రుచి

మేనుకు మేలు చేసే ముంజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతి వరప్రదాయినీ, ఎండవేడిమికి సరైన ప్రత్యామ్నాయం తాటిముంజల సీజన్ వచ్చేసింది. శరీరానికి ఎంతో మేలు చేసే ముంజలు ఇప్పుడు సిటీ అన్ని ఏరియాల్లోనూ అందుబాటులోకి వచ్చేసాయి. ఎండనుంచి ఉపశమనంతో పాటు ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే తాటిముంజలను తినడంలో అసలు మజా ఉంది. చెక్కిన ముంజలకు రెండు లేదా మూడు కన్నులు ఉంటాయి. వీటిని మన బొటనవేలితో పొడుచుకుని తినాలి. ముంజల రసం బట్టలమీద పడిందంటే మరకపడిపోతుంది. దానిని జాగ్రత్తగా నోటి దగ్గరకు తెచ్చుకొని నాలుకతో అందుకొని తినాలి. ఒక్కో కన్నుని అలా పొడుచుకొని తింటుంటేనే మరి బాగుంటుంది. వీటిని ఐస్ ఆపిల్స్‌గా పిలుస్తుంటారు. సహజసిద్ధమైన మంజులు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరు అరటి పండ్లలో ఉండే పొటాషియం ఒక్క తాటి ముంజ లో ఉంటుంది. బి.పిని అదుపులో ఉంచి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఎముకలను బలంగా ఉంచుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరం కూడా ఎంతో చల్లగా, హాయిగా ఉంటుంది. శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గి జీర్ణక్రియ బాగా జరుగుతుంది. శరీరానికి మంచి చల్లదనాన్ని అందిస్తుంది. శరీరానికి కావాల్సిన ఎ, బి, సి, విటమిన్లు ఐరన్, జింక్, ఫాస్పరస్, పొటాషియం వంటివి పుష్కలంగా వుంటాయి.
చికెన్ ఫాక్స్/అమ్మవారుతో బాధపడేవారికి దురద నుంచి ఉపశమనం అందించి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.ముఖ్యంగా చిన్నపిల్లలకి, ముసలివాళ్లకి చాలామంచిది. వీటిలో అధికంగా తేమ, తక్కువ
కొవ్వు పదార్థాలు కలిగి చిన్నారులకు, హుద్రోగులకు, షుగర్ వ్యాధిగ్రస్తులకు, స్థూలకాయులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి దోహదం చేయడంతోపాటు దాహార్తికి కూడా మంచి విరుగుడు. ముంజల్లో ఎక్కువ మొత్తంలో శరీరానికి కావాల్సిన శక్తి ఉంటాయి.
వివిధ రకాల ట్యూమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే పైటోకెమికల్స్, ఆంథోసైనిన్ లాంటివాటిని నిర్మూలిస్తాయి. ముంజలను అధికంగా తినడంవల్ల కాన్సర్లనుంచి దూరంగా ఉండొచ్చు. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచి.. మినరల్స్, న్యూట్రియంట్స్ శాతాన్ని బ్యాలెన్స్ చేయడంలో కూడా ముంజలది కీలకపాత్ర.
వీటిలో ఉండే పొటాషియం శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగించడంలో దోహదపడతాయి. సహజ సిద్ధంగా వచ్చే అలసట, నీరసం ముంజలు తినడంవల్ల తగ్గుతాయి. వేసవిలో ఎండలు కారణంగా కొంతమంది విరేచనాలు, వాంతులు అయ్యే పరిస్థితి ఉంటుంది. వాటికి నిమ్మరసం ఇస్తారు. ఆ సమయంలో ముంజలు తినడంవల్ల శారీరక ఉపశమనం పొందవచ్చు. లేత తాటి ముంజల్ని తీసుకుని గుజ్జులా చేసి అందులో కొద్దిగా పాలపొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా రాసుకుని కాసేపయ్యాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. తాటిముంజలు రెగ్యులర్‌గా తీసుకోవడంవల్ల ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు.డీహైడ్రేషన్ నివారణకి గొప్ప సహాయపడుతుంది. ఉదర సంబంధ సమస్యలకు, అన్ని రకాల జీర్ణ సమస్యలను నివారించడంలో మలబద్ధకాన్ని పోగొట్టే అద్భుత చికిత్స. కొందరిలో ముంజలు తిన్నాక అవి త్వరగా అరగక కడుపునొప్పి సమస్యలు వస్తుంటాయి. అలాంటప్పుడు ముంజలు తిన్నాక చివరిలో చిన్న మామిడి ముక్క తింటే తొందరగా అరుగుతాయి. కడుపునొప్పి రాదు.

- టి.ఎస్.మైత్రేయ