రుచి

ఆరోగ్యానికి ఆల్‌బుకరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్ద రేగుపండు వలే నిగనిగలాడుతూ కనిపించే ఆల్‌బుకరా పండు సీజన్‌లో మాత్రమే లభిస్తుంది. దీన్ని ప్లమ్ అంటారు. ప్లమ్‌కేక్‌లో ఈ పండు వాడతారు. ఎండిన ఆల్‌బుకరా పండు డ్రైఫ్రూట్‌గా వాడతారు. తాజా పళ్ళు ఎరుపు రంగులో ఉండి, రుచిగా ఉంటాయి. డ్రైఫ్రూట్ గోధుమ రంగులో వుంటుంది. దీనిలోపలి గింజ బాదంను పోలి వుంటుంది. ఈ పండ్లలో పోషక పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్ ఎ, బి6, సి, కెలు, స్వల్పంగా కొవ్వు, పీచు పదార్థం, కాల్షియం, మెగ్నీషియం, సెలీనియం, భాస్వరం, పోలెట్స్ లాంటివి లభిస్తాయి. ఆల్‌బుకరా పండ్లు ఆరోగ్యానికే కాక ఔషధపరంగా కూడా ఉపయోగిస్తాయి.
కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఈ పండును తినడంవల్ల బరువు పెరిగే అవకాశం ఉండదు. స్థూలకాయం ఏర్పడదు. కాన్సర్ వ్యాధికి దివ్యౌషధంలా పనిచేస్తుంది. గర్భవతులకు ఈ పండు చాలా మేలు చేస్తుంది.
భోజనం తరువాత తింటే జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. రక్తప్రసరణ చక్కగా జరిగేలా చేయటమే కాదు వాపులను, నొప్పులను తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రణలో వుంచుతుంది. కంటి ఆరోగ్యాన్ని, కంటిచూపును కాపాడుతుంది. మూత్రపిండాలకు సంబంధించిన అనారోగ్యాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. అల్జీమర్స్ వ్యాధి రాకుండా రక్షణగా పనిచేస్తుంది. డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. ఆహారంలోని ఇనుమును గ్రహించటానికి తోడ్పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.

- కె.నిర్మల