రాష్ట్రీయం

గోదారి జలాల తరలింపు కాంగ్రెస్ ఘనతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాదనే ధైర్యం ఉందా? కెసిఆర్‌కు సబిత సవాల్
వైఎస్ హయాంలోనే పథకానికి శ్రీకారం
టిఆర్‌ఎస్ నేతలు చేసిందేమీ లేదని విమర్శ

మేడ్చల్, నవంబర్ 28: నగరానికి వౌలానా అబుల్ కలాం సుజల స్రవంతి ప్రాజెక్ట్ కింద గోదావరి జలాల తరలింపు గత కాంగ్రెస్ ప్రభుత్వ ఘనతేనని, అది కాదని చెప్పగలిగే ధైర్యం సిఎం కెసిఆర్‌కు, టిఆర్‌ఎస్ నాయకులకు ఉందా? అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సవాల్ విసిరారు. శనివారం మేడ్చల్ మండలం ఘణపూర్ క్షేత్రగిరి గుట్టపై నిర్మించిన గోదావరి జలాల రిజర్వాయర్ వద్ద రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కాంగ్రెస్ నాయకులు గోదావరి జలాలకు సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సబితా ఇంద్రారెడ్డి హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా ప్రజలకు శాశ్వతంగా మేలుకలిగే విధంగా చేస్తుందని, అందుకు నిదర్శనం ఈరోజు నగరానికి గోదావరి జలాల తరలింపేనని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణానీరు మాత్రమే హైదరాబాద్‌కు సరిపోదని గహ్రించి గోదావరి జలాలను హైదరాబాద్‌కు తీసుకువస్తేనే 50, 60 సంవత్సరాల వరకు మంచినీటి సమస్య తలెత్తదనే సంకల్పంతో ఈ బృహత్‌కార్యానికి శ్రీకారం చుట్టారని ఆమె తెలిపారు. 2005లో కృష్ణా రెండవ ఫేజ్‌కు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి నీటిని తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. గోదావరి జలాలతో నగర నీటిసమస్య తీరుతుందని 2008లో 3720 కోట్లు మంజూరు చేసి దానికి సంబంధించిన అనుమతులన్నీ ఇచ్చినట్లు ఆమె వివరించారు. 2009లో పనులు మొదలు పెడితే 2014లో ఎన్నికల వరకు 95 శాతం పనులు పూర్తయినట్లు తెలిపారు. ఐదు సంవత్సరాలలో 95 శాతం పనులు పూర్తి చేశామని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర కాలంలో కేవలం ఐదు శాతం పనులు పూర్తి చేసి గొప్పలు చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఏమీ చేయలేదని సిఎం కెసిఆర్ గాని టిఆర్‌ఎస్ పెద్దలు గాని చెప్పగలరా అని ఆమె ప్రశ్నించారు. ఓఆర్‌ఆర్, పివి నర్శింహారావు ఎక్స్‌ప్రెస్‌వే, కృష్ణా జలాలు, మెట్రో రైలు ఇలా అన్ని కాంగ్రెస్ హయాంలోనే చేపట్టినట్లు ఆమె గుర్తుచేశారు.
గోదావరి జలాల ట్రయల్న్ ప్రారంభంలో భాగంగా మంత్రి కెటిఆర్ గోదావరి జలాలను నగరానికి తరలించేందుకు సిఎం కెసిఆర్ అనునిత్యం అధికారులతో చర్చలు జరుపుతూ కష్టపడ్డారనడం శుద్ధ అబద్ధమని ఎల్‌బి నగర్ మాజీ ఎమ్మేల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సుజల స్రవంతి పేరుతో హైదరాబాద్ నగర వాసులకు నీటి ఇబ్బందులు రావద్దనే ఉద్దేశంతో ఆయన కలలకు అనుగుణంగా గోదావరి జలాలను హైదరాబాద్‌కు తీసుకువచ్చే ప్రయత్నం చేశారని వివరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించి సర్వమత ప్రార్ధనలు చేశారు.