రుచి

వెరైటీ హల్వాలు ఆపిల్ హల్వా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిసారీ పండ్లను కానీ, కూరగాయలను కానీ నేరుగా తినడానికి ఇష్టం ఉండదు. అందుకని అప్పుడప్పుడూ స్వీట్ల రూపంలో.. అంటే హల్వాలా వండితే ఆ రుచే వేరు.. పండ్లు తినడం కన్నా హల్వా అంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలకే కాదు, పెద్దలకు కూడా హల్వా అంటే ఎంతో ఇష్టం. మరి అలాంటి హల్వాల గురించి ఒకసారి చూద్దామా!
*
ఆపిల్ హల్వా
కావలసిన పదార్థాలు
ఆపిల్స్: నాలుగు
పంచదార: ముప్పావు కప్పు
పాలపొడి లేదా కోవా: ఒకటిన్నర కప్పులు
దాల్చినచెక్కపొడి: ఒక చెంచా
యాలకులపొడి: ఒక చెంచా
నెయ్యి: పావు కప్పు
బాదాం: ఒకటిన్నర కప్పులు
కుంకుమపువ్వు: కొద్దిగా
పాలు: కొద్దిగా
తయారుచేసే విధానం
ముందుగా వేడినీళ్లలో బాదాంను నానబెట్టుకోవాలి. తరువాత బాదాం పొట్టుతీసి ముద్దలా చేయాలి. మందపాటి బాణలిని స్టవ్‌పై ఉంచి నెయ్యి వేయాలి. తొక్కతీసిన ఆపిల్ తురుము వేసి సిమ్‌లో ఉంచి ఉడికించాలి. తరువాత పంచదార వేసి అది పూర్తిగా కరిగాక బాదాం ముద్దను వేసి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలి. తరువాత పాలపొడి లేదా కోవా వేసి ఐదు నిముషాల పాటు ఉడికించి దించాక యాలకులపొడి, దాల్చినచెక్క పొడి, కుంకుమపువ్వు కలిపిన పాలు వేసి కలిపి బాదాంతో అలంకరిస్తే సరి.
*
బాదాం
హల్వా
కావలసిన పదార్థాలు
బాదాం: అరకిలో
పంచదార: 200 గ్రాములు
యాలకులపొడి: చిన్న చెంచా
నెయ్యి: 150 గ్రాములు
బాదాం పలుకులు: తగినన్ని
తయారుచేసే విధానం
బాదాం రాత్రంతా నానబెట్టి పొట్టు తీసుకుని మెత్తగా రుబ్బాలి. బాణలిలో నెయ్యివేసి రుబ్బిన ముద్దవేసి ఇరవై నిముషాలపాటు వేయించాలి.
తరువాత పంచదార, యాలకుడి పొడి వేసి దగ్గరగా అయ్యేవరకూ వేయించి నెయ్యిరాసిన ప్లేట్లులో వేసి చల్లారాక బాదాం ముక్కలు చల్లి ముక్కలుగా కోయాలి. అంతే ఎంతో రుచికరమైన బాదాం హల్వా రెడీ.
*
బొప్పాయి
హల్వా

కావలసిన పదార్థాలు
పండు బొప్పాయి ముక్కలు: రెండు కప్పులు
పంచదార: అరకప్పు
పాలు: కప్పు
బియ్యప్పిండి: ఒకటిన్నర చెంచాలు
నెయ్యి: నాలుగు చెంచాలు
యాలకుల పొడి: పావు చెంచా
జీడిపప్పు: తగినన్ని
తయారుచేసే విధానం
బాణలిలో నెయ్యి వేసి జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో బియ్యప్పిండి దోరగా వేయించుకోవాలి.
దీన్ని కాసిన్ని చల్లని పాలల్లో కలపాలి. గినె్నలో మిగిలిన పాలను పోసుకుని మరిగించుకోవాలి. తరువాత అందులో బియ్యప్పిండి మిశ్రమం వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బొప్పాయి ముక్కలను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక మందపాటి గినె్నలో ఈ మిశ్రమాన్ని వేసి దగ్గరగా అయ్యేంతవరకు ఉడికించాలి.
తరువాత ఇందులో పంచదార, ఉడికించి పెట్టుకున్న పాలమిశ్రమం వేసి మరో పదినిముషాలు ఉడికించాలి. ఇప్పుడు మంటను పూర్తిగా తగ్గించి కొంచెం కొంచెంగా నెయ్యి వేస్తూ బాగా కలపాలి. చివరగా యాలకులపొడి, వేయించిన జీడిపప్పు వేసి దించేయాలి. అంతే ఎంతో రుచికరమైన, పౌష్టికమైన బొప్పాయి హల్వా రెడీ..
*
బూడిద గుమ్మడి హల్వా

కావలసిన పదార్థాలు
బూడిద గుమ్మడి తురుము: ఆరు కప్పులు
పంచదార: రెండున్నర కప్పులు
నెయ్యి: అరకప్పు
పాలు: అరకప్పు
కుంకుమపువ్వు: చిటికెడు
జీడిపప్పు: తగినన్ని
ఎండుద్రాక్ష: తగినన్ని
యాలకులపొడి: చిన్న చెంచా
తయారుచేసే విధానం
బూడిద గుమ్మడికాయ తురుములోని నీళ్లను పిండేయాలి. తరువాత మందపాటి బాణలిని స్టవ్‌పైన ఉంచి అందులో గుమ్మడికాయ తురుము వేసి పాలు పోసి ఉడికించాలి. తరువాత ఇందులో సగం నెయ్యివేసి కలిపి మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి. కొద్దిపాలల్లో కుంకుమపువ్వును వేసి ఉంచాలి. గుమ్మడికాయ తురుము ఉడికిన తరువాత పంచదార వేసి కలపాలి. ఇప్పుడు కుంకుమపువ్వు కలిపిన పాలు, మిగిలిన నెయ్యి వేసి బాగా కలపాలి. జీడిపప్పు, ఎండుద్రాక్ష, యాలకులపొడి వేసి కలిపి దించితే సరి.. రుచికరమైన బూడిద గుమ్మడికాయ హల్వా తయారు.
*
బీట్‌రూట్ హల్వా

కావలసిన పదార్థాలు
బీట్‌రూట్ తురుము: మూడు కప్పులు
బొంబాయి రవ్వ: ముప్పావుకప్పు
నీళ్లు: ఒకటిన్నర కప్పులు
నెయ్యి: అరకప్పు
పంచదార: రెండు కప్పులు
జీడిపప్పు: తగినన్ని
ఎండుద్రాక్ష: తగినన్ని
బాదాం: తగినన్ని
యాలకులపొడి: చిన్న చెంచా
తయారుచేసే విధానం
బాణలిని స్టవ్‌పై ఉంచి రెండు చెంచాలు నెయ్యివేసి, బొంబాయిరవ్వ వేసి సుమారు ఐదు నిముషాలు వేయించాలి. దీన్ని తీసి ఆరనివ్వాలి. అదే పాన్‌లో మరో చెంచా నెయ్యివేసి సన్నగా తరిగిన బాదాం, జీడిపప్పులను వేసి వేయించాలి. తరువాత ఎండుద్రాక్ష కూడా వేసి వేగాక అన్నీ తీసి పక్కన ఉంచాలి.
అదే బాణలిలో మిగిలిన నెయ్యి వేసి బీట్‌రూట్ తురుము వేసి మీడియం మంటపై అది సగమయ్యేవరకు సుమారు పదినిముషాలపాటు వేయించాలి. ఇప్పుడు వేయించిన బొంబాయిరవ్వ కూడా వేసి బాగాకలపాలి. తరువాత మంచినీళ్లు, పంచదార వేసి కలపాలి. ఇప్పుడు మూతపెట్టి మీడియం మంటపై నీరంతా ఆవిరయ్యేవరకు ఉడికించాలి. తరువాత యాలకులపొడి, వేయించిన జీడిపప్పు, బాదాం, ఎండుద్రాక్ష అన్నీ వేసి కలిపి దించాలి. అంతే ఎంతో రుచికరమైన బీట్‌రూట్ హల్వా తయారు.
*