రుచి

వేడిమికి చెక్ పెట్టే లస్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండలు ముదిరిపోయాయి. బయట తిరిగాలంటే జనాలు బెంబేతెత్తిపోతున్నారు. మండే ఎండలకు శరీరంలో వేడి పెరిగిపోయి నీరసంతో నిస్సత్తువు ఆవరిస్తుంది. భోజనం చేయాలనిపించదు. శరీరంలో వేడితగ్గించి చల్లగా, గొంతుకు హాయిగా ఉండేది ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది. అలాంటివి లస్సీలే.. ఇవి శరీరంలో పోషకాలను నింపి వడదెబ్బ బారిన పడకుండా చేస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. మరి అలాంటి లస్సీల తయారీ చూద్దామా..

మిక్స్‌డ్ ఫ్రూట్‌తో..

కావలసిన పదార్థాలు
పెరుగు: కప్పు
ఆపిల్: సగం
అరటిపండు: సగం
తియ్యని ద్రాక్షపండ్లు: కొన్ని
సపోటా: ఒకటి
పంచదార: పావుకప్పు
తేనె: రెండు చెంచాలు
మిక్స్‌డ్ ఫ్రూట్ ఎసెన్స్: రెండు చుక్కలు
తయారుచేసే విధానం
ముందుగా పండ్ల ముక్కల్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. వీటితో పాటు మిగిలిన పదార్థాలన్నీ మిక్సీలోకి తీసుకుని లస్సీలా చేసుకోవాలి. ఇది గట్టిగా ఉంటుంది. కాబట్టి పండ్ల ముక్కలన్నీ మెత్తగా అయ్యాక కాసిని చల్లని నీళ్లు పోసి మరోసారి మిక్సీ పట్టాలి.
అంతే వివిధ రకాల పండ్లతో లస్సీ సిద్ధం. దీనిపై కొద్దిగా ఐస్‌క్రీం లేదా జామ్ వేసుకుని, ఐస్ క్యూబ్స్ వేసి తాగితే చాలా రుచిగా ఉంటుంది.

కుకుంబర్‌తో..
కావలసిన పదార్థాలు
కీరదోస: రెండు
పెరుగు: అరలీటరు
అలం: రెండు అంగుళాల ముక్క
కొత్తిమీర తురుము: రెండు చెంచాలు
పచ్చిమిర్చి: రెండు
పంచదార: నాలుగు చెంచాలు
ఇంగువ: చిటికెడు
ఉప్పు: తగినంత

తయారుచేసే విధానం
కీరాముక్కలు, అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంగువ, ఉప్పు, పంచదార అన్నీ మిక్సీ జార్‌లో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇందులోనే పెరుగు కూడా వేసి మళ్లీ తతిప్పాలి. దీన్ని గ్లాసుల్లో పోసి ఐస్‌క్యూబ్స్‌తో చలచల్లగా అందించాలి.

స్వీట్ లస్సీ

కావలసిన పదార్థాలు
పెరుగు: కప్పు
పంచదార: ఒకటిన్నర చెంచా
రోజ్‌వాటర్: చెంచా
చల్లని మంచినీళ్లు: రెండు కప్పులు
పుదీనా ఆకులు: నాలుగు
యాలకులు: రెండు
తయారుచేసే విధానం
యాలకులను పొడికొట్టాలి. మిక్సీలో పెరుగు, పంచదార, రోజ్‌వాటర్, యాలకులపొడి, చల్లటి మంచినీళ్లు పోసి తిప్పాలి.
ఇప్పుడు దీన్ని గ్లాసుల్లోకి తీసుకుని పుదీనాతో అలంకరించి సర్వ్ చేస్తే సరి.

స్ట్రాబెర్రీతో..

కావలసిన పదార్థాలు
పెరుగు: రెండు కప్పులు
స్ట్రాబెర్రీ ముక్కలు: మూడు కప్పులు
పంచదార: కప్పు
యాలకులపొడి: పావు చెంచా
ఉప్పు: చిటికెడు
తయారుచేసే విధానం
మిక్సీ జార్‌లో స్ట్రాబెర్రీ ముక్కలు, పంచదార, యాలకులపొడి, ఉప్పు వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు దీన్ని గ్లాసుల్లోకి వంచి ఐస్‌క్యూబ్స్‌తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.

సబ్జాతో..

కావలసిన పదార్థాలు
పెరుగు: కప్పు
పంచదార: రెండు పెద్ద చెంచాలు
వెనిల్లా ఎసెన్స్: అరచెంచా
నానబెట్టిన సబ్జా గింజలు: ఒక చెంచా
తయారుచేసే విధానం
పెరుగులో పంచదార, వెనిల్లా ఎసెన్స్‌ను వేసి బాగా కలపాలి. దీనికి నానబెట్టిన సబ్జా గింజలను జతచేసి, ఐస్‌క్యూబ్స్ వేసి చలచల్లగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. శరీరంలోని వేడి కూడా తగ్గుతుంది.

లేత కొబ్బరితో..

కావలసిన పదార్థాలు
లేతకొబ్బరి ముక్కలు: అరకప్పు
కొబ్బరినీళ్లు: కప్పు
పెరుగు: కప్పు
పంచదార: కప్పు
జీడిపప్పు: పది

తయారుచేసే విధానం
మిక్సీ జారులో కొబ్బరి ముక్కలు, పంచదార తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి. తరువాత పెరుగు, కొబ్బరినీళ్లు పోసుకుని మళ్లీ ఒకసారి మిక్సీ పట్టాలి. దీన్ని గ్లాసుల్లోకి తీసుకుని జీడిపప్పు పలుకులు, ఐసు ముక్కలు వేసుకుని చలచల్లగా వడ్డించాలి.

మామిడి పండుతో..

కావలసిన పదార్థాలు
మామిడి పండు ముక్కలు:
కప్పు
పెరుగు: కప్పు
పంచదార: మూడు చెంచాలు
జీడిపప్పు: నాలుగు
బాదంపప్పు: నాలుగు
మాంగో ఐస్‌క్రీమ్: ఒక స్కూప్

తయారుచేసే విధానం
మామిడి పండు ముక్కలు, పెరుగు, పంచదారలను కలిపి మిక్సీ పట్టాలి. ఇందులో జీడిపప్పు, బాదంపప్పు పలుకులను కలపాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసుల్లోకి తీసుకుని పైన మాంగ్ ఐస్‌క్రీమ్ వేసుకుని సర్వ్ చేస్తే రుచికరమైన చలచల్లని మామిడి పండు లస్సీ తయారు.

మామిడికాయతో

కావలసిన పదార్థాలు
పులుపు తక్కువగా ఉన్న పచ్చిమామిడికాయ: ఒకటి
పంచదార: కప్పు
పెరుగు: కప్పు
జీడిపప్పు: నాలుగు
బాదాం: నాలుగు
పిస్తా: నాలుగు
తయారుచేసే విధానం
మామిడికాయను చెక్కు తీసి కాసిని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. జీడిపప్పు, బాదంపప్పు, పిస్తాలను నీటిలో నానబెట్టుకోవాలి. మామిడికాయ ఉడికించిన నీటిని విడిగా తీసుకోవాలి. మామిడికాయ గుజ్జు, పంచదార, పెరుగూ మిక్సీలోకి తీసుకుని మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. తరువాత మామిడికాయ ఉడికించిన నీరు పోసుకుని మరోసారి మిక్సీ పట్టి గ్లాసుల్లోకి తీసుకోవాలి. దీనిపై నానబెట్టిన జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా పలుకులు వేసి అలంకరిస్తే మామిడికాయ లస్సీ సిద్ధం.