రుచి

చిరుధాన్యాలతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొన్నపిండితో..
కావలసిన పదార్థాలు
జొన్నపిండి: అరకిలో
కారం: రెండు టీ స్పూన్లు
జీలకర : టీ స్పూన్
ఉప్పు: తగినంత
నీళ్లు: తగినన్ని
తయారీ విధానం
మందపాటి గినె్నను తీసుకుని అందులో నీళ్లు పోసి మరిగించాలి. ఈ మరుగుతున్న నీటిలోనే జీలకర , కారం, ఉప్పు వేసి కలపాలి. తరువాత నెమ్మదిగా జొన్నపిండి వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఈ సమయంలో స్టవ్‌ను సిమ్‌లో పెట్టాలి. పిండి మిశ్రమం దగ్గఠగా వచ్చింది అనుకున్నాక దించి బట్టపై వడియాల్లా పెట్టి ఎండనివ్వాలి. అంతే జొన్నపిండి వడియాలు రెడీ..
*
పెసరతో..
కావలసిన పదార్థాలు, పెసరపప్పు : కిలో, పచ్చిమిర్చి: 50 గ్రాములు
ఉల్లిపాయలు: 100 గ్రాములు, అల్లం: చిన్నముక్క, ఉప్పు: తగినంత
తయారీ విధానం: ముందుగా పెసరపప్పును నానబెట్టుకోవాలి. తర్వాత పెసరపప్పు నుంచి పొట్టు వేరు చేసి అల్లం, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండిని ప్లాస్టిక్ కవర్‌పై చిన్న చిన్న వడియాల్లా పెట్టుకోవాలి. ఈ పిండిని ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా రుబ్బుకోవాలి. ఎందుకంటే పెసరపిండి త్వరగా పాడైపోతుంది. పెట్టిన వడియాలను రెండు, మూడు రోజులు ఎండలో ఆరనిచ్చి తరువాత డబ్బాలో నిలువచేసుకోవాలి. ఉల్లిపాయల పులుసులో ఈ వడియాలను వేసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది.
*
మరమరాలతో..
కావలసిన పదార్థాలు: మరమరాలు: కిలో, సగ్గుబియ్యం: కప్పు, బూడిద గుమ్మడికాయ తురుము: నాలుగు కప్పులు, ఉప్పు: తగినంత, పచ్చిమిర్చి: పది, కొత్తిమీర తురుము: కప్పు, జీలకర : టేబుల్ స్పూను, వంటసోడా: అరటీ స్పూను, నిమ్మరసం: టేబుల్ స్పూను
తయారీ విధానం : ముందుగా సగ్గుబియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. తరువాత వీటిని కుక్కర్‌లో ఉడికించుకుని పక్కకుబెట్టి చల్లారనివ్వాలి. తరువాత ఇందులో మరమరాలు, ఉప్పు, పచ్చిమిచ్చి ముద్ద, జీలకర , కొత్తిమీర తురుము, వంట సోడా, సన్నగా తురుముకున్న బూడిద గుమ్మడికాయ తురుము వేసి బాగా కలపాలి. చివరగా నిమ్మరసం కూడా కలిపి ప్లాస్టిక్ షీటుపై వడియాల్లా పెట్టి బాగా ఎండనివ్వాలి.
*
గోధుమరవ్వతో..
కావాల్సిన పదార్థాలు: గోధుమరవ్వ: ఒక కప్పు
నీళ్లు: ఎనిమిది కప్పులు, పచ్చిమిర్చి పేస్ట్: రెండు టీ స్పూనులు
జీలకర : రెండు టీ స్పూనులు, ఉప్పు: తగినంత
తయారీ విధానం: ముందుగా స్టవ్‌పై వెడల్పాటి గినె్నను ఉంచి నీళ్లుపోసుకుని బాగా మరిగించాలి. ఇందులో పచ్చిమిర్చి పేస్ట్, జీలకర , ఉప్పు, గోధుమ రవ్వ వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి. ఈ మిశ్రమం బాగా దగ్గరకు రాగానే దించేయాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి శుభ్రమైన బట్టపై వడియాలను పెట్టాలి. ఇవి బాగా ఎండిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
*
రాగులతో..
కావలసిన పదార్థాలు: రాగిపిండి: 50 గా ములు, కారంపొడి: నాలుగు టీ స్పూనులు
జీలకర : ఒక టీ స్పూను, నీళ్లు: తగినన్ని, ఉప్పు: తగినంత
తయారీ విధానం: ముందుగా రాగిపిండిని జల్లించుకోవాలి. తర్వాత స్టవ్‌పై వెడల్పాటి గినె్నను ఉంచి నీళ్లు పోసి బాగా మరిగించాలి. ఇందులో కారంపొడి, జీలకఠ్ర, ఉప్పు వేయాలి. తరువాత రాగిపిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలపుకోవాలి. పిండి బాగా దగ్గరపడగానే దించేయాలి. ఇప్పుడు ఓ వెడల్పాటి, శుభ మైన బట్టపై ఈ మిశ్రమాన్ని వడియాల్లా పెట్టుకోవాలి. వడియాలు బాగా ఎండాక గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. అవసరమైనప్పుడు నూనెలో వేయించుకుంటే ఎంతో రుచికరమైన, పోషణనందించే రాగి వడియాలు రెడీ.