రుచి

చిన్న ఆకలికి చిరుతిండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆఫీసుల నుంచి, స్కూళ్లు, కాలేజీల నుంచి ఇంటికి రాగానే వర్షాకాలంలో వేడి వేడిగా కాస్త నాలుకకు రుచిగా సేవిస్తే బాగుంటుందని ప్రతివారు అనుకుంటారు. అటువంటి వారి కోసమే వేడివేడిగా సూప్ ...
పాలకూర సూప్
కందిపప్పు కట్టు... సాధారణంగా కందిపప్పును ఉడికించినపుడు వచ్చే పైన తేటనే కందికట్టు అంటాం. కాని సూప్‌ను తయారు చేసుకొనేటపుడు కందికట్టు ను ఇలా తయారు చేసుకోవచ్చు... కందిపప్పును కాస్తంత వేపుకుని మిక్సీలో కాస్త గరుకుగా ఉండే పొడిలా చేసిపెట్టుకోవాలి. ఈ పొడిని సూప్ చేయాలనుకొన్నప్పుడు రెండు గ్లాసుల నీటిని వేడిచేసి ఈకందిపొడిని ఒక టేబుల్ స్పూన్ వేస్తే మరిగిస్తే కందికట్టు తయారు అవుతుంది.
ఇలా తయారు చేసిన కందికట్టుకు - సన్నగా తరిగిన పాలకూర ఒక కట్ట, తగినంత ఉప్పు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరిప మూడింటిని రుబ్బిన పేస్టు ఒక స్పూన్ కాస్తంత పసుపు కలపాలి. ఇపుడు కందికట్టును బాగా మరిగించాలి. ఇందులో ఇష్టమున్న వారు ఆలుగడ్డలను చిదిమి చేర్చుకోవచ్చు. లేకుంటే ఈ పాలకూర సూప్ చిక్కగా కావాలనుకుంటే కాస్త మొక్కజొన్న పిండిని చేర్చుకోవాలి. ఇలా చేర్చిన తరువాత ఈసూప్ ను బాగా మరిగించి దించుకుని సూప్ కప్స్‌లో సర్వ్ చేస్తే పిల్లలు పెద్దలు ఇష్టంగా సేవిస్తారు.
ఇలానే ఈ కందికట్టుకు కూరగాయల ముక్కలను, సోయాబీన్‌ను, సొరకాయ రసాన్ని, క్యారెట్ రసాన్ని కూడా కలిపి సూప్‌ను తయారు చేసుకోవచ్చు.కందికట్టుకు బదులు పెసలపప్పు , శనగపప్పును కూడా వాడుకోవచ్చు. రకరకాల సూప్‌ను తాగడానికి పిల్లలు ఎంతో మక్కువ చూపిస్తారు. ఈ సూప్‌లో ప్రోటీన్స్ ఉండి శరీరానికి మంచి పోషక శక్తిని కూడా ఇస్తుంది.

-- వాణిశ్రీ