రుచి

ఆహా.. రోటి పచ్చడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నం తినేటపుడు ఎన్ని కూరలు, పప్పులు, పులుసులు ఉన్నా తెలుగువారికి కాస్తంత పచ్చడి కలుపుకుని ఓ ముద్ద అన్నం తింటే కానీ భోజనం చేసినట్టు అనిపించదు. అందుకే ఈరోజు ఓ నాలుగు పచ్చళ్ల గురించి తెలుసుకొందాం.

ఉల్లిపాయతో కావాల్సినవి:

ఉల్లిపాయలు-2
పెరుగు- 2స్పూన్స్
వేరుశనగపప్పు- అరకప్పు
శనగపప్పు- అరకప్పు
ఉప్పు- తగినంత
జీలకర్ర- అరస్పూన్
ఎండుమిరపకాయలు -4
కరివేపాకు - 2రెమ్మలు
ఆవాలు - ఒక స్పూన్
వెల్లుల్లి- 3 రెబ్బలు
నూనె- 2 స్పూన్స్

తయారీ విధానం:
ముందుగా ఉల్లిపాయలు ముక్కలుగా చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి వేరుశనగపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి ఇవి అన్నీ వేసి కొద్దిగా వేపుకోవాలి. ఇవి చల్లారాక నూరుకోవాలి. పెరుగులోకి నూరుకొన్న మిశ్రమాన్ని కలుపుకోవాలి. తిరిగి బాణలిలో కాస్త నూనె పోసి ఆవాలు,జీలకర్ర వేసి ఈ మిశ్రమంలో పోపుపెట్టుకోవాలి. ఇపుడు కొత్తిమీర, కరివేపాకు పైన చల్లుకుంటే ఉల్లిపాయ పచ్చడి రెడీ. ఇది అటు అన్నంలోకి, ఇటు చపాతీల్లోకి కూడా బాగుంటుంది.

కూరగాయలతో.. కావాల్సినవి:

కాప్సికమ్ తరుగు - 1కప్పు
క్యాబేజీ తరుగు - 1 కప్పు
క్యారెట్ తరుగు - 1కప్పు
ఉల్లిపాయ తరుగు- 1కప్పు
ఉప్పు- తగినంత
కారం - అరకప్పు
ఆవపిండి - అరకప్పు
పోపుసామాను- 3 స్పూన్స్
ఒక నిమ్మకాయ
నూనె - 50గ్రాములు

తయారీ విధానం:
ముందుగా ఒక గినె్నలోకి కూరగాయలు ముక్కలన్నీ వేసుకోవాలి. వీటికి ఆవపిండి, కారం, ఉప్పు కలుపుకోవాలి. ఐదునిముషాలు ఆగిన తరువాత బాణలిలో నూనెవేసి పోపుసామానులు వేసుకొని వేపుకోవాలి. ఈ పోపు వేగిన తరువాత వేడి వేడిగా నూనె అంతా కూరగాయల మిశ్రమంలోకి వంపుకోవాలి. ఇపుడు ఒక నిమ్మకాయలు చెక్కలుగా చేసుకొని ఇందులో పిండుకోవాలి. ఐదునిముషాలు మూతపెట్టి ఉంచి తరువాత అంతా కలుపుకోవాలి. కూరగాయలతో పచ్చడి రెడీ.

దొండతో.. ఈ దొండ పచ్చడి రెండు రకాలుగా చేసుకోవచ్చు. రోటి పచ్చడి ఒకటి, ముక్కల పచ్చడి ఒకటి.

కావాల్సినవి:

దొండకాయలు పచ్చివి - 6
ఉప్పు- తగినంత
పోపుసామాను -
ధనియాలు - 2 స్పూన్స్
ఆవాలు - 2స్పూన్స్
మెంతులు - 2స్పూన్స్
ఎండమిరప కాయలు - 4
పచ్చిమిరిప కాయలు -4
చింతపండు - కొద్దిగా
నూనె - 4 స్పూన్స్

తయారీ విధానం:
ముందుగా దొండను కడిగి ముక్కలు చేసుకుని బాణలిలో వేసి కొద్దిగా వాడ్చుకోవాలి. కొద్ది మెత్తగా వచ్చాక దింపుకోవాలి. మరలా బాణలి పెట్టి ఒక స్పూన్ నూనెతో మెంతులు, ధనియాలు, ఎండుమిరప, ఆవాలు వేపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి అన్నీ కలుపుకుని దీనికి చింతపండు కూడా కలిపి నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గినె్నలోకి తీసుకొన్న తరువాత దీనికి పోపుపెట్టుకోవాలి. ఇది రుచిగా ఉంటుంది. కాకపోతే రెండు రోజుల కన్నా నిల్వ ఉండదు.

దొండముక్కలతో కావాల్సినవి :

దొండకాయలు -10
మెంతులు - 3 స్పూన్స్
ఆవాలు - 3స్పూన్స్
నూనె - 50 గ్రా
నిమ్మకాయలు- 2
ఉప్పు- తగినంత

ముందుగా దొండను కడిగి తడిలేకుండా తుడుచుకోవాలి. వీటిని అతి సన్నని ముక్కలుగా చేసుకోవాలి. ఇపుడు నూనె లేకుండా మెంతులు, ఆవాలు దోరగా వేపుకోవాలి. ఇవి చల్లారాక దంపుకోవాలి. ఒక గినె్నలో దొండముక్కలను వేసుకొని వీటికి మెంతి, ఆవపిండిని, ఉప్పును కలుపుకోవాలి. నూనె వేడి చేసుకొని కొన్ని ఆవాలు వేసి చిటపట లాడాక వేడి వేడి నూనెను దొండ ముక్కలున్న మిశ్రమంలోకి వంపుకోవాలి. 2 నిముషాలుంచి ఆ తరువాత నిమ్మకాయరసాన్ని కలుపుకోవాలి. అంతే దొండముక్కల పచ్చడి రెడీ.

- లక్ష్మీప్రియాంక