రుచి

పెసర పప్పుతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్న మెంతికూర (సన్నగా తరిగినది) - 2 కప్పులు
పెసరపప్పు - 1/2 కప్పు
మినపప్పు - 1 1/2 టీస్పూన్లు
జీలకఱ్ఱ - 1 టీస్పూన్
ఎండుమిర్చి - 4 (ముక్కలుగా చేసినవి)
ఇంగువ - చిటికెడు
కరివేపాకు - 2 రెమ్మలు
నూనె - తాలింపుకి తగినంత
ముందుగా చిన్న మెంతికూర తీసుకుని దాని వేళ్లను కట్ చేయాలి. మిగతా భాగాన్ని మట్టిలేకుండా బాగా కడిగి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గినె్నలో నీరు పోసి ఆ నీరు ఉడుకు పట్టాక అందులో పెసర పప్పు వేసి బద్ద మెత్తపడేవరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బాణీలో కొద్దిగా నూనె వేసి అది వేడెక్కాక అందులో మినపప్పు, జీలకఱ్ఱ, ఎండుమిర్చి ముక్కలు, ఇంగువ కరివేపాకు వేసి మినపప్పు లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేక ఉడికించి పక్కన పెట్టుకున్న పెసర పప్పులో వెయ్యాలి. ఇప్పుడు అదే బాండీలో మిగిలిన నూనె పోసి అందులో తరిగి పెట్టుకున్న మెంతి కూర వేసి కొద్దిగా వేపి అందులో ఉప్పు (కొద్దిగా) చల్లి కలిపి మూతపెడితే దానిలో వున్న తడికి మెత్తబడుతుంది. మెత్తబడలేదు అనుకుంటే కొద్దిగా నీర్లు పోసి ఉడికించి దాన్లో ఉడికించి పక్కన పెట్టుకున్న తాలింపుతో కూడిన పెసరపప్పును వేసి రెండు నిముషాలు ఉప్పు వేసి ఉడికించాలి. మెంతికూర పెసరపప్పు రెడీ.