ఈ వారం కథ

అనుకరణ హితకథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోఫాలో కూర్చున్న నియా రిమోట్‌తో అనేక చానల్స్‌ని తిప్పి, చివరికి ఒకటి చూడసాగింది. అది రియాల్టీ షో. సరిగ్గా ఆ సమయానికి నియా ఆరేళ్ళ తమ్ముడు వచ్చాడు.
‘ప్రతిధ్వని ఆట ఆడుదామా?’ నియా వాడిని అడిగింది.
‘‘అదేం ఆట? ఎలా ఆడతారు?’’ అడిగాడు.
నియా చిన్నగా నవ్వి తమ్ముడి మాటల్ని మళ్లీ పలికింది.
‘‘అదెలా ఆడతారు?’’
‘‘నాకేం తెలుసు? నువ్వే చెప్పు’’
‘నాకేం తెలుసు? నువ్వే చెప్పు’ నియా మళ్లీ వాడి మాటలనే వాడిని అనుకరిస్తూ రిపీట్ చేసింది.
‘‘అమ్మా! వచ్చి చూడు’’ వాడు పక్క గదిలోని తల్లికి వినపడేలా అరిచాడు.
నియా మళ్లీ ఆ మాటలనే పలికింది. తల్లి ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి హాల్లోకి వచ్చింది.
‘‘అమ్మా! అక్క చూడు. నేనేం అంటే అదే అంటోంది’’ చెప్పాడు.
‘అమ్మా! అక్క చూడు.. నేనేం అంటే అదే అంటోంది’ నియా పలికింది.
‘‘నియా! నువ్వు హోంవర్క్ చేయాల్సిన టైమైంది.. వెళ్ళు’’ తల్లి చెప్పింది.
నియా హోం వర్కు చేసుకుంటూంటే తల్లి కొద్దిసేపు టీవీలోని రియాలిటీ షోని చూసి దాన్ని ఆపేసింది.
‘‘ఈ గేమ్ షో ఎందుకు పాపులరైందో తెలుసా?’’ నియాని అడిగింది.
‘‘ఒకరు చెప్పింది ఎంత పెద్ద వాక్యమైనా వాళ్లలా నటిస్తూ, వాళ్ళు చేసింది సరిగ్గా అలా చేస్తూ రిపీట్ చేయగలగాలి. చాలామంది ఓడిపోతూంటారు’’.
‘‘గేమ్ షో సంగతి అలా ఉంచు. జీవితంలో మనం ఇష్టపడే మనుషుల్ని అనుకరించడానికి ప్రయత్నిస్తాం. ఉదాహరణకి నువ్వు టీవీ ఏంకర్లా గబగబా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు. ఇంకో ఏంకర్లా జుట్టుని నుదుటిమీదకు వేసుకుంటున్నావు. కాని మనం అనుకరించాల్సింది వీళ్ళని కాదు. వేరొకర్ని’’
‘‘వేరొకర్నా? ఎవర్ని?’’
‘‘అహింసలో మహాత్మాగాంధీని, నిజాయితీలో లాల్ బహదూర్ శాస్ర్తీని, వీరత్వంలో సుభాష్ చంద్రబోస్‌ని, దాతృత్వంలో బిల్‌గేట్స్‌ని. ఇంకా అబ్దుల్ కలాం లాంటి చాలామంది ఉన్నారు. ప్రముఖుల్లోని మంచితనాన్ని మనం అనుకరించాలి తప్ప ఈ ఒకరోజు వచ్చిపోయే ఏంకర్లు, సినిమావాళ్ళని కాదు’’ తల్లి నియాకి హితబోధ చేసింది.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి