రుచి

చల్ల చల్లని ఐస్ ఫ్రూట్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవిలో ఐస్‌ఫ్రూట్స్ బండి గంట వినగానే పిల్లలు వారి వెనకాల, డబ్బులు పట్టుకుని పెద్దలు పరుగుపెట్టి తీరాలి. కడుపులో చల్లదనం కోసం ఐస్ ఫ్రూట్స్ పిల్లలతో పెద్దలు తినే అలవాటు కొందరికి. మిల్క్, చాక్‌లెట్, మ్యాంగో, ద్రాక్ష, పైనాపిల్, బాదం మిక్స్ ఐస్‌ఫ్రూట్స్ మనకు దొరుకుతాయి. వాటిని ఇంట్లో చేసుకుని పిల్లలు, పెద్దలు, అతిథులు అంతా ఇష్టంగా తినవచ్చును.
వీటిని ఐస్‌బార్స్ అని కూడా అంటున్నారు.

చెఱకురసంతో...

చెఱకు రసం - 1/2 లీటరు
అల్లం కోరు - 2 చెంచాలు
నిమ్మరసం - 1/2 కప్పు
కొబ్బరి కోరు - 5 చెంచాలు
తేనె - 1 కప్పు
ముందుగా పైపదార్థాలన్నీ లిపి కోన్స్‌లో పోసి స్టిక్స్ పెట్టి డీప్ ఫ్రిజ్‌లో పెట్టాలి. మర్నాటికి చక్కని ఐస్‌ఫ్రూట్స్ రెడీ. పెద్ద ఐస్ ప్లాస్క్ ఉన్నవాళ్ళు లేక ధర్మాకూల్ పెట్టె ఉన్నవాళ్ళు ఈ తరహా ఐస్‌ఫ్రూట్స్ చేసి పెట్టుకుంటే ఎండ వేళల్లో పిల్లలు, పెద్దలు తారతమ్యం లేకుండా తినవచ్చును

కొబ్బరితో..

కొబ్బరి కోరు - 1 కప్పు
పాలపొడి - 1 కప్పు
పంచదార - 1/2 కప్పు
జీలకఱ్ఱ - 1 చెంచా
కొబ్బరి కోరు, పంచదార, జీలకఱ్ఱ మిక్సీ పట్టాలి. వేడినీళ్ళలో పాలపొడి కలిపి పాలు చేసి చల్లార్చి దానిలో పై మిశ్రమం కలపాలి. దీన్ని కోన్స్‌లో పోసి స్టిక్స్ పెట్టాలి. డీప్‌ఫ్రిజ్‌లో పెడితే మర్నాటికి కోన్ ఐస్‌ఫ్రూట్ రెడీ..