జాతీయ వార్తలు

శబరిమలలో శాంతియుత వాతావరణానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళ: శబరిమలలో అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే మహిళాభక్తులకు రక్షణ కల్పించే ఆలోచన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని కేరళ దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్ అన్నారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఆలయం వద్ద శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన అంశం సుప్రీం కోర్టు ఏడుగురు సభ్యుల విస్తత్ర ధర్మాసనానికి బదిలీ చేసిన విషయం విదితమే. ప్రస్తుతం దేవాలయం వద్ద యథాతథా స్థితిని కొనసాగించటమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అయితే ఈనెల 16న అయ్యప్ప ఆలయాన్ని తాను దర్శించుకుంటానని మహిళా హక్కుల ఉద్యమకారిణి తృప్తిదేశాయ్ చేసిన ప్రకటనపై మంత్రి మాట్లాడుతూ కోర్టును ఆశ్రయించి ఆదేశాలు తెచ్చుకోవచ్చని అన్నారు. కాగా అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ కోర్టు తీర్పు విషయంలో ఉన్న అనుమానాలు, సందేహాలను నివృత్తి చేసుకున్న తరువాతే సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.