రుచి

వేసవి ఆహారం ఇదీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవి వచ్చిందంటే చాలు వంటింట్లో బార్లీ గింజలు, సగ్గుబియ్యం, సబ్జా గింజలు దర్శనమిస్తాయి. గతంలో నీళ్లు, పాలు, మజ్జిగ వంటివి వాడుతూ వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేవారు. నేటి ఆధునిక కాలంలో బార్లీ, సగ్గుబియ్యంతో లస్సీలు, సలాడ్‌లు, జ్యూస్‌లు చేస్తున్నారు. వాడే పదార్థాలు పాతవే అయనా విభిన్న రుచులను నేడు జనం ఆస్వాదిస్తున్నారు. చాలావరకూ పాతకాలం ఆహారపు అలవాట్లు కనుమరుగై అంతా ఇన్‌స్టెంట్ ఆహార పదార్థాలకే మొగ్గు చూపుతున్న తరుణంలో బార్లీ, సగ్గుబియ్యం, సబ్జా గింజలకు ఆదరణ తగ్గకపోవడానికి వాటిలోని ఔషధ గుణాలే ప్రధాన కారణం.
బార్లీ ఒక గడ్డి జాతి మొక్క. బార్లీ గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. ఇది అధిక బరువుని తగ్గించేస్తుంది. పిల్లలు, వయసు మళ్లినవారు బార్లీ నీరు తీసుకుంటే మలబద్ధకం దరిచేరదు. మధుమేహం ఉన్నవారికి ఈ గింజలు మేలు చేస్తాయి. ఇన్సులిన్ హెచ్చుతగ్గులను నియంత్రిస్తుంది. బార్లీ నీరు వేసవిలో దాహార్తిని తీర్చడమే కాక శరీరంలోని వ్యర్థపదార్థాలని బయటికి పంపించడంలో తోడ్పడుతుంది.
సగ్గుబియ్యం అనగానే ఇది ఏదో ఒక ధాన్యం నుండి వచ్చినదనుకుంటారు చాలామంది. దీని తయారీకి ముడి సరుకు కర్ర పెండలం. భూమిలో పెరిగే కర్ర పెండలం దుంపలను బయటకు తీసి శుభ్రపరచి దాని నుంచి పాలను తీస్తారు. జల్లెడ సహాయంతో కావలసిన పరిమాణంలో గింజలను చేసి ఎండలో ఆరపోస్తారు. ఇదంతా పాత పద్ధతి. సాంకేతికతను పుణికిపుచ్చుకున్న ఈ కాలంలో వీటి తయారీలో దుంపలు భూమి నుండి తీయడం మొదలు, తొక్కతీయడం, శుభ్రపరడం, పాలు తీయడం, ఉండలు చేయడం, ఆరపెట్టడం, ప్యాకింగ్.. అంతా యంత్రాలే చేసుకుపోతాయి.
సగ్గుబియ్యంలోని పోషకాల విషయానికొస్తే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తూ కొవ్వు తక్కువగా ఉండే పదార్థం ఇది. బరువు తగ్గాలని అనుకునేవారికి ఇది చక్కని ఆహారం. ఇందులో మినరల్స్, విటమిన్స్, కాల్షియం, ఐరన్, ఫైబర్లు ఉండడంవల్ల అన్ని వయసుల వారికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది. చంటి పిల్లలకు సైతం పాల తర్వాత మంచి ఆహారం సగ్గుబియ్యం. అనారోగ్యాలతో బాధపడుతున్నవారు, శస్తచ్రికిత్సలు చేయించుకున్నవారు, బలహీనంగా ఉన్నవారు ఇలా ఎవరికైనా తేలికగా జీర్ణమయ్యే సగ్గుబియ్యాన్ని తీసుకుంటే శక్తిని పుంజుకుంటారు. ఇక సబ్జా గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. చెమటకాయలతో పాటు వేసవిలో వచ్చే పలు రకాల చర్మ వ్యాధులను సబ్జాగింజలు నయం చేస్తాయ. వీటిని నీళ్లలో నానబెట్టి కొబ్బరినీళ్లతో కలిపి తీసుకుంటే సత్వర ఫలితం ఉంటుంది. సబ్జా గింజలు నానబెట్టిన నీటిలో కాస్త నిమ్మరసం, పంచదార కలిపి తాగితే అజీర్ణ వ్యాధి తగ్గుతుంది.

-ఎం.కె.