మీ వ్యూస్

అజ్ఞాతంలోకి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘అజ్ఞాతవాసి’ విడుదలకు ముందు ఫస్ట్‌లుక్‌ని రికార్డు స్థాయిలో కోటిమందికిపైగా వీక్షించారనీ, రిలీజ్ ముందే 120 కోట్ల బిజినెస్ చేసి మరో రికార్డు సాధించామని చానల్స్ టాంటాం చేశాయి. సినిమా విడుదల మొదటిరోజు ఆ చిత్రం మీద వచ్చినన్ని జోక్స్ మరే చిత్రానికీ రాలేదు. రెండో రోజు గడిచాక సగం థియేటర్లు జారిపోయాయి. వారం తిరిగేసరికి మొత్తం వసూళ్లు యాభైకోట్లే! ఏం సినిమా తీసేవయ్యా త్రివిక్రమయ్యా! బయ్యర్లను నిలువునా ముంచేశావు కదయ్యా! పెట్టుబడి, కలెక్షన్లు బేరీజు వేస్తే ‘జై సింహా’ కాస్త మెరుగు అనిపించింది. ‘అజ్ఞాతవాసి’ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
-శాండో ప్రచండ్, శ్రీనగర్

గెడ్డాల హీరోలు!
పూర్వం ఓ సినిమాలో జెడి చక్రవర్తి గెడ్డంతో కనిపిస్తే- హీరోయిన్ అంటుంది ఏమిటా గెడ్డం? అని. అది నీకడ్డమా అంటాడు హీరో. అంతటి అసహ్యాన్ని ఈరోజు ఫ్యాషన్ చేశారు. హీరోలందరూ నేడు పెరిగిన గెడ్డాలతో నటిస్తున్నారు. ఇక హీరోయిన్లందరూ జడలు వేసుకోకుండానే జుట్టు విరబోసుకుని, పువ్వులు పెట్టుకునే అవకాశం లేకుండా బొట్టు కూడా పెట్టుకోకుండా సంప్రదాయ విరుద్ధంగా వికటంగా తెరమీద తక్కువ దుస్తుల్లో కనిపిస్తున్నారు. సమాజంలో నేటి యువత పెడదోవ పట్టడానికి దోహదపడే ఇటువంటి దుస్తులను ధరించడాన్ని నిషేధించాలి.
-లక్ష్మీరామం, సికిందరాబాద్

ఆత్మీయత!
అలనాడు తెలుగు తమిళ చిత్రసీమల్లో ఉండిన ఆత్మీయతను తెలియజేసే విషయం- దర్శకుడు పి.పుల్లయ్యని అందరూ ఆప్యాయంగా డాడీ అని పిలిచేవారు. ఎంజిఆర్ మాత్రం అన్నా అని పిలిచేవాడు. ఎంజిఆర్ ముఖ్యమంత్రి అయినపుడు జరిగిన సన్మాన సభకు శివాజీ గణేశన్ కూడా వచ్చాడు. అయితే ఎంజిఆర్, శివాజీల మధ్య సయోధ్య లేదు. అందువల్ల తన గురించి పుల్లయ్య చెడుగా చెప్తాడేమోనని శివాజీ భయం. కాని పుల్లయ్య ‘‘నా తల్లిదండ్రులకు నేనొక్కడినే సంతానం. ఆలోటు తీర్చడానికి నాకు ఎంజిఆర్ అనే తమ్ముడు దొరికాడు. నాకు ఇద్దరు అమ్మాయిలే. అబ్బాయిలు లేరు. ఆ కొరత తీర్చడానికి శివాజీ ఉన్నాడు’’ అని చెప్పాడట. హాలు అంతా చప్పట్లతో దద్దరిల్లిపోయిందట.
-శాండి, కాకినాడ
అంజలియే సీతమ్మ!
అంజలిదేవి నటించి మెప్పించిన సీతమ్మ పాత్రను గతంలోనూ ఆమె తరువాత ఎంతమంది నటించినా సీతమ్మ పాత్రలో అమోఘంగా జీవించి ప్రేక్షకులను తరింపజేసిన అంజలిని మించిన వారెవరూ లేరనే చెప్పక తప్పదు. లవకుశ సినిమా ఓ అద్భుత కళాఖండం. సినీ మ్యూజియంలో ఓ రిపరల్ ఈవెంట్‌గా పూజించపబడే మహత్తర చిత్రరాజమిది. రాముడి వియోగంలో సీత ఎంత మానసిక క్షోభననుభవించిందో అంజలి తన నటనా వైభవంతో అంతగానూ అలరించింది. ముఖ్యం గా అశ్వమేథయాగం నుండి తల్లి భూదేవిని చేరేవరకూ అంజలి అభినయం మరిచిపోగలమా?
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్
భక్తి చిత్రాలు రావాలి!
తెలుగు చిత్రాలలో ఒకప్పుడు భక్తి సినిమాలు బాగా వచ్చాయి. పౌరాణిక చిత్రాలు వచ్చాయి. సూపర్‌హిట్ అయ్యాయి. ఆ చిత్రాల్లోని డైలాగులు, పాటలు, పద్యాలను నేటికీ మరచిపోలేని ప్రేక్షలున్నారు. కానీ రాను రాను నిర్మాతలు వాటిని మరచిపోయి ప్రేక్షకులకు మాస్ చిత్రాల రుచిని చూపించారు. ఫలితంగా భక్తి సినిమాలు రావడంలేదు. ఏడాదికి ఒకటో అరో వస్తున్నాయి. ఆమధ్య కొన్ని సినిమాలు వచ్చి విజయం సాధించినా ఈమధ్య భక్తి సినిమాలు పూర్తిగా తగ్గాయి. మంచి కథ, కథనాలతో తీసే దమ్ము ఉండాలే కాని భక్తి చిత్రాలు ఎప్పుడూ విజయం సాధిస్తూనే ఉంటాయి. శివరాత్రి, శ్రీరామనవమి వంటివి వివిధ దేవుళ్ళకు సంబంధించిన ఎన్నో పండుగలు వచ్చిపోతున్నాయి. ఆయా పండగ సమయాల్లోనైనా ఆయా దేవుళ్లకు సంబంధించిన భక్తి చిత్రాలు తీసి విడుదల చేయవచ్చు కదా! పైగా టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి భక్తి సినిమాలు, పౌరాణిక చిత్రాలను తీయాలి. కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటే చిత్రాలు ఘన విజయం సాధిస్తాయి. పాటలు కూడా కలకాలం దాచుకొని పాడేలా ఉండాలి. ప్రేక్షకులలో పౌరాణిక జ్ఞానం పెరగాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
భ్రమలు వద్దు!
కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీసే నిర్మాతకే టికెట్ ధర నిర్ణయించే హక్కు ఉండొచ్చు. నిజమే, కాని ‘మా సినిమా మా ఇష్టం’ అనే రీతిలో ధర పెంచితే ‘మీ సినిమా మీరే చూసుకోండి’ అంటూ ప్రేక్షకులు దూరమయ్యే ప్రమాదం ఉంది. టమాటా, ఉల్లి ధరలు వంద అయినపుడు వారానికి రెండు కిలోలు బదులు అరకిలో కొనేవారు. నెల రోజుల్లో ధరలు తగ్గేవి. సినిమాలూ అంతే. టిక్కెట్ పెరిగితే 2, 3 సార్లు చూసేవారు ఒకసారే చూస్తారు. టికెట్ పెంచినంత మాత్రాన కలెక్షన్లు పెరుగుతాయన్న భ్రమలు వద్దు.
-చంద్రిక, రాజేంద్రనగర్
‘పద్మావత్’ మ్యాజిక్!
చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూయర్, బాజీరావు మస్తానీ చిత్రాలతో విశేషంగా ఆకట్టుకున్న దీపికా పదుకొనె ‘పద్మావత్’గా నట విశ్వరూపం చూపింది. తన క్యారెక్టర్ ద్వారా ప్రేక్షకులను 13వ శతాబ్ద కాలంలోకి తీసుకెళ్లిందా? అనే సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తింది. సంజయ్ లీలా భన్సాలీ ‘పద్మావత్’ చిత్రాన్ని ఒక కళాఖండంగా తీర్చిదిద్దారు. దీపిక, షాహిద్ కపూర్, రణ్‌వీర్‌సింగ్ నటనకు జోహార్లు అర్పించక తప్పదు. తెలుగులో భాగమతి, హిందీలో పద్మావత్ చిత్రాల విజయం నిజంగా అద్భుతం.
-పి.శ్రీనివాసరావు, కర్నూలు