రుచి

పసందైన పనస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనస తొనలు సువాసనగానే కాకుండా ఎంతో రుచిగా ఉంటాయి. తొనలు బంగారపు రంగులో ఉంటాయి. అవి ఆరోగ్యకరమే కాక, అనారోగ్య నివారణకు ఔషధంలా ఉపయోగిస్తాయి. పనసకాయ పొట్టులోనూ, పనసపండు తొనలలోనూ పోషక పదార్థాలు లభిస్తాయి. పనసతొనలలో కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, ఫైబర్, స్వల్పంగా ఫాట్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాపర్, మాంగనీస్, ఫాస్పరస్, సెలీనియం, జింక్, విటమిన్ ఎ, సి, ఇ, కె, ధయామిన్, పిరిడాక్సిన్, రిబోఫ్లోవిన్, ఫోలిక్‌యాసిడ్, పెక్టిన్ లాంటివీ వుంటాయి. పనసపొట్టును ఆహర పదార్థంగా వండుతారు. ప్రత్యేక శుభ సందర్భాల్లో, విందులకు పనసపొట్టు కూరకు ప్రాధాన్యతనిస్తారు. పనసతొనలలోని గింజలను కాల్చి తింటే రుచిగా ఉంటాయి. ఈ గింజలను ఉడికించి కూడా తింటారు. పనస గింజలను ముక్కల పులుసులోనూ, సాంబారులో వేస్తే వాటి రుచి పెరుగుతుంది. కొంతమంది తమ పెరటి తోటలో పనస చెట్టును పెంచుతారు. పనస శరీరారోగ్యానికి, అనారోగ్యాల నివారణకు ఏ విధంగా పనిచేస్తుందన్నది ప్రతివారూ తెలుసుకోవాలి.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రక్తలేమిని పోగొట్టి, రక్తవృద్ధి జరిగేలా చేస్తుంది. కండరాలు, నరాల పని తీరును మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియకు తోడ్పడుతుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. క్యాన్సర్ వ్యాధి రాకుండా నిరోధిస్తుంది. కంటిచూపును వృద్ధి చేస్తుంది. అల్సర్ వ్యాధికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఆల్కహాల్ తీసుకున్నందువల్ల ఏర్పడే హ్యాంగోవర్‌ను పోగొడుతుంది.

- కె.నిర్మల