క్రీడాభూమి

షూటింగ్‌లో క్లీన్‌స్వీప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, ఫిబ్రవరి 15: షూటర్లు క్లీన్‌స్వీప్ సాధించిన నేపథ్యంలో దక్షిణ ఆసియా క్రీడల్లో భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. సోమవారం నాలుగు విభాగాల్లో పోటీలు జరగ్గా, అన్నింటిలోనూ భారత్‌కు స్వర్ణాలు లభించాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఇండివిజువల్ ఈవెంట్‌లో శే్వతా సింగ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆమె 194.4 పాయింట్లు సంపాదించగా, 192.5 పాయింట్లతో హీనా సిద్ధు రజత పతకాన్ని అందుకుంది. దెశ్వాల్ యశస్విని సింగ్ 171.3 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని గెల్చుకుంది. అనంతరం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీం ఈవెంట్‌లో ఈ ముగ్గురితో కూడిన భారత జట్టుకు స్వర్ణ పతకం లభించింది. గురి తప్పని శే్వతా, హీనా, అశస్విని షూటింగ్‌కు చివరి రోజైన సోమవారం స్వర్ణాలతో మెరిసిపోయారు. టీం ఈవెంట్‌లో అర్దినా ఫిరదౌస్, అర్మిన్ ఆశా, టరింగ్ దెవాన్‌లతో కూడిన పాకిస్తాన్‌కు రజత పతకం లభించింది. శ్రీలంక కాంస్య పతకాన్ని సాధించింది.
పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ ఇండివిజువల్ ఈవెంట్‌లో గుర్‌ప్రీత్ సింగ్ స్వర్ణ పతకం గెల్చుకున్నాడు. అతను 28 పాయింట్లు సంపాదించగా, పాకిస్తాన్‌కు చెందిన గులామ్ ముస్త్ఫా బషీర్ 24 పాయింట్లతో రజత పతకాన్ని అందుకున్నాడు. లండన్ ఒలింపిక్స్ పతక విజేత విజయ్ కుమార్ 20 పాయింట్లతో కాంస్య పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. విజయ్ కుమార్, గుర్‌ప్రీత్ సింగ్‌తో కలిసి అక్షయ్ సుహాస్ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టోల్ పురుషుల టీం ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని సాధించాడు. గులామ్ ముస్త్ఫా బషీర్, మక్బూల్ హుస్సేన్ తబస్సుమ్, అక్తర్ మహమ్మద్ ఖలీల్‌తో కూడిన పాకిస్తాన్ జట్టుకు రజత పతకం లభించింది. శ్రీలంక కాంస్య పతకాన్ని అందుకుంది.
బాక్సింగ్‌లోనూ అదే జోరు
బాకిసంగ్‌లోనూ భారత్ అదే జోరును కొనసాగిస్తున్నది. పురుషుల విభాగంలో ఏడు స్వర్ణాలకు పోటీలు జరగ్గా అన్నింటినీ భారత్ గెల్చుకుంది. కామనె్వల్త్ గేమ్స్ రజత పతక విజేత దేవేంద్రో సింగ్ 49 కిలోల విభాగంలో పాకిస్తాన్‌కు చెందిన మోహిబ్ ఉల్లాను ఓడించి స్వర్ణం సాధించాడు. ఆతర్వాత వికాస్ క్రిషన్ (75 కిలోలు), శివ్ థాపా (56 కిలోలు), మదన్ లాల్ (52 కిలోలు), ధీరజ్ రంగీ (60 కిలోలు), మనోజ్ కుమార్ (64 కిలోలు), మన్దీప్ జగ్రా (69 కిలోలు) తమతమ విభాగాల్లో స్వర్ణ పతకాలను అందుకున్నారు.