రుచి

మిరప లేకుండా పూట గడవదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిరప వంటింటి రాణి, చక్కని ఆరోగ్యానికి తప్పనిసరి. మేటి ఔషధకారిణి. కారం రుచి చూడని నాలుకలుండవు. పండు మిరపపచ్చడి, చల్ల మిరపకాయలు (ఊర మిరపకాయలు) ఆంధ్రుల అభిమాన రుచులు. మీరప పేరు వినగానే కారం తిన్నంత భావం కలుగుతుంది. నోట్లో పెట్టుకోగానే కళ్ళు చెమ్మగిల్లుతాయి. నోరు మండిపోతుంది. అయినా దీని రుచి ఎరిగినవాళ్ళం కనుక ఒక్కరోజు కూడా మిరప లేకుండా గడవదు. మిరపకాయ కారంగా ఉండడానికి ప్రధాన కారణం కాప్సిసిన్ అనే ఆల్కలాయిడ్ మెండుగా ఉండడమే. మిరపకాయలో మాంసకృతులు, భాస్వరం, ఇనుము, కాల్షియం, మెగ్నీషియం- ఇతర ఖనిజ లవణాలు తృణధాన్యాలలో కంటే హెచ్చుగా ఉంటాయి. ఎ, బి, సి, ఇ విటమిన్లు కూడా మిరపలో పుష్కలంగా లభ్యమవుతాయి. ఎన్నో రకాల పోషక విలువలు, ఔషధ గుణాలు మిరపలో దాగి ఉన్నాయి. అలవాటుగా రోజూ పచ్చిమిరప, ఎండుమిరప, కారం పొడి, కూర మిరప కాయలను (కాప్సికమ్) వాడటం పరిపాటి. మిరప మన ఆహారంలో కలవడంవల్ల జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి దోహదపడుతుంది. విటమిన్-బి, విటమిన్-ఇలు సమృద్ధిగా లభించడంవల్ల పలు లైంగిక రుగ్మతలకు దూరంగా ఉండవచ్చు. చర్మానికి, కంటికి చక్కని ఆరోగ్యం చేకూర్చటానికి విటమిన్-ఎ అవసరం ఉంటుంది. నరాలకు, కండరాలకు, రక్తవృద్ధికి, జుత్తుకు చక్కని పుష్టి కలిగించడంలో విటమిన్-బి పనిచేస్తుంది. విటమిన్-సి పళ్ళ చిగుళ్ళు, దంతాలు, ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. అలాగే మిరపలో లభించే విటమిన్-ఇ చర్మ సంబంధ వ్యాధులను, కండరాలకు సంబంధించిన బలహీనతలను తొలగించడంలోను, కొన్ని రకాల హృద్రోగాలను నయం చేయడంలోను సహాయపడుతుంది. మిరపలో లభించే కాల్షియం, భాస్వరం లక్షణాలు ఎముకల నిర్మాణానికి, ఇనుము రక్తకణాల ఉత్పత్తికి ఉపయోగపడతాయి. ఈ కారణంగా మహిళలకు ఇవి అత్యవసరం అని చెప్పొచ్చు.
పలు విటమిన్లు, పుష్కలమైన ఖనిజ లవణాలతోపాటుగా మిరపలో మాంసకృతులు, పీచు, పిండి, నూనె, కొవ్వు- ఇత్యాది పోషక పదార్థాలు ఉంటాయి. వీటన్నిటితో మొత్తంగా 250 కిలో కేలరీల పౌష్టిక శక్తి మిరప ద్వారా లభిస్తుంది. మిరపలోని కేప్సిసిన్ ఆల్కలాయిడ్ సక్రమంగా జీర్ణక్రియ జరగడంలో సహాయకారి. ఎరువు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో లభించే సిమ్లా మిర్చిల్లో అనవసరపు కొవ్వును కరిగించి శరీర బరువును తగ్గించే రక్తపోటును క్రమబద్ధీకరించే సహజ సిద్ధమైన ఔషధ గుణాలున్నాయి. ఇందులో కెలోరీలు అసలు ఉండకపోవడమే దీనికి కారణం. బ్లడ్ షుగర్‌ని నియంత్రిస్తాయి. రోగ నిరోధక శక్తిని ఇనుమడింపజేస్తాయి. కనీసం పది రకాలయినా క్యాన్సర్లను వీటిలో ఉండే ఆంటీ యాక్సిడెంట్స్ దరి చేరకుండా చూస్తాయి. వీటిని సాధారణంగా క్యాన్సర్‌లను నివారించడంలో తీసుకోవాల్సిన ఆహారం అని చెప్పాలి. గుండె జబ్బులు, క్యాన్సర్- వంటి వ్యాధులకు కేప్సిసిన్ ఉపయోగించి వివిధ మందులను తయారుచేస్తారు. మూత్రకోశ వ్యాధి, మూలశంఖ, శ్వాసకోశ వ్యాధి, డీసెంట్రీ- ఇతర వ్యాధులను నయం చేయడానికి హోమియో వైద్యంలో మిరపను ప్రయోగిస్తున్నారు. మిరపను ఆయుర్వేదంలోనూ, గృహ చికిత్సలలోనూ విరివిగా వాడతారు. యాంటీ బ్యాక్టీరియాలా పనిచేస్తూ ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌లు దరిచేరకుండా ఉంటాయి. ఇందులో ఉండే ఎండోఫిన్స్ ఎలాంటి నొప్పులనైనా హరించివేసి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి తోడ్పడుతాయి. ఇంత మేలు చేసే మిరపను మితంగానే తీసుకోవాల్సి వుంది. కారం ఎక్కువగా వాడటంవల్ల ఆరోగ్యరీత్యా కొన్ని అనర్థాలు తలెత్తే అవకాశాలున్నాయి.