వీరాజీయం

ముదురుతున్న ఎండలో వేడెక్కిన రాజకీయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజురోజుకీ మరింత ఎండ.. ఈ సమ్మర్ ‘డింగ్ డాంగ్ హెల్’.. గత ఆదివారమే మచ్చు చూపెట్టింది విరోధకృతి తన వికారాకృతి. ఈ ఏడాది ఎండలు మెండుగా కాయును.. అని మన వాతావరణ పరిశోధన సంస్థ అనగా ఇండియన్ మెటిరియలాజికల్ డిపార్టుమెంటు చెప్పేసింది. దానికి తగ్గట్టు గత ఆదివారమే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో ఐ మీన్- ఇండియాలో పాదరసం నలభై డిగ్రీలకి నిచ్చెన ఎక్కేసింది. మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తా ఆంధ్ర, కర్నాటక, గుజరాత్, కొంత మధ్యప్రదేశ్ మరికొంత ఒడిశా దాకా ఎండ కొరడా పట్టుకుని ముందుగానే దిగిపోయింది. ‘ఓరి నాయనోయ్.. ఫిబ్రవరి నెలాఖరుకే ఇలా ‘ఇలాతలం’ అంతా మండిపోతే ప్రదర్శనలు ధర్నాలు, చుట్టుముట్టడాలు ఇవన్నీ ఎట్లా? అవి రెడీ అవుతున్నాయే.. వాటికి సీజను కూడా ఇప్పుడే రావాలా? పైగా పాదయాత్రల మధ్య ఇరుక్కున్న వాళ్ళ గతి ఏమిటి? ఈ నెలలోనే వస్తుంది తెలుగువారి ఉగాది పండుగ. కానీ, కాని తొందరపడి ఓ కోయిలా విరోధికృతికి కుహూ కుహూ మంటూ మార్చి మొదటివారం లోపే పిలుపు ఇచ్చేసింది. అలా అనుకుంటే మన పంచాంగం మాత్రం మొన్న వెళ్లిపోయిన సంక్రాంతికే విడుదల ఐపోయింది కాదా? అయినా గవర్నమెంటు కల్చర్‌ని కాపాడాలనే ఉద్దేశంతో పంచాంగ శ్రవణం లాగిస్తుంది.. ఎవరి యోగం కర్మం వాళ్ళవి.. ఏ రాష్ట్ర పురోహితుడు ఆ రాష్ట్రం సుభిక్షంగా సాగిపోతుంది అంటాడు. అలా పడకపోతే దావా తెస్తారా? ఇచ్చిన సంభావన లాగేసుకుంటారా? అంతా అపుడే మరచిపోతారు.
మన రాహుల్జీకి గోచారం చెప్పేవాడు కావాలి ఇపుడు. పార్టీని బలోపేతం చెయ్యలేనివాడు సామాన్య సభ్యులకి తల భారం అవుతాడని ఒక అభిమాని చెప్పి ఎర్రటి ఎండలాగా చేశాడు. ఈ ఏడాది ప్రభుత్వానికి ప్రాజెక్టులు, ప్రయోగాలు కలిసి వచ్చును అని ఆర్భాటంగా ఖజానా సొమ్ములతో చెప్పించుకోక మానరు మనవాళ్ళు. కానీ అయ్య వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా? ఎండ ‘ఆగయా’.. అన్నట్లు ఎండలు ఔటరు దగ్గర ఆగిన గూడ్సు బండిలాగా వున్నాయి. ముహూర్తం చూసుకోకుండా మార్తాండుడు దూకుడు చూపెడుతున్నాడు. పాదయాత్రలు చేసేవాళ్లకి- వాళ్ళకి ఊరవతల స్వాగత ద్వారాలు కట్టేవాళ్ళు, మహజర్లు వినతులు గట్రా ఏర్పాటుచేసే వాళ్ళు, దాహాలకి తట్టుకోలేక కోకిల కూతలకి బదులు, కాకి అరుపులు పెడుతున్నారు.
మనకి పాదయాత్రల కల్చరొకటి దాపురించిందిగా. మొదట్లో రాజశేఖర్‌రెడ్డి ఓసారి కాకపోయినా మరోసారి గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో పాదయాత్రలు ప్రజాస్వామ్య దేవతకి ముడుపులయిపోయాయి. మన ‘నారా’ గారు ఈ విషయంలో ఎక్సపర్టుగా వాసికెక్కేడు. జగనన్న జగతిన వున్నది ‘ఈ ఒక్కటే నాకు’ అని పట్టు విడవని విక్రమార్కుడి మాదిరి నడక విరామ మెరుగక విశ్రమించక ‘అకేలా చాల్’ అంటూ సాగిపోతున్నాడు. అయితే, ‘నమో’ గారికి ‘కాంగ్రెస్సు’ని తిడితే- ఎక్కడలేని ఉత్సాహం బలం వచ్చేసినట్లు ఎండాలాగా అయిపోతాడు. కాంగ్రెస్ హఠావో వికాస్ బచావో అంటాడాయన- జగనన్నకి ‘నాయుడు హఠావో - రాజన్న రాజ్యం లావో’ అన్నదొక్కటే స్లోగన్. దానే్న ఎలాగైనా ఒక పాశుపతాస్త్రంగా చేసుకోవాలని జగన్ యాత్ర సాగిస్తున్నాడు. అతని అభిమానులు పగలు అరిగిన తమ కాళ్ళను రాత్రి ఎవరివి వాళ్ళే పట్టుకుంటూ- దాహం ఎక్కువై ఏదో ఒక ‘చుక్క’తో తీర్చుకుంటూ నానా తంటాలు పడుతున్నారు. అది అలాగా సాగనివ్వండి.
నవ్వినా నాపచేను పండావచ్చు అని.. అంటారు అన్న భక్తులు. అయితే ఈ ఆశయాల యాత్రలకి ఓ సెమీకోలను పెడదాం అంటున్నారు. ‘బ్రతికుంటే పకోడీల కొట్టు లేదా చాయ్ బడ్డీ పెట్టుకుని ఈ జీవనయాత్ర సాగించుకుంటాం. అంతలో ప్రత్యేక హోదా ఎక్కడికీ పోదూ.. ప్రజాస్వామ్యమూ ఎక్కడికీ పోదూ’ అని కష్టజీవుల గోడు. జగనన్న పోయినసారి సమ్మర్‌లో లండన్‌కి చెక్కేసినట్లు ఈసారి కూడా హాలీడేకి పోడు అని నమ్మకం ఏమిటి? కాని దేశంలో ఏప్రిల్, మే నెలలు కదిలాడూ అంటే అంతే సంగతులు అన్నాడో వీరాభిమాని. ఇదుగో మన రాహుల్ గాంధీ మహాశయుడు.. ఇవతల మేఘాలయా కరువులో అధికమాసంలాగా కాసిన్ని ఆశలు కురిపిస్తే సరిగ్గా ఆ టైముకి ఇటలీకి రెక్కలు కట్టుకుని వెళ్లిపోయాడండీ! ఎందుకు నార్త్- ఈస్ట్‌కి విరాళాలు పోగెయ్యటానికా? కాదుట- టీవీ చానల్స్‌వారి సమాచారం ప్రకారం అక్కడ వాళ్ళ అమ్మమ్మగారితో హోలీ ఆడటానికిట! ఇప్పటికీ వాళ్ళ అమ్మగారే పార్టీ అధ్యక్షురాలు అనుకుంటున్నాడేమో? అన్నాడో పెద్దాయన. పోయినసారి గోవాలో ఛాన్స్ వుండి ఫణిక్కర్ మహాశయుని ట్రిక్కుకి దిమ్మతిరిగి పడిపోయాడు అప్పటికి ఉపాధ్యక్ష పదవిలో వున్న రాహుల్ ద ప్రిన్స్. ఆ పాపాల భైరవుడు- డిగ్గీ భయ్యా ఉన్నాడుగా, అతను ముంచాడు అని రాహుల్ అన్నాడు.. మణిపూర్‌లోనూ అంతే...
కొత్తగా గద్దెమీదకి ఎక్కిన భాజాపా చేతిలో. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ మాదే. ‘మా తాతలు త్రాగిన అచ్చావు పాలు మా మూతులకు ఇంకా వాసనగా మిగిలేయి’ అంటూ ప్రగల్భాలు పలికిన పార్టీకి యంగ్ ప్రెసిడెంటు అయినాక కూడా తాటిచెట్టు ఎందుకు ఎక్కావయ్యా? అంటే దూడ గడ్డికి అన్న సామెత చందాన ‘హోలీ రే హోలీ’ అని ఇటలీకి వెళ్లాడుట. ఏమో మనం నమ్మకూడదు లెండి, ఈమధ్య అందరూ వాట్సాప్ మార్కు వార్తలు పుట్టిస్తున్నారు అన్నాడో అమాయకుడు. పైగా కిరీటం పెట్టుకున్నాకా కూడా ఇంకా ముద్దులు కురిసే చినబాబుకి మోదీజీ పెద్ద మొట్టి ఒకటి వేశాడు. ఎక్కడైనా స్లోగన్లు నీతులు- మన్‌కీ బాత్‌లు అవీ వుంటాయేమోగానీ అధికార పీఠం దక్కించుకునే చోట మొహమాటాలు, విదుర నీతులు వల్లించడం మోదీ, అమిత్ షాలకి అస్సలు అలవాటు లేదు. పైగా ప్రజాభిప్రాయాన్ని కాదని మేఘాలయని లాగేసుకున్నారు అంటూ లాలీపాప్ డయలాగులు చెప్పేసరికి కాంగ్రెస్సుని నిజంగా ప్రేమించే పాత కాలపు శాల్తీలు కూడా ముక్కున వ్రేలేసుకున్నారు. ఈశాన్యంలో కమ్యూనిస్టుల్ని బెంగాలీలు ఎక్కువగా వున్న ఎర్రకోటని జై బాహుబలి అని పెకలించిన ‘నమో’కి నాగులకు నాగస్వరం పట్టడం కష్టమా? రాజకీయాలలో దిగాకా- పంచాంగంలో లేదు.. అయినా గాలి వాన వచ్చింది ఏమిటి?- అనే నెహ్రూ కుటుంబీకున్ని ఏమనాలి? అడిగాడో ఇందిరమ్మ అభిమాని. ఇందిరాగాంధీ మనుమడేనా వీడు? సోనియా మాతకి అయినా ఇరవై ఏండ్ల అనుభవం వున్నదే! కాని కొన్ని విషయాలు తెలియజెప్పాలి.
దరిద్రం కరప్షనుని త్రోలేస్తాను- సబ్‌కా సాత్ సాబ్కి వికాస్ అంటే ‘కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకి దేశంలో వున్న మూడు సముద్రాలలో ముంచేస్తాను’ అని అర్థం. ఈ సంగతి దేశంలో అందరికీ అర్థం అయిపోయింది. మిగతా పార్టీలు మిగతా రాష్ట్రాలు పీడకల కన్నట్లు ఉలిక్కిపడేలా చేసింది ఈ బుల్లి ఎన్నికల యుద్ధం. నలభై లక్షల జనాభా వున్న రాష్ట్రంలో ఏడున్నర లక్షల నిరుద్యోగులు వున్నారంటే, ఆ వోటర్లే గాదు మన వోటర్లే అయినా సదరు పార్టీని ముక్కుకి గారె ముక్క కట్టి చెట్టు క్రింద నిలబెడతారు. ఈ ఎన్నికలు ఎండాకాలాన్ని పెట్రోలు పోసి మరింత మంట ఎక్కించినట్లు ముందే వేడిమి తీసుకువచ్చాయి. గన్స్ కాదు స్లోగన్స్ ప్రేల్చారు మహాత్మా గాంధీజీ అని.
ఈ మోదీజీది కూడా గుజరాతే. ముందు అసలు గాంధీగారిని హైజాక్ చేశాక సదరు పార్టీకి ఎసరుపెడుతున్న ‘నమో’ పాలసీని ఎదుర్కోవాలి అంటే- ఏమి కావాలి? అందరూ స్లోగన్లను అంత గట్టిగా ప్రేల్చగలరా? అందుకే ఎండలు ముందుగానే వచ్చాయి అనడం. ఆ విద్య, ఆ శక్తి ఆ ‘ఆ ఇది.. ఆ అదీ’ ఇవన్నీ నరేంద్రదాస్‌కి దాసోహం అనే అస్త్రాలు...దేశంలో మిగతా పార్టీలు కాంగ్రెస్‌ను మినహాయించి కూటమి కడతాం అని కోడై కూస్తూవుంటే న్యాయం, ధర్మం- సోకాల్డ్ ప్రజాభిప్రాయం నాకే వుంది అంటూ నంగిరి వేషాలు వేస్తూ సానుభూతి కోసం ప్రాకులాటలు వేస్తే? ఇలాగే మేఘాలు మ్రింగేస్తాయి. ఇవాళ కమ్యూనిస్టు పార్టీని కార్మికుల శ్రేయస్సుని వేరు చేసి చూడటం చేస్తున్నారు విజ్ఞులు. ప్రతి పార్టీకి లేబర్ వింగు వుంది. ఐతే, ఎండ అన్నానే- అది భాజపాకి కాస్తోంది. మిగతా పార్టీలకి అప్రమత్తం అయ్యే ఛాన్స్ కూడా హై అనగా గలదు..
కావున, కాంగ్రెస్ ప్రెసిడెంటే ప్రధాని కావాలని రూలా? ఓ కొత్త యంగ్ అభ్యర్థిని- ప్రధానిగా ప్రకటించండి. దేశం కదా ముఖ్యం.. ఉదాహరణకి సచిన్ పైలట్ పేరు చెబుతారు అనుకుందాము.. ఏమవుతుంది? దేవెగౌడలే పాలించిన దేశం.. ఏమీ అవదు.. అనుకుని కొత్త మొహాలతో వర్కింగు టీమ్‌ను తయారుచేసుకుని ముందుకు పోదాం అన్నది ఒక మార్గం.. లేదూ గట్టి ప్రెసిడెంటుని వేరే పెట్టుకుని రాహుల్‌జీని ప్రధాని అభ్యర్థిగా అనుకోవడం. ‘డూ ఆర్ డై’ అనే వారు మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ గారు. అలాగా కాయకల్ప చికిత్స అవసరం. సారీ.. ఈశాన్యం కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్.. భాజపాకి కూడా సవాల్!
డేస్ ఆర్ గాన్ ఫర్ స్లోగన్స్.. డూ ఆర్ డై..
*

veeraji.columnist@gmail.com