రాష్ట్రీయం

తెలంగాణ భేష్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్థానిక సంస్థలకు అధికారాల బదలాయింపు బాగుంది
ఇనె్సంటివ్ కోసం సిఫారసు చేస్తా
గ్రామీణ నీటి సరఫరా సలహాదారు ప్రశంస

హైదరాబాద్, నవంబర్ 28: స్థానిక సంస్థలకు అధికారాలు, బాధ్యతలు పంచడంలో తెలంగాణ ముందుందని కేంద్ర ప్రభుత్వ గ్రామీణ నీటి సరఫరా సలహాదారు బల్వీర్ కశ్యప్ ప్రశంసించారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని అన్నారు. గ్రామాల్లోని మంచినీటి సరఫరా వ్యవస్థ నిర్వాహణ పంచాయితీలు, స్థానిక తాగునీటి సంఘాలకు ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు ఇవ్వగా మిగిలిన రాష్ట్రాల కన్నా తెలంగాణ మెరుగ్గా అమలు చేస్తోందని తెలిపారు. వరంగల్ జిల్లా ధర్మారావుపేటలో పర్యటించిన బల్వీర్ అక్కడి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, సిబ్బందితోపాటు ప్రజలతోనూ మాట్లాడారు. గ్రామం లో మంచినీటి సరఫరా పంచాయితీ చేతిలోనే ఉందా? అనే వివరాలు తెలుసుకున్నారు. ధర్మారావుపేటలో గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థ అద్భుతంగా పని చేస్తోందని తెలిపారు. ఇదే విధంగా మిగిలిన అంశాల్లో కూడా పంచాయితీలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
స్థానిక సంస్థలకు అధికారాలు ఇచ్చే రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక ఇనె్సంటివ్ గ్రాంట్ ఇస్తుందని, తెలంగాణకు అది లభించే అవకాశం ఉందని తెలిపారు. వరంగల్ పర్యటన ముగించుకుని వచ్చిన బల్వీర్ ఆర్‌డబ్ల్యుఎస్ ఇఎన్‌సి సురేందర్‌రెడ్డితో సమావేశం అయ్యారు. గ్రామీణ నీటిసరఫరాలో ఆర్‌డబ్ల్యుయస్ విభాగం పనితీరు అభినందనీయమని చెప్పారు. తాను గమనించిన విషయాలతో కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్టు తెలిపారు.