రుచి

పుడ్డింగ్‌ల ప్రత్యేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలకు కానీ, పెద్దలకు కానీ కేకుల కంటే ఇష్టమైనవి ఏవైనా ఉన్నాయంటే అవి పుడ్డింగ్సే.. పండ్లు, వాటి ఎసెన్స్‌తో తయారుచేసే పుడ్డింగ్‌లు ఆరోగ్యానికి మంచివి.. వేడుకలకు కేవలం కేకులే కాకుండా పుడ్డింగులను కూడా ఇంట్లో ట్రై చేస్తే చాలా రుచిగా కుదురుతాయి. మరి ఒకసారి ప్రయత్నిద్దామా..

చాక్లెట్ ఆల్మండ్ పుడ్డింగ్

కావలసిన పదార్థాలు

క్యాస్టర్ షుగర్: 150 గ్రాములు
ఉప్పులేని వెన్న: 150 గ్రాములు
కోడిగుడ్లు: మూడు
బాదం పొడి: 100 గ్రాములు
మైదా: 70 గ్రాములు
చాక్లెట్ పొడి: 40 గ్రాములు
బేకింగ్ పొడి: 15 గ్రాములు
పాలు: 60 ఎం.ఎల్.
డార్క్ చాక్లెట్ చిప్స్: 70 గ్రాములు
బటర్ కాగితం: ఒకటి

తయారుచేసే విధానం

ఓవెన్‌ను నూట అరవై అయిదు డిగ్రీల ఉష్ణోగ్రతలో ముందుగా వేడిచేసి పెట్టుకోవాలి. మిశ్రమం ఉంచే పాత్రలోపల బటర్ పేపర్‌ను రాయాలి. ఇప్పుడు మైదా, చాక్లెట్ పొడిని జల్లించి పెట్టుకోవాలి క్యాస్టర్ షుగర్, వెన్నను ఓ పాత్రలోకి తీసుకుని చెక్క చెంచాతో బాగా గిలక్కొట్టినట్లు చేయాలి.
ఇందులో కోడిగుడ్ల సొనను ఒకేసారి వేసేయాలి. మైదా, చాక్లెట్ చిప్స్, బేకింగ్ పొడి, చాక్లెట్ పొడి, బాదాం పొడి వేస్తూ ఉండలు కట్టకుండా కలపాలి. చివరగా పాలు చేర్చాలి. దీన్ని కేక్ టిన్‌లోకి తీసుకుని నీళ్లు పోసిన బేకింగ్ ట్రేలో ఉంచి నలభై నుంచి యాభై నిముషాల దాకా బేక్ చేయాల్సి ఉంటుంది. దీన్ని వెనిల్లా ఐస్‌క్రీంతో కలిపి తింటే సూపర్‌గా ఉంటుంది.

మొకా ఫడ్జ్ పుడ్డింగ్

కావలసిన పదార్థాలు
చాక్లెట్ క్రీం బిస్కెట్లు: పది
క్రీం చీజ్: కప్పు
పంచదార: పావు కప్పు
పాలు: రెండు కప్పులు
ఇన్‌స్టంట్ కాఫీ పొడి: రెండు స్పూన్లు
చాక్లెట్ పుడ్డింగ్ మిక్స్: ఒక ప్యాకెట్

తయారుచేసే విధానం

చాక్లెట్ క్రీం బిస్కెట్లను మరీ మెత్తగా కాకుండా పొడి చేసుకోవాలి. క్రీం చీజ్‌ని బాగా గిలక్కొట్టి పంచదార వేసి కలపాలి. కాఫీపొడిని రెండు టేబుల్ స్పూన్ల పాలల్లో నానబెట్టుకోవాలి. మిగిలిన పాలలో పుడింగ్ మిశ్రమాన్ని వేసి బాగా కలిపి పదినిముషాలు ఫ్రిజ్‌లో ఉంచేయాలి. ఇప్పుడు బిస్కెట్ల పొడిని ఓ గ్లాసులో పావు వంతు వరకూ తీసుకోవాలి. దానిపై క్రీం చీజ్ వేయాలి. దానిపై కొద్దిగా పాలల్లో నానబెట్టిన కాఫీపొడి, పుడింగ్ మిశ్రమాన్ని వేయాలి. ఇలా మూడు వరుసల్లో వచ్చేలా ఒక్కో పదార్థాన్ని వేసుకుని ఫ్రిజ్‌లో ఉంచాలి. చల్లగా అయ్యాక తినాలి. పిల్లలు ఎంతగానో ఇష్టపడే మొకా ఫడ్జ్ పుడ్డింగ్ తయారు.

ఆపిల్ పుడ్డింగ్

కావలసిన పదార్థాలు

ఆపిల్స్: నాలుగు
పంచదార: అరకప్పు
గుడ్లు: నాలుగు
మైదా: రెండు టేబుల్ స్పూన్లు
కస్టర్డ్ పౌడర్: రెండు టేబుల్ స్పూన్లు
ఐసింగ్ షుగర్: కొద్దిగా

తయారుచేసే విధానం

ముందుగా ఓవెన్‌ని 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడిచేసుకుని పెట్టుకోవాలి. ఆపిల్ ముక్కలు, పావుకప్పు పంచదార, రెండు టేబుల్ స్పూన్ల చల్లని నీళ్లు ఓ గినె్నలో తీసుకుని స్టవ్‌పైన ఉంచాలి. పంచదార కరిగి ఆపిల్ ముక్కలు మెత్తగా అయ్యాక దింపేయాలి. గుడ్లను గిలక్కొట్టి మిగిలిన పంచదారను వేసి మరోసారి కలపాలి. ఇందులో మైదా, కస్టర్డ్ పౌడర్ వేసి మరోసారి కలిపి ఆపిల్ మిశ్రమంపై వేసి ఇరవై నిముషాలు బేక్ చేసుకుని తీసుకోవాలి. దీనిపై ఐసింగ్ షుగర్ వేస్తే చాలు.. టేస్టీ టేస్టీ ఆపిల్ పుడ్డింగ్ రెడీ..

ఫ్లోర్‌లెస్ కేక్ పుడ్డింగ్

కావలసిన పదార్థాలు

చాక్లెట్ ముక్కలు: రెండున్నర కప్పులు
ఉప్పు కలపని వెన్న: ఒక కప్పు
గుడ్లు: ఐదు
పంచదార: కప్పు
వెనిల్లా ఎసెన్స్: రెండు స్పూన్లు
ఉప్పు: పావు చెంచా
చాక్లెట్ పొడి: అరకప్పు

తయారుచేసే విధానం

ముందుగా ఓవెన్‌ని 300 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేసుకోవాలి. కేక్‌పాన్ అడుగున కొద్దిగా వెన్న రాయాలి. దానిపై కొద్దిగా చాక్లెట్ పొడిని చల్లాలి. ఇప్పుడు చాక్లెట్ ముక్కలు, వెన్నను ఓ గినె్నలో తీసుకుని ఓవెన్‌లో కాసేపు ఉంచి కరిగించాలి. తరువాత తీసేసి చల్లారనిచ్చి అందులో గుడ్లసొన, పంచదార, వెనిల్లా, ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లూ కలపాలి. ఇది మెత్తగా అయ్యేవరకు మిక్సీలో వేసి తిప్పాలి.

ఇందులో చాక్లెట్‌పొడి కలిపి మరోసారి గిలక్కొట్టాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లో ఉంచి నలభై అయిదు నిముషాలసేపు బేక్ చేసి తీసేయాలి. తరువాత కూడా అరగంట సేపు పూర్తిగా చల్లారేవరకు బయట ఉంచి కేక్‌ను బయటకు తీసి ఫ్రిజ్‌లో ఉంచాలి. చల్లారిన తరువాత తినాలి.

ఆరెంజ్ పుడ్డింగ్

కావలసిన పదార్థాలు

కమలా(ఆరెంజ్)తొక్కల పొడి: రెండు స్పూన్లు
వెన్న: 200 గ్రాములు
పంచదార పొడి: ఒకటిన్నర కప్పులు
గుడ్లు: మూడు
మైదా: ఒకటిన్నర కప్పులు
పాలు: అరకప్పు
ఆరెంజ్ జ్యూస్: పావు కప్పు
కమలాలు: రెండు

తయారుచేసే విధానం

ముందుగా కమలాలను తొనలను ఒలిచి పెట్టుకోవాలి. వెన్న, ఒక కప్పు పంచదార పొడి, కమలాతొక్కల పొడిని వేసి గిలక్కొట్టాలి. ఇందులో కోడిగుడ్లను వేసి బాగా గిలక్కొట్టాలి. అలాగే మైదాపిండిని కూడా వేసి బీట్ చేయాలి. తరువాత దీనిలో పాలు పోసి కలపాలి. పుడ్డింగ్ వండే గినె్నలో అడుగున బేకింగ్ పేపర్ పరిచి, నెమ్మదిగా పుడ్డింగ్ మిశ్రమాన్ని పోసి వెడల్పాటి పాన్‌లో పెట్టి మూతపెట్టాలి. పుడ్డింగ్ గినె్న సగం మునిగే వరకూ పాన్‌లో వేడినీళ్లు పోసి మూతపెట్టి స్టవ్‌పై పెట్టాలి. నీళ్లు మరిగాక సిమ్‌లో పెట్టి ఒకటిన్నర గంటల పాటు దీన్ని ఉడికించాలి. ఓ గినె్నలో మిగిలిన పంచదార, ఆరెంజ్ జ్యూస్ వేసి రెండు, మూడు నిముషాల పాటు మరిగించి సిమ్‌లో ఐదునిముషాలు ఉంచి తీసి ఒలిచిన కమలా తొనలు వేయాలి. స్టవ్ ఆఫ్ చేశాక పది నిముషాలు చల్లారనిచ్చి పుడ్డింగ్ బయటకు తీసి ప్లేటులో పెట్టి ఆరెంజ్ జ్యూస్ మిశ్రమం దానిమీదుగా పోసి వడ్డించాలి.