రుచి

శనగపప్పు వంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోగ్యరీత్యా శనగపప్పులో ప్రోటీన్లు అధికంగా ఉండంవల్ల ఇది మంచి బలవర్ధకమైన ఆహారం.
ప్రతి వంటకం పోపులో ఇది కమ్మదనాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కూరలు,పచ్చళ్లకి దీని అవసరం
చాలా ఉంది. రోగులకు ప్రోటీన్లతో కూడిన ఆహారం ఇవ్వాలంటే దీంతో చేసిన వంటలు మేలు చేస్తాయ.
శనగపప్పుతో హల్వా, పాయసం బూర్లు, బొబ్బట్లులాంటి ప్రత్యేక వంటలే కాదు
పలు రకాల కూరలు వండుకోవచ్చు.

కలగపు పప్పు

కొబ్బరి కోరు-1 కప్పు,
శనగపప్పు-1 కప్పు, పచ్చిమిర్చి-12, ఆవాలు-2 చెంచాలు,
జీలకర్ర-2 చెంచాలు,
కరివేప కొంచెం
మినపప్పు-2 చెంచాలు
ఎండుమిర్చి-6
నూనె-5 చెంచాలు
ఉప్పు-2 చెంచాలు
అల్లం కోరు-2 చెంచాలు
ఉల్లిపాయ ముక్కలు-1 కప్పు
నిమ్మరసం-2 కాయలు

శనగపప్పుకి 2 కప్పుల నీరు చేర్చి ఉడికించాలి. ఇది మెత్తగా ఉడికాక దింపి పక్కనపెట్టాలి. చిల్లుల బుట్టలో వేస్తే మంచిది. బాణలిలో నూనె వేసి పోపులన్నీ వేయించి మిర్చి, అల్లం, కరివేప అన్నీ చేర్చి వేగనిచ్చి తీసి పక్కనపెట్టాలి. బాణలిలో కొంచెం నూనెపోసి ఉల్లి ముక్కలు వేయించి కొబ్బరి వేసి వేయించి దీనిలో ఉడికించిన శనగపప్పు కలపాలి. దీనిపై పోపువేసి 5 నిముషాలు మగ్గనివ్వాలి. కమ్మని వాసన వస్తుండగ దింపి డిష్‌లో పోసి వుంచండి. ఇది అన్నం దోశె దేనికైనా ఆధరవు.

పొటాటో బాల్స్

చిన్న సైజు బంగాళాదుంపలు-12
శనగపప్పు-2 కప్పులు, పచ్చిమిర్చి-6,
జీలకర్ర-1 చెంచా
కొత్తిమీర తరుగు-1/2 కప్పు
ఉప్పు-2 చెంచాలు
నూనె-250 గ్రా
కార్న్‌ఫ్లోర్-5 చెంచాలు
అల్లం కోరు-5 చెంచాలు
కొబ్బరి కోరు-5 చెంచాలు
పసుపు-1/2 చెంచా

బంగాళా దుంపలు ఉప్పువేసి పసుపువేసి ఉడికించి దింపి పై పొట్టు వలవాలి. శనగపప్పు నానపెట్టి మిక్సీపట్టాలి. అందులో మిర్చి, అల్లం, కొబ్బరి, జీలకర్ర చేర్చి చాలా మెత్తని ముద్దగా చేసుకోవాలి. నూనె కాగనిచ్చి ఉడికించిన బంగాళాదుంపల్ని పిండిలో ముంచి, కార్న్‌ఫ్లోర్ చిక్కని ద్రావణంలో ముంచి కాగిన నూనెలో వదలాలి. ఈ బాల్స్ బంగారు వనె్న వచ్చాక చిల్లుల చట్రంతో తీసి డిష్‌లో పెట్టాలి.

కోఫ్తా కర్రీ

శనగపప్పు-1 కప్పు
బంగాళా దుంపలు-2
కారెట్ ముక్కలు-1 కప్పు
మిర్చి-6
నూనె-250గ్రా
ఉల్లి ముక్కలు-1 కప్పు
జీడిపప్పులు-24
ధనియాలు-2 చెంచాలు
కొబ్బరి-1/2 కప్పు
మిరియాలు-1 చెంచా
టమాటాలు-6
కొత్తిమీర-1/2 కట్ట
ఉప్పు-2 చెంచాలు
జీలకర్ర-2 చెంచాలు
అల్లం కోరు-5 చెంచాలు,
పుదీనా-కొంచెం
మసాలా కారం-2 చెంచాలు.

ముందుగా శనగపప్పు నానపెట్టి ఉంచాలి. క్యారెట్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు ఉడికించి మిక్సీపట్టాలి. శనగపప్పు మిక్సీపట్టి దానిలో ఈ బంగాళా దుంప మిశ్రమం చేర్చి ఉప్పు, అల్లం మిర్చి వేసి కలిపి నూనె కాగనిచ్చి కోల బాదం కాయల్లా చేసి నూనెలో వేయించి పక్కనపెట్టాలి. టమాటో ఉల్లి కొత్తిమీర బాణలిలో కొంచెం నూనెవేసి దోరగా వేయించాలి. మిక్సీలో జీడిపప్పు, కొబ్బరి, కొత్తిమీర, ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేసి మిక్సీపట్టి పైన వేయించిన ఉల్లి టమాటా వేసి మిక్సీపట్టాలి. బాణలిలో కొంచెం నూనె వేసి ఈ ముద్ద వేసి ఒక కప్పు నీరు వేసి మరలా ఉడికించాలి. ఇది బుడగలు వస్తుండగా వేయించిన బాదంకాయలు వేసి ఐదు నిముషాలు మగ్గనిచ్చి కొంచెం పుదీనా చల్లి దింపాలి. ఇప్పుడీ మసాలా కారం వేసి కలిపి మూతపెట్టాలి. ఇది పుల్కా, చపాతీ, దోశె, బ్రెడ్ దేనికైనా రుచి!

- vani