రుచి

ఆరోగ్యప్రదాయిని.. అరిటాకు భోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరటి ఆకులో భోజనం అనేది మనకి అనాదిగా వున్న ఆచారం. అన్ని ఆకులుండగా అరటి ఆకును మాత్రమే ఎంచుకోడానికి తగిన కారణాలు చాలా ఉన్నాయి.
వేడి వేడి పదార్ధాలను అరటి ఆకుమీద వడ్డించడం వలన ఆకుమీద వుండే పొర కరిగి అన్నంలో కలుస్తుంది. దీని వలన భోజనానికి మంచి రుచితోపాటు జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది. ఆ ఆకులో అన్ని రకాలైన విటమిన్లు వుండడంవల్ల మనం వేడి పదార్ధాలను దానిమీద పెట్టుకుని తిన్నప్పుడు ఆ విటమిన్లు అన్నీ మనం తినే ఆహారంలో కలిసి మంచి పోషకాలను అందచేస్తాయి. ఎన్నో రకాలైన జబ్బులను నిరోధించే శక్తి ఈ అరటి ఆకుల్లో వుండడం విశేషం. అందుకే పచ్చగా ఉండే అరటి ఆకులో ఆహారం పెట్టుకుని తినడం వల్ల త్వరగా జీర్ణమవుతుంది. అలాగే మోదుగ ఆకుతో కుట్టిన విస్తరిలో భోజనం చేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుందని మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని అంటారు.
ఆకుపచ్చని అరటి ఆకులో భోజనం చేయడంవల్ల కఫ వాతాలు తగ్గిపోతాయి. శరీరానికి బలం చేకూరుతుంది. బాగా ఆకలి వేస్తుంది. ఆరోగ్యం చక్కబడి శరీరానికి మంచి కాంతి వస్తుంది. అరటి మోదుగ ఆకులలో భోజనం చేయడంవల్ల పేగుల్లోని క్రిములు నాశనమమవుతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఇది క్యాన్సరు, హెచ్‌ఐవి, సిక్కా, పార్కిన్సన్ మొదలైన వాటిని నిరోధించగలదు. రోగ నిరోధక శక్తిని కూడా పెంచగలదు. వాడి పారేసిన ఆకులు మట్టిలో సులభంగా కలిసిపోయి నేలను సారవంతం చేస్తాయి. కాబట్టి పర్యావరణానికి మేలు చేకూరుస్తుంది. అరటి ఆకులో భోజనం పెట్టడం అనేది మనకి ఎదుటి వాళ్లమీద వున్న గౌరవానికి ప్రతీక కూడాను. ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అరటి ఆకులో భోజనం చేయడం వల్ల నల్లటి కురులు మీ సొంతమవుతాయి. ఆకులో క్రమం తప్పకుండా ఆహారం తీసుకుంటే బూడిద జుట్టుతో వున్నవారు నల్లని జట్టును పొందుతారు. ఆహారం విషయంలో ఆధునీకతను ఓ పక్కన పెట్టేసి వీలైనంత వరకు ఆకుల్లో ఆహారం తీసుకోవడం అందరికీ శ్రేయస్కరం.
కాంక్రీట్ జంగిల్‌గా పేరొందిన నగరాల్లో కూడా పండగలు, పర్వదినాల్లో మార్కెట్లో అరటి ఆకులు అమ్ముతున్నారు. వాటిని కొనుక్కుని ఆరోజు వాటిలో భోజనం చేసేవారు వున్నారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లోని హోటళ్లలో ఆకులోనే భోజనం పెడుతున్నారు. దీన్నిబట్టి ఆకుల్లో భోజనం చేయడానికి ఎంతటి ప్రాముఖ్యత వుందో అర్ధం చేసుకోవచ్చు. శత్రువైనా సరే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టే గొప్ప సంప్రదాయం మనది. అలా శత్రువుకి భోజనం పెట్టేటప్పుడు ఆ అన్నంలో విషం కలిపారేమో అన్న భయం వుంటుంది. అదే అరటి ఆకులో భోజనం పెడితే ఒకవేళ విషం కలిపితే ఆ ఆకు నల్లగా మారి అన్నంలో విషం వుందని తెలుస్తుంది. కనుక అరటి ఆకులో అన్నం పెట్టినప్పుడు మన శత్రువులు కూడా ప్రశాంతంగా భయం లేకుండా తింటారు.
వివాహాది శుభకార్యాల్లో భోజనాలు అరటి ఆకుల్లో పెట్టే ఆచారం తరతరాలుగా వస్తోంది. ఇప్పుడంటే వంట చేసే ఓపిక, వడ్డించే తీరిక లేదని చెప్పేసి అంతా క్యాటరింగ్ భోజనాలపై ఆధారపడుతున్నారు కానీ ఒకప్పుడు అంతా అరటి ఆకుల్లోనే భోజనాన్ని వడ్డించేవారు. ఇప్పుడు కూడా ఈ సంప్రదాయాన్ని ఆచరించేవారు లేకపోలేదు.
ఉప్పు ఎక్కువైన పదార్ధం ఏదైనా కూడా దాన్ని తినలేక బైట పడేయకండి. ఉప్పుఎక్కువైన పాత్రమీద మూత తీసేసి మూత స్థానంలో అరటి ఆకుని పళ్లెంలాగ బోర్లించి కొంచెం సేపు పొయ్యిమీద పెట్టి వేడి చేయండి. అందువలన ఆ పదార్ధంలోని ఉప్పు తగ్గి రుచిగా తయారవుతుంది.
అలాగే అరటి చెట్టునుంచి వచ్చే అరటి పండు కూడా ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది. అరటి పండులోని పొటాషియం శరీర కండరాలను కూడా ఆరోగ్యంగా వుంచుతుంది. జీర్ణ సంబంధ సమస్యలకు కూడా అరటిపండు మంచి ఔషధంలా పనిచేస్తుంది. జబ్బుపడినవాళ్లు దీన్ని తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. అరటిపండు అల్సర్లను నివారించడంలో క్రియాశీలకంగా పనిచేస్తుంది. రేచీకటికి చెక్‌పెట్టవచ్చు. అరటి ఆరోగ్యప్రదాయిని. అరటి మొక్క అన్ని భాగాలను అనేక రూపాలుగా ఉపయోగిస్తారు. కాండాన్ని, పువ్వును వంటల్లో ఉపయోగిస్తారు. మొక్కనుండి పొందిన ఫైబరును తాళ్లు చాపలు, ముతక కాగితం, కాగితం గుజ్జు తయారుచేయడంలో ఉపయోగిస్తారు. ఇన్ని రకాలైన ప్రయోజనాలు వుండడంవలన అరటి ఆకు భోజనం అనేది ఘనమైన భోజనం ప్రతిబింబిస్తుంది అంటారు.

-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి