రుచి

రామయ్యకు నైవేద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరామనవమినాడు ప్రతి ఇంట పానకం, వడపప్పు, పిండి వంటలు ఉంటాయ. పెసరపప్పు వంటలు తప్పనిసరి. బొబ్బట్లు, పాయసం, పులిహోర, కమ్మని పెసరగారెలు, బూరెలు రకరకాల పిండి వంటలు నివేదన చేస్తారు. దీనివల్ల ఆయురారోగ్య
ఐశ్వర్యాలు, శాంతి సౌఖ్యం లభిస్తాయని పెద్దల చెబుతారు.

ఖర్జూరం బొబ్బట్లు

మెత్తని ఖర్జూరము గింజలు లేని ముద్ద - 2 కప్పులు
కొబ్బరి కోరు - అర కప్పు
నెయ్యి - 1 కప్పు, ఏలకులు - 5
జీడిపప్పు పొడి - 1/2 కప్పు
బాదంపొడి - 2 చెంచాలు
శెనగపప్పు ముద్ద - 1 కప్పు
నూనె - 1 కప్పు
మైదా - 2 కప్పులు
రవ్వ - 1 కప్పు
గోధుమ పిండి - 1 కప్పు
ఉప్పు - చిటికెడు

ముందుగా ఉప్పు, మైదా, గోధుమ పిండి నీటి తడితో పూరీ పిండిలా కలిపి అరకప్పు నూనె వేసి కలిపి ఈ ముద్దను నూనెతో నానించాలి. నేతిలో కొబ్బరి వేయించి దానిలో ఖర్జూరం, శెనగపప్పు, బాదం, జీడిపప్పు పొడులు కలిపి ఏలకుల పొడి చేర్చి ముద్దగా చేసుకుని ఉండలు 12 చేసుకోవాలి. మైదా ముద్ద తీసుకొని అరచేతికి వత్తుకుని పై ఖర్జూరం ముద్ద పెట్టి మూసి ప్లాస్టిక్ పేపర్‌పై వత్తాలి. దీన్ని పెనంపై నూనె తడితో కాల్చి నెయ్యి రాసి బాక్స్‌లో పెట్టాలి.

పన్నీర్ బూరెలు

పన్నీర్ తరుగు - 2 కప్పులు
కొబ్బరి కోరు - 1 కప్పు
బాదం పౌడర్ - 2 చెంచాలు మైదా -1కప్పు
శనగపిండి - 1 కప్పు
బియ్యం పిండి - 1/2 కప్పు
ఉప్పు - చిటికెడు
నూనె - 250 గ్రా.
బెల్లం - 1/2 కప్పు
నెయ్యి - 1/2 కప్పు

పన్నీర్ తరుగుకి కొబ్బరి ,బాదం పౌడర్ చేర్చి కొంచెం నెయ్యి వేసి బాణలిలో దోరగా వేగనివ్వాలి. బెల్లం తురుము వేసి కలిపి ముద్దగా చేసుకొని, ఉండలు చేసి ఉంచాలి. పై పిండులన్నీ నీటితోజారుగా కలిపి దానిలో ఈ ఉండలు ముంచి నూనెలో వేయించాలి. బంగారు వనె్న వచ్చాక తీసి పళ్ళెంలో పెట్టాలి.

మిక్స్‌డ్ పాయసం

సగ్గుబియ్యం - 1 కప్పు
పెసరపప్పు - 1 కప్పు
ఓట్స్ - 1 కప్పు
శెనగపప్పు - 1/2 కప్పు
పాలు - 1 లీటరు
కొబ్బరి కోరు - 1/2 కప్పు
ఏలకులు - 8
కుంకుమ పువ్వు - 1/2 చెంచా
బాదం పౌడర్ - 4 చెంచాలు
కిస్‌మిస్‌లు - 24
జీడిపప్పులు - 24
నెయ్యి - 2 చెంచాలు
బెల్లం తరుగు - 1 కప్పు
పంచదార - 1/2 కప్పు

పప్పులు సగ్గుబియ్యం నానబెట్టి ఉడికించాలి. ముద్దగా అయ్యాక ఓట్సు, కాచిన పాలు పోసి బెల్లం, పంచదార చేర్చి ఉడకనివ్వాలి. దానిలో నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్ అన్నీ ఏలకుల పొడి చేర్చి కలిపి దింపాలి. పైన నెయ్యి వేసి కలపాలి. రెడీ!

రవ్వ పులిహోర

బియ్యం రవ్వ - 2 కప్పులు
అల్లం ముక్కలు,ఆవాలు- 2 చెంచాలు
శెనగ, మినప్పప్పు - 4 చెంచాలు
నూనె - 1/2 కప్పు
ఎండుమిర్చి - 12
నిమ్మకాయలు - 8
ఉప్పు,పసుపు - 2,1 చెంచాలు
వేరుశెనగపప్పు - 1 కప్పు
పచ్చిమిర్చి - 12
మామిడికోరు - 2 కప్పులు

5 కప్పుల నీరు దళసరి గినె్నలో పోసి కొంచెం నూనె, ఉప్పు, పసుపు, కరివేప చేర్చి ఉడకనివ్వాలి. పొంగులు వస్తుండగా బియ్యం రవ్వ పోసి కలిపి పైన కొంచెం నూనె వేసి సన్న మంటపై ఉంచాలి. దీన్ని బేసిన్‌లో పోసి ఆరనివ్వాలి. బాణలిలో నూనె వేసి వేగనిచ్చి పోపులు, పప్పులు వేయించినవి పోసి కలపాలి. మామిడి కోరు నిమ్మరసం చేర్చి కలపాలి. దీన్ని అరగంట మూత పెట్టి ఊరాక తింటే రుచి!

వెజిటబుల్ పెసరగారెలు

పెసరపప్పు - 4 కప్పులు
ఉప్పు - 2 చెంచాలు
జీలకఱ్ఱ - 4 చెంచాలు
మిర్చి - 8
కొత్తిమీర - కొంచెం
కొబ్బరి కోరు - 1 కప్పు
క్యారెట్ కోరు - 1 కప్పు
అల్లం కోరు - 2 చెంచాలు
నూనె - 250 గ్రా.

పెసరపప్పు నానబెట్టి బరకగా మిక్సీ పట్టి పై కోరులన్నీ కలపాలి. నూనె కాగనిచ్చి గారెలుగా తట్టుకొని వేయించాలి. కరకరలాడే వెజిటబుల్ పెసరగారెలు రెడీ!

కమ్మని వడలు

బియ్యం పిండి - 4 కప్పులు
శెనగపిండి - 1/2 కప్పు
మినపప్పు పిండి - 1 కప్పు
అల్లం మిర్చి పేస్ట్ - 5 చెంచాలు
జీలకఱ్ఱ - 4 చెంచాలు
నూనె - 250 గ్రా.
కొబ్బరి కోరు - 2 చెంచాలు
వేరుశెనగ పొడి - 1/2 కప్పు
కార్న్‌ఫ్లోర్ - 5 చెంచాలు

మినప్పిండిలో బియ్యంపిండి, శనగపిండి, ఉప్పు, మిర్చి ముద్ద, జీలకఱ్ఱ, పై పొడులు అన్నీ కలిపి బజ్జీల పిండిలా చేసుకోవాలి. కాగిన నూనెలో గరిటెతో పోసి వేగాక తీసి పళ్ళెంలో పెట్టాలి. వాయిదాకి 5, 6 వడలు వేసి తియ్యవచ్చు. కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.

-వాణి