రుచి

నిమ్మ, అల్లం జ్యూస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు:
నిమ్మకాయలు రెండు, అల్లం కొద్దిగా,
పంచదార ఎనిమిది టేబుల్ స్పూన్లు
తయారీ విధానం: ముందుగా అల్లం రసాన్ని తయారుచేసుకోవాలి. తరువాత పంచదారలో కొద్దిగా నీళ్లుపోసి స్టవ్‌పై ఉంచి పంచదారను కరిగించాలి. తరువాత దీంట్లో అల్లం రసాన్ని వేసి బాగా కలిపి వడకట్టి పక్కన పెట్టుకోవాలి. దీన్ని చల్లార్చాలి. ఈలోగా నిమ్మరసాన్ని తీసుకుని చల్లారిన చక్కెర మిశ్రమంలో నిమ్మఠసాన్ని కలపాలి. నిమ్మరసాన్ని ముందుగా పిండుకోవడం కానీ, వేడి చక్కెర నీళ్ళలో నిమ్మరసాన్ని కలపడం కానీ చేస్తే చేదువస్తుంది. దీన్ని ఐస్‌క్యూబులతో చల్లగా సర్వ్ చేసుకోవాలి. ఇది వేసవి కాలంలో తప్పనిసరిగా తాగాల్సిన పానీయం. నిమ్మరసం, పంచదార నీళ్ళు వేడి తగ్గిస్తే, అల్లం వేడి వల్ల వచ్చే కడుపుమంట, మూత్ర సమస్యలను తగ్గిస్తుంది.