రుచి

నోరూరించే ఆవకాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేడి వేడి అన్నంలో ముద్దపప్పు, ఎర్రటి ఆవకాయ, ఇంత నెయ్య వేసుకుని తింటే ఆ మజానే వేరుగా ఉంటుంది. దీనికిసాటి మరొకటి రాదు. ఆవకాయ లేనిదే ముద్ద దిగినవారెందరో ఉన్నారు. వేసవి కాలం వచ్చిందంటే ఆవకాయ పెట్టుకోవటం తెలుగిళ్ళల్లో ఆనవాయితీగా వస్తోంది. ఈ కాలంలో దొరికే మామిడి, మునగ కాయలతో వివిధ రకాల ఆవకాయలు ఇలా పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి.

పులిహోర ఆవకాయ
దెబ్బతిన్న మామిడికాయలనుంచి చిన్న చిన్న ముక్కలు తరిగినవి - 3 గినె్నలు, కారము - 1 గినె్న
ఆవపిండి, ఉప్పు - 1/2 గినె్న, ఆవాలు, జీలకర్ర,
శెనగపప్పు, మినప్పప్పు - 2 కప్పులు, ఎండుమిర్చి - 24
విధానం: పైవన్నీ శుభ్రంచేసి పక్కన పెట్టాలి. నూనె కాచి పోపులు వేయించి నూనెతో కలపాలి. ఇది నెలకుపైగా వుంటుంది.

నూనె మాగాయ
తరిగిన మామిడి ముక్కలు అంటే పైన దెబ్బతిన్న కాయలు, పండిన కాయలనుంచి తరిగిన ముక్కలు - 5 గినె్నలు
కారం - 1/2 కేజీ
మెంతిపొడి - 250 గ్రా.
ఉప్పు - తగినంత
నూనె - 1 కేజీ
ఇంగువ పెద్దముక్కలు - 3
ఆవాలు - 5 చెంచాలు
ఎండుమిర్చి - 12, కరివేప - కొంచెం
శెనగపప్పు - 1 కప్పు
ముందుగా ముక్కల్ని ఉదయం ఎండలో పోసి ఆరనిచ్చి ఒక గినె్నలో ఇంగువ, నూనె కొంచెం కాచి దానిలో ముక్కలు, మెంతిపొడి, కారం వేయించినవి కలిపి ఉప్పు కలిపి ప్రక్కన పెట్టాలి. న నూనెలో పోపులు వేయించి కలపాలి.

పచ్చి మాగాయ
మామిడికాయలు - 25, పచ్చికారం - 1 కేజీ
మెంతిపిండి - 250 గ్రా., ఆవపిండి - 250 గ్రా.
వెల్లుల్లి - 100 గ్రా., ఇంగువ ముక్కలు - 5
ఉప్పు - 750 గ్రా.
మామిడికాయలు కడిగి తుడిచి పీలర్‌తో తొక్క కొంచెం తీసి ముక్కలుగా తరుగుకోవాలి. ఈ ముక్కలకి పసుపు ఉప్పు కలిపి మూడు రోజులు ఊరనివ్వాలి. మూడవ రోజు పిండి, ఎండలో చాపపై పొయ్యాలి. ఆ సాయంత్రం రసంలో కూడా ఎండాక రసంలో కారం, ఆవపిండి, మెంతిపిండి పోసి కలిపి వెల్లుల్లి తొప్పలు వలచిన రేకలు పోసి కలిపి ముక్కలు వేసి కలపాలి. నూనె కాచి ఇంగువ వేసి పొంగురానిచ్చి చల్లార్చిన నూనె పోసి కలపాలి. పచ్చి మాగాయ రెడీ. ఇష్టముంటే ఒక కేజీ బెల్లం తరుగు సగం మాగాయలో కలిపి ఎండబెట్టితే తియ్య మాగాయ రెడీ. ఇది దోసె, ఇడ్లీ, చపాతీ, గారెకి మంచి రుచి!

మునగకాడలతో..
10 కాడలు ముక్కలు చేసుకొని నూనెలో కొంచెం వేపి పై ఆవకాయకి కలపాలి.
శనగలతో..
శనగలు అరకేజీ శుభ్రంచేసి ఆవకాయలో కలపాలి.
నూపిండితో..
అర కేజీ నువ్వులు దోరగా వేపి మిక్సీ పట్టి ఆవకాయలో కలపాలి.
బెల్లంతో...
బెల్లం తరుగు 2 1/2 కేజీ పై ఆవకాయలో కలిపి ఒక రోజు తర్వాత ఎండలో పెట్టి మూడు రోజులు ఉంచి తియ్యాలి. కొందరు ఆవపిండి తగ్గిస్తారు. బాగా ఎండి సూర్యరశ్మితో పాకం వచ్చిన ఆరోగ్యకర ఆవకాయ.
పెసరతో..
పెసరపిండి -1 కేజీ, ఆవపిండి - 1/4 కేజీ కలిపి ఆవకాయ పెడతారు. ఈ ఆవకాయవ చలువ చేస్తుంది.

మెంతిపిండితో...
చిన్నమాడికాయలు - 24
మెంతిపిండి - 1/2 కేజీ
వేయించి కొట్టిన కారం - 1 కేజీ
మెంతులు - 1/2 కప్పు
నూనె - 1 1/2 కేజీ
కళ్ళ ఉప్పు - 1/2 కేజీ
ఇంగువ - చిన్న డబ్బా
మెంతులు, ఎండుమిర్చి పెద్ద బాణలిలో నూనె పోసి వేయించి మిక్సీ పట్టి ఉంచా లి. దీనిలో కళ్లు ఉప్పు, వే యించిన 1/2 కప్పు మెంతులు కలిపి ఉంచాలి. ఇప్పుడు మామిడికాయలు కడిగి తుడిచి ఆరాక పీలర్‌తోగాని ఆలిచిప్పతోగాని అక్కడక్కడ తొక్కు తీసి రెండు ప్రక్కలా వంకాయ గుత్తుల్లా తరగాలి. మిగిలిన 12కాయలు ముక్కలుగా తరుగుకోవాలి. ఈ కాయల్లో పైన కలిపిన ఉప్పు, కారం, మెంతిపిండి కూరి వెడల్పాటి జాడీలో పెట్టుకోవాలి. మూడవ రోజు ఈ టెంకలు పిండి ఎండలో చాపపై పోసి ఎండబెట్టాలి. ఈ ముక్కల రసం ఎండాక ముక్కల్ని రసంలో కలపాలి. ఇప్పుడు మిగిలిన అంటే ఒక కేజీ నూనె కాచి ఇంగువ, ముక్కలు వేసి కాచి చల్లార్చి ఈ గుజ్జులో పోసి బాగా కలపాలి. మళ్ళీ మూడవ రోజు కలిపి జాడీలో పెట్టి గుడ్డతో మూత కట్టాలి.

మామిడి ఆవకాయ
మామిడికాయలు టెంక పట్టినవి - 12 కాయలు, ఇంచుమించు 150 ముక్కలు వస్తాయి.
కారము - 1 కేజీ, ఆవపిండి - 1 కేజీ
ఉప్పు - 1 కేజీ, నూనె 1 1/2 కేజీ
మెంతులు - 100 గ్రా.
టెంక కాయలు కడిగి తుడిచి గాలికి ఆరనిచ్చి 8 ముక్కలుగా చేసుకోవాలి. నిలువుగా నాలుగు, అడ్డంగా నాలుగు లేక 12 కాయ సైజుని బట్టి చెయ్యాలి. వెడల్పు టబ్‌లో కారం, ఉప్పు, మెంతులు కలిపి తరువాత ఆవపిండి పోసి బాగా కలపాలి. ఈ పిండిలో కేజీ నూనె పోసి బాగా కలపాలి. ముక్కల్లోని తొప్పలు తీసి ప్రక్కన పెట్టాలి. పైకారం మిశ్రమం మూడు లేక నాలుగు గినె్నలు వచ్చింది అంటే గినె్నకి మూడు గినె్నల ముక్కలు పోసి కలిపి మిగిలిన నూనె పోసి కలపాలి. మూడవ రోజు కలిపి జాడీలో పెట్టుకొని దళసరి బట్ట కడితే ఏడాదిపాటు ఉంటుంది. చిన్న జాడీలోకి తీసుకుని వాడుకోవాలి. ఇలాగే ఈ కింది రకాలైన ఆవకాయలు పెట్టుకోవచ్చు.

-వాణి ప్రభాకరి