రుచి

‘చక్కెర ’ తగ్గించడం ఇలా...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైద్యుల సూచనలు ఆచరించడం, వ్యాయామం చేయడంతోపాటు మధుమేహ వ్యాధి నియంత్రణలో అతి ముఖ్యమైన అంశం ఆహార నియమాలు పాటించడం. సరియైన ఆహార నియమాలతో మధుమేహం జబ్బుని నివారించవచ్చు. పీచు అధికంగా వుండే ఆహార పదార్థాలు మధుమేహ నివారణలోను, రక్తంలోని కొవ్వు పదార్థాలను తగ్గించడంలోను ఉపయోగపడతాయి. అన్ని రకాల పప్పు దినుసులు, ఆకుకూరలు, కూరగాయాలలో పీచు అధికంగా వుంటుంది. వరి, గోధుమ, రాగి, జొన్నలు, సజ్జలు.. వీటిలో చాలామటుకు పిండి పదార్థం ఉంటుంది. ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా ఏ ధాన్యమైనా ఎంత పరిమాణంలో తీసుకోవాలి అన్నది ప్రధానం. మాంసాహారం నుంచి లభించే ప్రొటీనులకన్నా పప్పుదినుసుల నుండి లభించే ప్రొటీనులు మేలైనవి. రెండూ లేదా పైగా పప్పు దినుసులను కానీ, ధాన్యాలు, పప్పులు కలిపి తీసుకున్న ఆహారం కానీ ప్రొటీన్ల శాతాన్ని పెంచుతాయి. పుట్టగొడుగులలో ప్రొటీన్లు సమృద్ధిగా వుండి, తక్కువ కేలరీలు ఉంటాయి. కనుక ఆహారంగా పుట్టగొడుగులను తీసుకోవచ్చు.
కడుపునిండా ఆహారాన్ని తీసుకోకూడదు. అలాగే తినకుండా కూడా ఉండకూడదు. ప్రతి రెండు మూడు గంటలకు తగు మాత్రంగా ఆహారం తీసుకోవాలి. పుల్కాలు, కూరలు, పప్పులు చాలా తక్కువ నూనెతో తయారుచేసుకోవాలి. వేపుడు పదార్థాలని మానేయాలి. సమయం ప్రకారం ఆహారం తీసుకోవాలి. ఉదయం అల్పాహారంలో ఓట్స్, గోధుమ రవ్వ ఉప్మా, ఇడ్లీ లాంటివి తీసుకోవాలి. మధ్యాహ్న భోజనంలో ఒక కప్పు అన్నంతోపాటు రెండు రొట్టెలు. ఆకుకూరలు, కూరగాయలు అధికంగా వుండేలా చూసుకోవాలి. రాత్రి సమయంలో ఎక్కువగా గోధుమ, జొన్న, రాగి రొట్టెలు తీసుకోవడం మంచిది. పగలు ప్రతి రెండు గంటలకు మజ్జిగ, చక్కెర లేని నిమ్మరసం, కూరగాయల సలాడ్ తీసుకోవడం మరవద్దు.
మధుమేహ నియంత్రణలో ఏ పదార్థం తీసుకోవాలో తెలుసుకోవడం మాత్రమే ముఖ్యం కాదు. ఎంత పరిమాణంలో తీసుకోవాలన్నది కూడా ప్రధానమే.
కూరగాయలు:అల్పాహారం, భోజనాలతోనే కాకుండా రోజూ ఒక కప్పు పచ్చి కూరగాయల ముక్కలు తీసుకోవాలి. వీలైతే అర కప్పు కూరగాయల రసం తాగచ్చు. రోజూ ఆహారంలో పప్పు దినుసులు, బీన్స్, మొక్కజొన్న తప్పనిసరి.
పండ్లు: పూటకో తాజా పండు తినడం ఆరోగ్యకరం.
మాంసాహారం: మాంసాహారం సమృద్ధిగా మాంసకృతులను అందించేదే అయినా తగ్గించడం మంచిది. కోడిగుడ్లు మితంగా వాడాలి.
జంక్‌ఫుడ్, పానీయాలు, నూనెలు:తక్కువ మోతాదులో వినియోగించాలి. అది కూడా ప్రతిరోజూ తీసుకోకూడదు. గుండెకు మేలు చేసే కొవ్వు పదార్థాలు అంటే పల్లి, పొద్దుతిరుగుడు నూనెలు కూడా రోజుకు మూడు చెంచాలు మించకూడదు. ఆలీవ్ ఆయిల్‌గాని వాడచ్చు.
పాలు, పెరుగు: పాలు, పెరుగు ఇతర పాల పదార్థాలు పూటకి కప్పు మించకుండా రెండు నుంచి మూడుసార్లు తీసుకోవచ్చు. అవి కూడా కొవ్వు తొలగించిన పాలు, వాటి పదార్థాలు వాడుకోవాలి.
పప్పు్ధన్యాలు: పెసలు, బొబ్బర్లు లాంటివి మొలకెత్తినవి కాని, ఉడికించినవి కానీ చిరుతిళ్లుగా తీసుకోవచ్చు.
షుగర్ లెవెల్స్‌ని నియంత్రించడంలో తీసుకునే ఆహారంలో మెంతులు, కాకరకాయ, నేరడు పండ్లు, ఉసిరి, గ్రీన్‌ఆపిల్ తప్పక ఉండాలి. అలాగే వీటితోనే కాక వేపాకు పొడి, పన్నీర్ దోడ పువ్వుల పొడి లాంటి వాటితో తయారుచేసుకున్న గోరువెచ్చటి మంచినీటిని పరగడుపునే తాగడం చాలా మంచిది.
మధుమేహ వ్యాధి ఉన్నప్పుడు సరైన ఆహార నియమాలు పాటించకపోతే ఇతర అవయవాలు గుండె, మూత్రపిండాలు, కళ్లు, నరా లు దెబ్బతినే ప్రమాదముంది. సరైన ఆహారం తీసుకుంటూ నిరంతరం కుటుంబ వైద్యున్ని సంప్రదించడం మానద్దు.

- మురళీకృష్ణ