రుచి

కరకరలాడే చిప్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాపిల్ చిప్స్

కావలసిన పదార్థాలు: యాపిల్స్: రెండు ,
బ్రౌన్‌షుగర్: రెండు చెంచాలు
దాల్చిన చెక్కపొడి: అరచెంచా
వెన్న: రెండు చెంచాలు
తయారీ విధానం: ముందుగా యాపిల్స్‌ను బాగా కడగాలి. తరువాత చిప్స్ కట్టర్‌తో యాపిల్‌ను పల్చని స్లైసుల్లా కోయాలి. వీటికి బ్రౌన్‌షుగర్, దాల్చిన చెక్కపొడి, వెన్న కలిపి రెండు వందల డిగ్రీల ఉష్ణోగ్రతలో బేక్ చేయాలి. మైక్రోవేవ్ లేనివాళ్ళు కొద్దిగా నెయ్యిగానీ, వెన్నగానీ వేసుకుంటూ పెనంపై కాల్చుకోవాలి. ఈ చిప్స్‌ను సాస్‌తోకానీ, మయోనైజ్డ్ క్రీంతో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి. పిల్లలకు స్కూల్ స్నాక్స్‌గా ఇది ఆరోగ్యకరమైన ఆహారం.
*
కాకరకాయ చిప్స్
కావలసిన పదార్థాలు: కాకరకాయలు: మూడు
శనగపిండి: సగం టేబుల్ స్పూన్
బియ్యప్పిండి: మూడు టేబుల్ స్పూనులు
చాట్‌మసాలా: కొద్దిగా
కారం: ఒక టేబుల్ స్పూన్
ఉప్పు: తగినంత
నూనె: వేయించడానికి సరిపడా
తయారీ విధానం: ముందుగా కాకరకాయ తొక్కుతీసి చిన్న చిన్న చక్రాల్లా తరిగి వీటికి ఉప్పు కలిపి పెట్టాలి. తరువాత ఇందులో బియ్యప్పిండి, శనగపిండి, కారం, చాట్‌మసాలా వేసి కలపాలి. ముందుగానే ఉప్పు రాసి ఉంచడం వల్ల ఈ పిండి కాకరకాయకు పట్టుకుంటుంది. వీటిని నూనెలో డీప్ ఫ్రై చేయడం వల్ల కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.
*
కందగడ్డ చిప్స్
కావలసిన పదార్థాలు: కందగడ్డ
బియ్యప్పిండి, శనగపిండి
వాము, ఉప్పు, కారం, నూనె
తయారీ విధానం: ముందుగా కందగడ్డను సన్నని స్లైసులుగా చెక్కుకోవాలి. తరువాత ఒక బౌల్‌లో కప్పు బియ్యప్పిండి వేయాలి. దీనిలో పావు కప్పు శనగపిండి, కొద్దిగా కారం, ఉప్పు, వాము వేయాలి. ఇందులో నీళ్ళు కలపకూడదు. స్లైసులుగా చేసిన కందగడ్డను ఈ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. తరువాత నూనెలో డీప్ ఫ్రై చేయాలి. అంతే ఎంతో రుచికరమైన కందగడ్డ చిప్స్ రెడీ.
*
అరటికాయ చిప్స్
కావలసిన పదార్థాలు: అరటికాయ: ఒకటి
పసుపు: పావు చెంచా, ఉప్పు: తగినంత
మిరియాలపొడి: కొద్దిగా
నూనె: తగినంత
తయారీ విధానం: ముందుగా అరటికాయ చెక్కుతీసి సన్నగా చక్రాల్లా కోసం కొద్దిగా ఉప్పు, పసుపు కలిపిన నీటిలో వేయాలి. ఐదు నిముషాల తర్వాత నీళ్లలోంచి తీసేసి తడి ఆరనిచ్చి మరికొంచెం ఉప్పు, మిరియాలపొడి చల్లి బాగా కలిపి.. బేకింగ్ ట్రేలో పరచుకోవాలి. రెండు వందల డిగ్రీల ఉష్ణోగ్రతలో అరగంట సేపు బేక్ చేయాలి. ఓ పదిహేను నిముషాల తర్వాత వీటిని తిరగేయాలి. మెక్రోవేవ్ లేనివారు మామూలుగా నూనెలో డీప్ ఫ్రై చేసుకుని ఉప్పు, మిరియాలపొడి చల్లుకోవాలి. ఈ చిప్స్ సాస్‌తో తింటే బాగుంటాయి.
*
చిలగడదుంప చిప్స్
కావలసిన పదార్థాలు:
చిలగడదుంపలు: రెండు, ఉప్పు: తగినంత, నూనె: తగినంత
కారం: అరచెంచా,
వెల్లుల్లి రెబ్బలు: ఐదు
తయారీ విధానం: చిలగడ దుంపల్ని కడిగి, తుడిచి చక్రాల్లా కోసం ఉప్పు, నూనె, కారం, వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా దంచి వీటికి కలపాలి. ఐదు నిముషాలయ్యాక వీటిని రెండు వందల డిగ్రీల ఉష్ణోగ్రతలో అరగంట సేపు బేక్ చేసుకోవాలి. లేదా తరిగిన దుంపల్ని నూనెలో వేయించుకుని తరువాత ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బల్ని కలిపితే సరిపోతుంది. ఇవి కరకరలాడుతూ చాలా బాగుంటాయి.
మొక్కజొన్న చిప్స్
కావలసిన పదార్థాలు: మొక్కజొన్న పిండి: కప్పు
మిరియాలపొడి: అరచెంచా
బేకింగ్ పౌడర్: పావు చెంచా
ఉప్పు: తగినంత, వాము: కొద్దిగా
నూనె: తగినంత, తయారీవిధానం
ఒక బౌల్ తీసుకుని మొక్కజొన్నపిండి, మిరియాలపొడి, బేకింగ్ పౌడర్, ఉప్పు, వాము, కొద్దిగా నీళ్లు వేసి కలుపుకోవాలి. ఈ పిండి చిన్న చిన్న చపాతీల్లా వత్తుకుని త్రికోణాకృతిలో కోసుకోవాలి. వీటిని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇవి సాస్‌తోకానీ, మయోనైజ్డ్‌తో కానీ తింటే చాలా బాగుంటాయి.
*