రుచి

మిఠాయ విందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపావళి అనగానే గుర్తొచ్చేవి దీపాలు, మిఠాయిలు.. ఈ పండుగ రోజు అందరూ ఉదయమే నలుగుపెట్టుకుని స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకుని, పూజచేసి ప్రసాదం తిన్నవెంటనే నోరు తీపి చేసుకుంటారు. సాయంత్రం బంధువులు, స్నేహితులతో కలిసి మిఠాయిలు పంచుకుంటారు. మరి ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో మిఠాయిలు కూడా ప్రత్యేకంగా ఉండాలి కదా! మరెందుకాలస్యం అలాంటి ప్రత్యేక మిఠాయిలపై ఓ లుక్కేద్దామా..

ఖీర్ మోహన్

కావలసిన పదార్థాలు

పనీర్ తురుము: రెండు కప్పులు
కోవా: అరకప్పు
మిఠాయి రంగు: కొద్దిగా
బాదాం: పావుకప్పు
పిస్తా: పావు కప్పు
జీడిపప్పు: పావు కప్పు
ఎండుద్రాక్ష: పావు కప్పు
యాలకులపొడి: అర టీస్పూన్
పంచదార: నాలుగు కప్పులు
మంచినీళ్లు: నాలుగు కప్పులు
కుంకుమపువ్వు: కొద్దిగా

తయారీ విధానం

బాదాం, జీడిపప్పు, పిస్తా, ఎండుద్రాక్షలను పొడి చేసుకోవాలి. ఈ పొడిని కోవాలో కలిపి పక్కన ఉంచాలి. పనీర్ తురుములో తగినంత రంగు కలిపి వీటిని సమభాగాలుగా చేసుకుని చిన్న చిన్న ఉండలుగా చేయాలి. తరువాత ఒక్కో ఉండలో అరటీస్పూన్ కోవా మిశ్రమాన్ని పెట్టి మూసేసి మళ్లీ ఉండలా చేసి బొటనవేలితో మధ్యలో కొద్దిగా వత్తాలి. అన్నింటినీ ఇలా చేసుకోవాలి. తరువాత పంచదారలో నీళ్లు పోసి మరిగించాలి. సుమారు పదిహేను నిముషాలు మీడియం మంటపై మరిగించాలి. తీగపాకం వచ్చాక యాలకులపొడి, కుంకుమపువ్వు వేసి కలపాలి. ఇప్పుడు పనీర్ ఉండల్ని వేసి మూతపెట్టి సిమ్‌లో మరో పదిహేను నిముషాలు ఉంచి తీయాలి. అంతే తియ్యతియ్యని ఖీర్‌మోహన్ తయారు.

మఖన్‌పెడా

కావలసిన పదార్థాలు

గులాబ్ జామూన్ పొడి: ఒక కప్పు
వంటసోడా: చిటికెడు
పాలు: పిండి కలిపేందుకు సరిపడా
పంచదార: మూడు కప్పులు
జీడిపప్పు: రెండు టేబుల్ స్పూన్లు
బాదాం: రెండు టేబుల్ స్పూన్లు
పిస్తా: రెండు టేబుల్ స్పూన్లు
ఎండుద్రాక్ష: రెండు టేబుల్ స్పూన్లు
నూనె: వేయించడానికి సరిపడా

తయారీ విధానం

ముందుగా ఓ గినె్నలో గులాబ్ జామూన్ పొడి, వంటసోడా వేసుకుని పాలుపోస్తూ ముద్దలా కలుపుకోవాలి. పది నిముషాల తర్వాత ఈ పిండిని కొద్దిగా తీసుకుని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. తరువాత జీడిపప్పు, బాదాం, పిస్తా, ఎండుద్రాక్షలను పొడి చేసుకోవాలి. ఉండను కొద్దిగా నెరిపి అందులో బాదాం పలుకుల మిశ్రమాన్ని పావు చెంచా ఉంచి మళ్లీ చుట్టూ ఉండలా చేసుకోవాలి.
దీన్ని మళ్లీ వెడల్పాటి బిళ్లలా వచ్చేలా అద్దుకోవాలి. ఇలా మిగిలిన అంతటి పిండినీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని రెండు రెండు చొప్పున కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని ఓ పళ్లెంలోకి తీసుకోవాలి. మరో గినె్నలో పంచదార, మూడు కప్పుల నీళ్లూ తీసుకుని స్టవ్‌పై పెట్టాలి. పంచదార కరిగి చిక్కని పాకంలా అయ్యాక దింపేయాలి. ఇది చల్లారాక అందులో ఈ బిళ్లల్ని వేయాలి. అంతే రుచికరమైన మఖన్‌పెడా రెడీ.

డ్రై ఫ్రూట్ లడ్డూ

కావలసిన పదార్థాలు

ఖర్జూరాల తురుము: కప్పు
బాదాం: పావు కప్పు
ఎండుద్రాక్ష: పావు కప్పు
జీడిపప్పు: పావు కప్పు
అంజీర్: పది
కొబ్బరి తురుము: పావు కప్పు
యాలకులు: రెండు

తయారీ విధానం

ముందుగా బాదాంను వేయించాలి. అంజీర్‌ను సన్నగా తరగాలి. మిక్సీలో యాలకులను వేసి పొడిచేయాలి. తరువాత ఖర్జూరం, అంజీర్, జీడిపప్పు, బాదాం, ఎండుకొబ్బరి అన్నీ వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని గినె్నలో వేసి కావాల్సిన సైజులో ఉండలుగా చేయాలి. అంతే ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్ లడ్డూలు తయారు.

కాలాజామూన్

కావలసిన పదార్థాలు

గులాబ్ జామూన్ పొడి: రెండు కప్పులు
పాలు పావు కప్పు
యాలకులపొడి: చెంచా
ఆకుపచ్చ రంగు: చిటికెడు
పంచదార: టేబుల్ స్పూన్
నూనె: వేయించడానికి సరిపడా

తయారీ విధానం

గులాబ్ జామూన్ పొడి, పాలు ఓ గినె్నలోకి తీసుకుని కలపాలి. తరువాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ ముద్దలా కలపాలి. ఇందులోంచి పావు ముద్దను విడిగా తీసి ఆకుపచ్చ రంగు, పంచదార, యాలకులపొడి వేసి మరోసారి కలపాలి. మొదట కలిపిన పిండినీ, ఆకుపచ్చ రంగు ఉన్న ముద్దను చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. మొదట తెలుగు రంగు ఉండను తీసుకుని కాస్త వెడల్పుగా చేసుకోవాలి. అందులో ఆకుపచ్చ రంగు ఉండను ఉంచి.. అంచులు మూసి మళ్లీ ఉండలా చేసుకోవాలి. ఇలానే మిగిలినవీ చేసుకుని పెట్టుకోవాలి.
ఈ ఉండల్ని రెండు రెండు చొప్పున కాగుతోన్న నూనెలో వేసి కాస్త నల్లగా అయ్యేవరకూ వేయించుకోవాలి. మరోవైపు పంచదార, నీళ్లు ఓ గినె్నలోకి తీసుకుని తీగపాకం పట్టాలి. వేడి కాస్త చల్లారాక ముందుగా వేయించి పెట్టుకున్న ఉండల్ని పాకంలో వేసి కాసేపయ్యాక వేరే గినె్నలోకి తీసుకోవాలి. వీటిని మళ్లీ పంచదార పొడిలో పొర్లించి గినె్నలోకి తీసుకోవాలి. పిల్లలు ఎంతో ఇష్టపడి తినే కాలాజామూన్ రెడీ.

దియా ఔర్ బాతి

కావలసిన పదార్థాలు

కొబ్బరిపొడి: కప్పు
పంచదార: అరకప్పు
కోవా: ఒకటిన్నర కప్పులు
కోవాపొడి: మూడు టేబుల్ స్పూన్లు
బాదాం: ఎనిమిది
లెమన్ కలర్: మూడు చుక్కలు
రోజ్‌వాటర్: అర టీ స్పూన్
పాలు: కొద్దిగా

తయారీ విధానం

బాణలిలో కప్పు కోవా వేసి రెండు నిముషాలు ఉడికించాలి. కొబ్బరిపొడి, పంచదార వేసి కలిపి దించాలి. ఇప్పుడు కోవా పొడి వేసి కలపాలి. మిశ్రమం మరీ పొడిపొడిగా ఉంటే, అది కాస్త ముద్దలా కలిసేవరకు కాసిని గోరువెచ్చని పాలు కలపాలి. మిగిలిన కోవాలో లెమన్ కలర్, రోజ్‌వాటర్ వేసి కలపాలి. కోవా కలిపిన కోవా మిశ్రమాన్ని దీపాల్లా చేయాలి. మధ్యలో లెమన్ కలర్ కలిపిన కోవా మిశ్రమాన్ని పెట్టి అందులో ఓ జీడిపప్పు లేదా బాదమో ఒత్తిలా అమర్చితే సరి. అంతే దియా ఔర్ బాతీ మిఠాయి తయారీ.