రుచి

కందిపప్పుతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్న మెంతికూర - 2 కప్పులు (సన్నగా తరిగినది)
కందిపప్పు - 1/2 కప్పు
చింతపండు రసం - 1 టేబుల్ స్పూన్ (చిక్కనిది)
ఆవాలు - 1 టీ స్పూన్
మెంతులు - కొద్దిగా
ఎండుమిర్చి - 4 (ముక్కలు చేసినవి)
ఇంగువ - చిటికెడు
కరివేపాకు - 2 రెమ్మలు
నూనె - తాలింపుకు తగినంత
ఉప్పు- సరిపడినంత
మెంతికూరని శుభ్రంగా కడిగి వేర్లు కట్ చేసి చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కందిపప్పును కుక్కర్‌లో పెట్టి తగినన్ని నీళ్లు పోసి నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. తర్వాత బాణీలో నూనె వేసి అందులో ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి ముక్కలు, ఇంగువ, కరివేపాకు అన్నీ వేసి చిటపటలాడేవరకు వేసి ఉడికించి పెట్టుకున్న కందిపప్పులో వెయ్యాలి. ఇప్పుడు అదే బాండీలో మిగిలిన నూనెను వేసి అందులో తరిగి ఉంచుకున్న మెంతికూర వేసి కొద్దిగా వేపి ఉప్పు చల్లి కలిపి మూత పెట్టి సన్న సెగమీద ఉడికించాలి. ఆల్‌రెడీ కడిగి తరిగి పెట్టుకుంటాం కాబట్టి ఆ తడికి మెత్తబడుతుంది. లేదంటే నీళ్లు కొద్దిగా పోసి ఉడికించుకోవచ్చు. ఈ ఉడికిన మెంతికూరలో ఉడికిన కంది పప్పు, తాలింపుతో కూడినది వేసి చింతపడు రసం పోసి, కొద్దిగా నీళ్లు, తగినంత ఉప్పు వేసి పది నిమిషాలు ఉడికించాలి. దింపేముందు తరిగిన కొత్తమీర వేసి మంచి వాసనతో ఘుమఘుమలాడుతూ రుచికరంగా ఉంటుందీ పప్పు.