రుచి

సంపూర్ణ ఆహారం పాలు (నేడు ప్రపంచ పాల దినోత్సవం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలు సంపూర్ణమైన ఆహారం. ఇది అక్షరాల నిజం. చంటి పిల్లలనుంచి వృద్ధులవరకు అందరికీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి పాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇందులో వివిధ రకాల పోషక పదార్థాలు విరివిగా లభించడమే దీనికి కారణం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ వారి సిఫారసు మేరకు ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ కనీసం 283 గ్రాముల పాలు తీసుకోవాలి. పాలు మానవ శరీరానికి పోషకాల ఖని. ఆవు, గేదె, మేక పాలతో వేరు వేరు ప్రమాణాల్లో పోషక పదార్థాలు మనం పొందవచ్చు. ప్రతి వంద గ్రాముల పాలల్లో ఆవుపాలు 86.6 శాతం, గేదె పాలు 84.2 శాతం వరకు నీరు కలిగి వుంటుంది. ఆవుపాలల్లో కొవ్వు 4.6 శాతం, మాంసకృతులు 3.4 శాతం,పిండి పదార్థాలు 4.9 శాతం, ఖనిజ లవణాలు 07. శాతం వుంటాయి. గేదె పాలల్లో 6.6 శాతం కొవ్వు, 3.9 శాతం మాంసకృతులు, 5.2 శాతం పిండి పదార్థాలు, 0.8 శాతం ఖనిజ లవణాలు లభిస్తాయి.
ముఖ్యంగా కాలంతో పోటీపడే నేటి మహిళకు, పిల్లలకు అందుబాటులో వుండే అత్యంత బలవర్థకమైన ఆహారం పాలు అని చెప్పాలి. వ్యాధులను నయం చేసే ఔషధ విలువలతోపాటు ఎంతో ఉపయోగకరం. అయినా పాల వాడకంలో అపోహలు, సందేహాలు లేకపోలేదు. స్వచ్ఛమైన పాలు చక్కని సువాసన కలిగి వుంటాయి. ఆవుపాలు లేత పసుపు రంగులో, గేదెపాలు తెలుపు రంగులో వుంటాయి. చిక్కని పాల చుక్క గచ్చుపై వేస్తే త్వరగా చుట్టూ వ్యాపించవు. పదేళ్లవరకు అమ్మాయిలు రోజుకు కనీసం 3 నుంచి 4 గ్లాసుల పాలు, పెరిగే వయస్సులో ఆపై, పాతికేళ్ల వయస్సులో 2 గ్లాసుల పాలు రోజూ తీసుకోవాలని వైద్యుల సలహా. పాలు తాగేందుకు ఇష్టపడని వారైతే పాల నుంచి తయారైన పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి.. ఇలా ఏవైనా సేవించవచ్చు. ఉదయానే్న మధురంగా ఆకలి తీర్చేవి, రాత్రి కమ్మని నిద్రకు ఉపయోగపడేవి ఒక గ్లాసు గోరువెచ్చని పాలే కదా.

-ఎం.కె