రుచి

గోలా ఐస్ ఇంట్లోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవిలో పిల్లలు ఐస్, ఐస్‌క్రీమ్‌లాంటివి ఎక్కువగా తినాలంటారు. కానీ ఎక్కువగా ఐస్‌క్రీమ్‌లు మంచివి కావని, పండ్లు, పండ్లరసాలు మంచివని పెద్దల అభిప్రాయం. అందుకే ఒక్కోసారి పిల్లల మారాంని భరించలేక తప్పనిసరి పరిస్థితుల్లో ఐస్‌క్రీమ్‌ను కొనిస్తుంటారు. ఈ రెండింటినీ కలిపి ఐస్ గోలాల్లా చేసుకుని తింటే ఇద్దరి కోరికా తీరుతుంది. ఇంట్లో ఏ పేచీ ఉండదు. పైగా పెద్దలు కూడా తినొచ్చు. అందుకోసం ఇప్పుడు మార్కెట్లో బోలెడన్ని ఐస్ మెషీన్స్ మార్కెట్లో ఉన్నాయి. మిక్సీ సైజులో ఉండే దీంట్లో పండ్లరసాన్ని ఐస్‌క్యూబుల్లా గడ్డ కట్టించి వస్తే అది మంచుముద్దలా మారి కిందున్న గ్లాసులోకి వచ్చేస్తుంది. దాన్ని గోలాల్లా చేసి ఐస్ పుల్ల పెట్టి చక్కగా తినేయచ్చు. లేదంటే స్పూన్‌తోనూ తింటూ చప్పరించేయచ్చు. బావుంది కదూ.. ఇలాంటివైతే రోజూ తినేయచ్చు కూడా..
*
మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003