులో ‘ భారత్ అత్యంత సహనశీలత గల దేశం’ అనే అంశంపై శనివారం జరిగిన కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న దేశ్‌పాండే మాట్లాడుతూ 1893లో ప్రపంచ మహాసభల్లో స్వామి వివేకానంద భారతీయుల సహనం గురించి పేర్కొన్నారన్నారు. ఈ దేశంలో పార్శీలు, యూదులు అనేక సంవత్సరాలుగా జీవిస్తున్నారంటే కారణం సహనశీలతేనన్నారు. ‘ఉదార చరితానాంతు వసుదైక కుటుంబకం’ అన్న భావన మనదని పేర్కొన్నారు. చరిత్రలో శివాజీ మహరాజ్, బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మాగాంధీ సహనానికి ప్రతీకగా నిలిచారన్నారు. సామాన్య వ్యక్తుల్లో ఎక్కడా అసహనం కనిపించడం లేదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, అధికారం కోసమే కొందరు అసహనం ప్రదర్శిస్తున్నారన్నారు. సాహిత్య అకాడమీ అవార్డులు వెనక్కి ఇవ్వడం, ఉస్మానియా యూనివర్శిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామనడం వెనుక రాజకీయ ప్రేరణలు ఉన్నాయన్నారు. అసహనముందంటున్న వాళ్లు చర్చకు రావాలన్నారు. అసహనమనేది దిగుమతి చేసుకున్నదని, ఇక్కడ కేవలం సహనం మాత్రమే ఉందన్నారు. రాజ్యాంగంలో మనకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం గురించి పేర్కొన్నారని, స్వేచ్చ సమానత్వం ఒక దానికొకటి శతృత్వం కాదన్నారు. రెండుగా విడిపోయిన జర్మనీ ప్రజలు తాము ఒకటే అని తెలుసుకుని తిరిగి ఒక్కటయ్యారని, తమ మధ్య నిర్మించుకున్న గోడను కూల్చేశారన్నారు. అదేబాటలో కొరియా ఉందని, ఇదే విధానాన్ని భారత్ పాకిస్తాన్ ఎందుకు అనుసరించకూడదన్నారు. పాకిస్తాన్ తీవ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందన్నారు. దేశ ప్రజల భాష, వేషం, ఆచార వ్యవహారాల్లో వైవిధ్వమున్నా సంస్కృతి ఒక్కటిగా నిలుపుతోందన్నారు. మనది ఒకే దేశం, ఒకే జాతి, ఒకే ప్రజ అన్నారు. ప్రపంచంలో అత్యంత సహనశీలత గల దేశం మనదేనన్నారు. ముఖ్య అతిథి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్‌నాయుడు మాట్లాడుతూ ఎన్నో మతాలకు భారత దేశం పుట్టినిల్లని, మరెన్నో మతాలకు ఆశ్రయ మిచ్చిన దేశమన్నారు. నేడు ప్రపంచంలో ఉన్న అన్ని మతాల ప్రజలు ఒక్క భారతదేశంలో మాత్రమే జీవిస్తున్నారంటే కారణం సహనమేనన్నారు. ప్రజ్జాప్రవాహము కన్వీనర్ ఇల్లూరు ఉమాకాంతరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నగరంలోని పలువురు ప్రముఖలు, మేధావులు పాల్గొన్నారు.