రుచి

ఆమ్ కా పన్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ కాలంలో పచ్చి మామిడికాయలు విపరీతంగా దొరకుతాయి. వీటితో చక్కని జ్యూస్ తయారు చేసుకొని సేవిస్తే శరీరంలో వేసవి వల్ల వచ్చే వేడిమి తగ్గిపోతుంది.
కావాల్సిన పదార్థాలు : మామిడికాయలు 4, వేయించిన జీలకర్ర పొడి : 1 స్పూన్, నల్లఉప్పు : 1స్పూన్, మామూలు ఉప్పు: 1 స్పూన్, బెల్లం : 150 గ్రాములు. నీళ్లు :1 లీటర్, గార్నిష్‌కు పుదీనా ఆకులు
తయారీ విధానం : ముందుగా మామాడికాయలు తొక్కతీసి కుక్కర్ లో ఉడికించుకోవాలి. అవి కాస్త చల్లారాక వాటిని చిదిమి కాని మిక్సీలో కాని వేసి మెత్తని గుజ్జు తయారు చేసుకోవాలి. దీనికి నల్ల ఉప్పు, ఉప్పు, జీలకర్ర పొడి వేసి కలిపి పెట్టుకోవాలి. ఒక గినె్నలో నీరు తీసుకొని బాగా మరిగించి అందులో బెల్లం వేయాలి. బెల్లం బాగా కరిగిన తరువాత స్టవ్‌నుంచి దించేసి ఆ బెల్లపునీటికి కలిపిపెట్టుకున్న మామిడి గుజ్జును కలుపుకోవాలి. వీటిని ఫ్రిజ్ లో పెట్టుకుని చల్లగా అయిన తరువాత కాస్తంత పుదీనా ఆకులను చేర్చుకుని తాగితే బాగుంటుంది.