కథ

ఓమం అరకు, కాయం లడ్డు (సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దా శంకరరావు తలవంచి సులోచనాలు, కనుబొమల మధ్యనున్న ఖాళీలోంచి, ‘సి.ఎస్.ఆర్. ఆంజనేయులు’ పేటెంటు చేసిన కుటిల లోచనాలతో వాళ్ల వంక చూశాడు. వాళ్లిద్దరూ దంపతులు! అరుణ్’ వివేక్, విజయలక్ష్మి వాళ్ల పేర్లు. ఇద్దరూ ఈడుజోడు చక్కగా కుదిరి ‘మామిడికాయ, పెసరపప్పుల’ కాంబినేషన్‌లా బాగున్నారు అనుకొన్నాడు ఆ కుటిల లోచనుడు. ‘కాపీరైటు’ లేకుండానే సదరు చూపుల్ని స్వంతం చేసుకొన్న ఆ పేరింటిగాడు, ‘విశ్వాత్మ కో ఆపరేటివ్’ బ్యాంక్ మేనేజర్. అతడు మామిడికాయ పెసరపప్పుల వంక ఒక పర్యాయము (పర్యాయము = పరి+ఆయము = తక్షణ రాబడి) చూసి, వచ్చే అవకాశం లేదని గ్రహించి, ‘డాక్యుమెంట్లు అన్నీ సరిగానే ఉన్నాయా?’ అని అడిగాడు.
‘ఇప్పటికి పదిసార్లు తిరిగి, వచ్చినప్పుడల్లా అడిగిన క్వైరీలకి క్లారిటీలు ఇచ్చి పూర్తి చేసాము సర్! అన్నీ సరిగానే ఉన్నాయి’ అన్నాడు అరుణ్’ వివేక్. తన ఫైలుని ముందుకు తోస్తూ. దానిని యథాలాపంగా తిరగేసి, ‘బిజినెస్సు కోసం లోను’ కావాలని అడిగారు. మీరు చేసే వ్యాపారం వివరాలు కూడ ఇచ్చారు. మీ కుటీర పరిశ్రమలో ప్రొడక్ట్ ఏమిటి? సరిగా అర్థం కాలేదు!’
‘ఉదర ఆరోగ్యానికి సంబంధించిన ప్రొడక్ట్ సర్! ‘ఓమం అరకు, కాయం లడ్డు’ ఈసారి విజయలక్ష్మి జవాబిచ్చింది.
‘ఈ రోజుల్లో వీటికి మార్కెట్టు ఎక్కడ ఉందమ్మా?’
‘విపణి వివరాలు, ఆదాయం, ఖర్చులు అన్నీ ఇచ్చాము సర్!’
‘సర్! అరుణ్‌గారూ! ఓమం అరుకులో ఉండే రసాయనాల పేర్లు ఉటంకించారా?’
‘అంటించాము సర్! వాటి పేర్లు ‘ఓమం గింజలు, తులసి దళాలు, నల్ల మిరియాలు, ఎండిన అల్లంపొడి, లవంగాలు, పసుపు, బెల్లం, ఇంకా మంచినీరు. ఇకపోతే ఓమం గింజలలో మినరల్స్, విటమిన్స్, ఏంటీఆక్సిడెంట్లు పీచు ఉంటాయి. దీనిలోని ‘్థయ్’మోల్’ అనే రసాయనంలో ఏంటీ మైక్రోబయిల్’ ఉంటుంది..’
‘ఆపవయ్యా, ఆపు! మీరు ఎన్ని గుణాలు చెప్పినా ఈ వస్తువు వ్యాపారం మీద, తదుపరి వచ్చే ఆదాయం మీద, మా బ్యాంక్‌కి నమ్మకం లేదు! అయినా ప్రభుత్వ కుటీర పరిశ్రమ ప్రోత్సాహక పథకం కింద సగానికి సగం అంటే 50 శాతం పెట్టుబడి మీరు పెట్టుకొంటే మా బ్యాంక్ తక్కిన 50 శాతం ఇస్తుంది.’
అరుణ్‌లోని వివేకం మేల్కొంది. విజయలోని లక్ష్మి కూడా. ఆమెకి అర్థమయేలా చేసింది, ఇక్కడ లోను దొరకదని! వాళ్లిద్దరూ ఒకటే మాట, ఒకటే బాట మాదిరి ఒకే క్షణంలో లేచారు. ‘ఓమం అరుకు’ తీసుకొన్న తరువాత జరిగే ప్రక్షాళనం లాగ మాకు మీ అభిప్రాయం స్పష్టమయింది సర్! వెళ్లి వస్తాము’
‘తిరిగి వస్తారా?’
‘లేదు! ‘వెళ్తాము’ అన్న మాట చెప్పకూడదని పెద్దలంటారు గనుక వెళ్లి వస్తాము అని అన్నాము’
‘పెద్దల మాట చద్ది మూట అంటారు. మీకు పెద్దలపైన గౌరవం ఉన్నందుకు ఆనందం కలిగింది’
‘అవును సర్!’ విజయలక్ష్మి జవాబిచ్చింది. ‘అపకారికి కూడా ఉపకారం చెయ్యమని అంటారు...’
‘నాకు ఎలాంటి ఉపకారం చేస్తావమ్మా?’
‘మీకు అంటే మీ బ్యాంక్‌కి, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మీ బ్యాంక్ సైన్ బోర్డుకి’
‘సైన్ బోర్డుకి ఏమయింది?’
‘ఆ సైన్‌బోర్డ్ అక్షరాలని మూడేళ్ల క్రితం ‘ఆల్కో పీనల్’తో తయారుచేయించారు కదా! ఆ అక్షరాలు తమ రంగుని, తళుకుబెళుకులని కనీసం 10 ఏళ్ల వరకు కోల్పోకూడదు! కాని మీ టైటిల్స్ అప్పుడే వెలవెల బోతున్నాయి’
విజయ మాటలకి సి.ఎస్.ఆర్. ఖంగు తిన్నాడు. ‘అంటే మేము పెట్టించిన పేనల్ అక్షరాలు నకిలీవా?’
‘అవును పేనల్ నకిలీది. వాటి కోసం 30 లక్షలు ఖర్చు పెట్టారు కదా?’
సి.ఎస్.ఆర్. తన కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. ‘నిజమే! మా బ్యాంక్ సైన్‌బోర్డు వెలవెల పోవడమనేది మా ఆంతరంగిక విషయం! అయినా సూటిగా చెప్పినందుకు ధన్యవాదాలు! ఇంక దయ చెయ్యండి!’
‘బ్యాంక్‌లో ఉండేది ప్రజాధనం! బ్యాంక్ దానికి కేవలం ట్రస్టీ మాత్రమే! అలాంటప్పుడు ఈ వ్యవహారం ఆంతరంగికం ఎలాగయింది? మమ్మల్ని, క్వైరీలు వేసి త్రిప్పుతున్నప్పుడే మీరు లోను ఇవ్వరని తెలిసిపోయింది. అందుకే సైన్‌బోర్డు సంగతి మీ బ్యాంక్ డైరెక్టర్‌గారికి లేఖామూలకంగా సూచించాము! సెలవు!’ అంటూ ఆ దంపతులు విసవిసా నడుచుకొంటూ వెళ్లిపోయారు.
* * *
ముకుంద్ స్టీల్ ఫ్యాక్టరీ డిజిఎం ‘ఆర్‌టిఐ’ ఫైలుని చూసి గాభరాపడ్డాడు. అల్యూమినియం కాంపోజిట్ పేనల్స్ వాటి రంగుని, కాంతిని ఎంతకాలం వరకు కోల్పోకుండా ఉంటాయి? మీ ఫ్యాక్టరీలో చేసిన సదరు పేనల్ అక్షరాలని, విశ్వాత్మ బ్యాంక్ తమ సైన్‌బోర్డులో ఉపయోగించిన 3 సంవత్సరాలకే అవి ఎందుకు తెల్లబోయాయి? అన్న ప్రశ్న అది! అతను వెంటనే జవాబు ఇవ్వాలి! ఆ సమయంలో తను పదవిలో లేడు, అయినా జవాబుదారీ తనదే! టెలిఫోన్ త్రిప్పి, పాత మేనేజర్‌ని సలహా అడిగాడు. అతని సమాధానం విని దిగ్భ్రాంతి చెందాడు.
వెంటనే కారులో ‘ముత్తుస్వామి’ చిరునామా వెతుకుతూ అక్కడకి చేరుకొన్నాడు. ముత్తుస్వామి ఆ ఫ్యాక్టరీలో ఖలాశీగా పనిచేసి, విశ్రాంతి తీసుకొంటున్న వ్యక్తి. అతను చెప్పిన నిజం ఇది! విశ్వాత్మ బ్యాంక్ ఒక కాంట్రాక్టర్‌కి, ఆల్కో పేనల్‌తో అక్షరాలు వ్రాయించే పని ఇచ్చారు. వాళ్లు అడిగిన కలర్ వైలట్! కాని తయారయిన కలరు ‘బ్లూ’ 3 లేక 4 పేనల్స్ కోసం మళ్లీ పెద్దఎత్తున వాటిని తయారుచేయడం సాధ్యం కాదు! రంగుని ‘బ్లూగా ఎలా మార్చాలో వాళ్లకి తెలియలేదు.
అంతలో ఒక అద్భుతం జరిగింది. ముత్తుస్వామి భోజనం తర్వాత ఎప్పుడూ వాడే ‘ఓమం అరుకు’ ఒక పేనల్ మీద పొరపాటున పడి మచ్చ కట్టింది. దానిని శుభ్రం చేస్తే అది బ్లూ రంగు అయిపోయింది!’
‘మీరు జరిగిన దానిని చెప్పి ఒప్పుకోకండి సార్! ఆ కాంట్రాక్టర్ మనం సప్లయి చేసిన పేనల్‌నే వాడాడని ప్రూఫ్ ఏది? అని వాదించండి’ సలహా కూడా ఇచ్చాడతను. దాంతో డిజిఎం బలం పుంజుకొన్నాడు!
* * *
విశ్వాత్మ బ్యాంక్ పేపర్‌లో ప్రకటన ఇచ్చింది. తమ సైన్‌బోర్డు అక్షరాలని కలరు వేయించి, మెరిసిపోయేలా చేసే టెక్నాలజీ ఎవరి దగ్గరైనా ఉందా?’ అని! దానికి ‘గీతాంజలి సేవా సంస్థ’ ఆ పని చేయగలమని జవాబు ఇచ్చింది. పీజు 2 లక్షలు అని! గతిలేక వారి ప్రతినిధులని ఆహ్వానించారు బ్యాంక్ యాజమాన్యం. ఈసారి గీతాంజలి సంస్థ తరఫున అరుణ్, విజయ వచ్చారు దానిని సరిచేయడానికి!
‘మీరేమిటి ఇలా వచ్చారు?’ అడిగాడు కుటిల లోచనుడు.
‘మీ బ్యాంక్ అక్షరాలని మెరిసేలా చేసేందుకు వచ్చాము!’
‘ఎలా చేస్తారు?’
‘వాటి రంగు రహస్యం మాకు తెలుసు! దాన్ని మేము కాయం లడ్డుతో స్క్రబ్ చేసి శుద్ధి చేస్తాము. ఆ తరువాత ఓమం అరుకుతో బ్లూ కలర్ వేసి సరిచేస్తాము.’
* * *
విశ్వాత్మ బ్యాంక్ బోర్డు డైరెక్టర్ల మీటింగ్ జరిగింది. నేరమంతా కాంట్రాక్టర్ మీద వేసి, ముకుంద్ స్టీల్ ఫ్యాక్టరీ తప్పించుకుంది. ఆ కాంట్రాక్టర్ ఇదంతా తాను మేనేజర్‌కి విన్నవించుకొన్నానని, అతను లంచం తీసుకొని ఆమోదించాడని చెప్పాడు. దాంతో జరిగిన నష్టానికి, అతనిని మేనేజర్ పదవి నుండి తప్పించి ఎకౌంటెంట్‌గా మార్చారు. మరొక బ్రాంచికి బదిలీ చేసి! తమ నష్టాన్ని ఇఎంఐల ద్వారా రాబట్టుకొంటామని, అందుకే డిస్మిస్ చేయలేదని వివరణ కూడ ఇచ్చారు!!
కొత్త మేనేజర్‌ని చూశాక సిఎస్‌ఆర్ మనసులో భావనా భ్రమరాలు చెలరేగాయి! 5 ఏళ్ల క్రితం ‘లోను’ అడిగిన పార్టీ దగ్గర, ఒక పర్యాయం పుచ్చుకొన్న కుటిల లోచనుడు తన మీద నిఘా వేసి, నిజం తెలుసుకొన్న, అకౌంటెంట్‌ని ఎంతో చాకచక్యంగా, అదే నేరం మీద ఇరికించి ఉద్యోగం ఊడగొట్టించాడు! అదే వ్యక్తి తన స్థానంలో నియుక్తుడయ్యాడు.
సిఎస్‌ఆర్ ఒక బోర్డు మెంబరు దగ్గర నిజానిజాలు రాబట్టాడు. గీతాంజలి సేవా సంస్థ బ్యాంక్‌లో 51 శాతం షేర్లు కొన్నదని, ఆ సంస్థ తీసుకొన్న నిర్ణయం ప్రకారం శిక్ష పడిందని చెప్పాడతను.
కుటిల లోచనుడు సామాను సర్దుకొంటూ, తన దగ్గరికి వచ్చిన అరుణ్ విజయలని చూసి అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. ‘మీరు ఎందుకు వచ్చారిక్కడికి?’ అంటూ.
అరుణ్ జవాబు చెప్పాడు. విశ్వాత్మ బ్యాంక్‌లో 51 శాతం షేర్లు కొన్న, గీతాంజలి సేవా సంస్థ యజమాని తమ తండ్రి ముత్తుస్వామి అని, కుటిలుని కౌటిల్యానికి గురి అయిన అకౌంటెంట్ తన తమ్ముడే అని!
సి.ఎస్.ఆర్. గొంతులో వెలక్కాయ, కడుపులో ఓమం అరుకు, కాయం లడ్డు పడ్డాయి!!

అయలసోమయాజుల శ్రీ్ధర్.. 9022567037

-అయలసోమయాజుల శ్రీధర్