రుచి

పైనాపిల్ లస్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావాలసిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు: అర కప్పు, పంచదార: పావు కప్పు, తాజా పెరుగు: రెండు కప్పులు, ఫ్రెష్ క్రీం లేదా ఐస్‌క్రీం: అరకప్పు, యాలకులపొడి: కొద్దిగా, కుంకుమపువ్వు: చిటికెడు, ఉప్పు: చిటికెడు, డ్రై ఫ్రూట్స్, ఐస్‌క్యూబ్స్
తయారీ విధానం: ముందుగా పైనాపిల్ ముక్కల్ని చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక బాణలిలో పంచదార, పైనాపిల్ ముక్కలు వేసి స్టవ్‌పై ఉంచాలి. పంచదార కరిగి ముక్కలకు పట్టిన తరువాత స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. తరువాత మిక్సీ జార్‌లో పెరుగు, యాలకులపొడి, కుంకుమపువ్వు, ఉప్పు, ఐస్‌క్రీం, ఐస్‌క్యూబ్స్‌వేసి బాగా బ్లెండ్ చేయాలి. దీనిని గ్లాసులో పోసుకుని అందులో పైనాపిల్, పంచదార మిశ్రమాన్ని వేయాలి. పైన ఒక స్పూన్ ఐస్‌క్రీంతోపాటు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే చల్లచల్లని పైనాపిల్ లస్సీ తయారు.