రుచి

ఊరగాయ మటన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు: బోన్‌లెస్ మటన్: 800 గ్రాములు, నూనె: తగినంత, టొమాటోలు: ఐదు, అల్లం వెల్లుల్లి పేస్ట్: మూడు స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు: పదిహేను, పచ్చిమిర్చి ముక్కలు: రెండు స్పూన్‌లు, దాల్చినచెక్క: ఒకటి, లవంగాలు: ఐదు, యాలకులు: ఐదు, కారం: రెండు స్పూన్‌లు, ధనియాల పొడి: రెండు స్పూన్‌లు, పసుపు: ఒక స్పూన్, కరవేపాకు: రెండు రెబ్బలు, మెంతికూర: ఒక చిన్నకట్ట, ఆవ ఆకులు: ఐదు, జీలకర్ర : రెండు స్పూన్‌లు, ఉప్పు: తగినంత
తయారీ విధానం: ముందుగా ఆవ ఆకులను పొడిగా వేయించి పొడికొట్టుకోవాలి. అలాగే జీలకర కూడా పొడిగా వేయించి పొడిచేసుకోవాలి. మెంతి కూర కట్టలో సగాన్ని పొడి బాణలిలో వేయించి పొడి కొట్టుకోవాలి. అదే బాణలిలో స్పూన్ నూనెను వేసి వేడి చేసుకుని దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు కలిపి వేయించుకోవాలి. మంచి వాసన వచ్చిన తరువాత ఇందులో పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి. టొమాటో ముక్కలు బాగా మగ్గిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, మెంతికూర పొడి, ఆవ ఆకుల పొడి, జీలకర్ర పొడి వేసుకుని బాగా కలుపుకుని దించేయాలి. నిముషం తరువాత ఈ మిశ్రమంలో మటన్ ముక్కలు వేసి వాటికి అవన్నీ పట్టేలా బాగా కలపాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని బాణలిలోకి తీసుకుని దానిలో నూనె వేసి స్టవ్ మీద ఉంచాలి. తగినంత ఉప్పు కూడా వేయాలి. అరగంట తర్వాత ముక్కలు మెత్తగా అవుతాయి. అప్పుడు స్టవ్ ఆపేయాలి. తరువాత మరో బాణలిలో రెండు స్పూన్ల నూనె వేసుకుని వేడిచేసి వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేగాక దీన్ని మటన్ ముక్కలున్న బాణలిలో వేసేయాలి. అంతే ఊరగాయ మటన్ తయారు.
మునక్కాయతో..
కావలసిన పదార్థాలు: మటన్: పావుకేజీ, మునక్కాడలు: రెండు
బిర్యానీ ఆకులు: రెండు, దాల్చిన చెక్క: ఒకటి
లవంగాలు: ఆరు, గసగసాల ముద్ద: ఒక స్పూన్
అల్లం వెల్లుల్లి ముద్ద: ఒక స్పూన్, ఉల్లిపాయలు: పెద్దవి మూడు
ధనియాల పొడి: ఒక స్పూన్, జీలకర్ర పొడి: ఒక స్పూన్
కొబ్బెర పొడి: ఒక స్పూన్, గరంమసాలా: ఒక స్పూన్
పెరుగు: ఒక కప్పు, కారం: ఒక టేబుల్ స్పూన్
పసుపు: కొద్దిగా, ఉప్పు: తగినంత, నూనె: తగినంత,
తయారీ విధానం: ముందుగా మునక్కాడలను ముక్కలుగా కోసుకుని నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత మటన్‌ను శుభ్రంగా కడిగి కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, పసుపు పట్టించి గంటపాటు పక్కన ఉంచాలి. తరువాత ఒక బాణలిని తీసుకుని అందులో నాలుగు స్పూన్ల నూనెను వేసుకోవాలి.
నూనె వేడైన తరువాత అందులో బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలను కూడా చేర్చాలి. అవి ఎర్రగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు వేసి మూతపెట్టాలి. ఇవి బాగా మగ్గిన తరువాత ఇందులో కలిపి ఉంచుకున్న మటన్‌ను వేయాలి. ఇది కూడా బాగా మగ్గి నూనె తేలాక అందులో కొబ్బరి పొడి, గసగసాల ముద్ద, వేయించిన మునక్కాడ ముక్కలు, పెరుగు వేసి బాగా కలపాలి. తరువాత ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. మటన్ ఉడికి చిక్కగా అయ్యాక గరంమసాలా వేసి దించేయాలి. చివరగా కొత్తిమీర చల్లి సర్వ్‌చేసుకుంటే రుచికరమైన ములక్కాడ మటన్ రెడీ.
దోసకాయతో..
కావలసిన పదార్థాలు: మటన్: పావుకిలో
దోసకాయ: చిన్నది, ఉల్లిపాయ: ఒకటి
టమోటాలు: రెండు, పచ్చిమిర్చి: రెండు
కారం: రెండు స్పూన్‌లు, ఉప్పు: తగినంత
గరంమసాలా: అరస్పూన్, అల్లం వెల్లుల్లి: ఒక స్పూన్, నూనె: తగినంత, కొత్తిమీర: పావుకప్పు
తయారీ విధానం: దోసకాయ, ఉల్లిపాయ, టమోటాలు, పచ్చిమిర్చిలను విడివిడిగా తరిగి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి ముక్కలను వేసి వేయించాలి. తరువాత దీనిలో మటన్ ముక్కలు వేయాలి. ఇది మగ్గిన తరువాత దోసకాయ ముక్కల్ని కూడా వేసి మూత పెట్టాలి. అన్నీ ఉడికిన తర్వాత ఉప్పు, కారం, గరంమసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. కూర దగ్గర పడిన తరువాత ఇందులో కొత్తిమీర తరుగు వేసుకుని దించేస్తే సరి.
కాందారీతో..
కావలసిన పదార్థాలు: బోన్‌లెస్ మటన్: పావుకిలో, ఉల్లిపాయ: ఒకటి, కొత్తిమీర: ఒక చిన్న కట్ట, పుదీన: ఒక కట్ట, మెంతికూర: ఒక కట్ట, అల్లం వెల్లుల్లి ముద్ద: రెండు స్పూన్‌లు, పచ్చిమిర్చి ముద్ద: రెండు స్పూన్‌లు, నూనె: రెండు స్పూన్‌లు, గరంమసాలా: అరస్పూన్
యాలకులపొడి: పావుస్పూన్, ధనియాల పొడి: ఒక స్పూన్, గుమ్మడి గింజల ముద్ద: పావు కప్పు, వెన్న: రెండు స్పూన్‌లు, క్రీమ్: రెండు స్పూన్‌లు, ఎండుమిర్చి: రెండు, ఉల్లిపాయముద్ద: అరకప్పు
పసుపు: కొద్దిగా, కసూరీ మేథీ: అరస్పూన్
పంచదార: పావుకప్పు
తయారీ విధానం: స్టవ్‌పై బాణలిని ఉంచి నూనె పోయాలి. అది వేడయ్యాక ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఇవి బాగా వేగాక గుమ్మడి గింజల పొడి, ఉల్లిపాయ ముద్ద వేసి వేయించాలి. ఇది పచ్చివాసన పోయాక మటన్ ముక్కలను వేసి బాగా వేయించి మూతపెట్టాలి. మటన్ ఉడికిన తరువాత మిగిలిన పదార్థాలన్నింటినీ వేసుకోవాలి. బాగా కలిపిన తరువాత చివరగా వెన్న, క్రీమ్ వేసి రెండు నిముషాలయ్యాక దించేయాలి. అంతే ఎంతో రుచికరమైన కాందారీ మటన్ తయారు.
పచ్చిబొప్పాయితో..
కావలసిన పదార్థాలు: మటన్: పావు కిలో
పచ్చి బొప్పాయి ముక్కలు: కప్పు
అల్లం వెల్లుల్లి పేస్టు: ఒకటిన్నర స్పూన్
కారం: ఒక స్పూన్, గరంమసాలా: ఒక స్పూన్
ఉప్పు: తగినంత, జీలకర పొడి: ఒక స్పూన్
నూనె: మూడు స్పూన్‌లు, ఉల్లిపాయ: ఒకటి, కొత్తిమీర: ఒక కట్ట
టమోటాలు: రెండు, జీడిపప్పు పేస్ట్: రెండు స్పూన్‌లు
తయారీ విధానం: బాణలిలో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా ముక్కలు వేసి వేయించాలి. అవి వేగిన తరువాత మటన్ ముక్కలను వేసి బాగా వేయించాలి. తరువాత కొద్దిగా నీరు పోసి మూత పెట్టి మటన్‌ను మెత్తగా ఉడికించాలి. నీరు ఆవిరి అయ్యాక మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా మగ్గనివ్వాలి. తరువాత చివరిగా కొత్తిమీర తురుమును వేసి దించేస్తే సరి. ఇది అన్నంలోకి, రొట్టెల్లోకి కూడా బాగుంటుంది.
*