రుచి

బంగాళాదుంపతో బీపీకి చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రక్తపోటును నియంత్రించడంలో బంగాళాదుంపలు దోహదపడతాయని ఇటీవలి అధ్యయనాల్లో పరిశోధకులు గుర్తించారు. తక్కువ స్థాయిలో కేలరీలు, సమృద్ధిగా కొవ్వు పదార్థాలను మన శరీరానికి అందించే ఈ దుంపలను తరచూ తినడం వల్ల ఊబకాయం తగ్గుముఖం పడుతుంది. కార్బోహైడ్రేట్లు, ఇతర పోషకాలు ఉన్నందున వీటిని పిల్లలు, రోగులు తింటే అరుగుదల సంతృప్తికరంగా ఉంటుంది. 18 మంది ఊబకాయులకు నాలుగు వారాలపాటు బంగాళాదుంపలను ఆహారంలో ఇచ్చి అధ్యయనం చేయగా వారిలో రక్తపోటు తగ్గినట్లు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం పరిశోధకులు గమనించారు. వీటికి నూనె లేదా కొవ్వు పదార్థాలు కలపకుండా ఓవెన్‌లో వండుకుంటే ఆరోగ్యానికి మంచిదని వారు తేల్చిచెబుతున్నారు. బంగాళాదుంపలను ఉడికించి లేదా కాల్చుకుని తినడం మంచిది. వీటిలో ఫైటో కెమికల్స్, విటమిన్- సి, బి కాంప్లెక్స్, పోటాషియం, మెగ్నీషియం, పాస్ఫరస్, జింక్ వంటి ఖనిజాలు ఉన్నందున చర్మ సంరక్షణకు మేలు చేస్తాయి. పచ్చి బంగాళాదుంపలను గుజ్జులా చేసుకుని తేనెలో కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. ఇందులోని ఖనిజాల వల్ల కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. బంగాళాదుంపలను ఉడికించాక ఆ నీటిని పారవేయకుండా చర్మానికి రాసుకుంటే కీళ్లనొప్పులకు బాగా పనిచేస్తుంది. వీటిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. పేగుల్లో మంట ఉంటే నివారణ కలుగుతుంది. నోటి అల్సర్లు ఉన్నవాళ్లకు ఇది మంచి ఆహారం. పచ్చి బంగాళాదుంపలను మెత్తగా నూరి గాయాలకు రాస్తే మంచి ఫలితం ఉంటుంది. మెదడు వ్యవస్థ పనితీరును పెంచే గ్లూకోజ్, విటమిన్లు, బి కాంప్లెక్స్, హార్మోన్లు, ఎమినో ఆసిడ్లు, ఒమేగా-3 ఫాటీ ఆసిడ్లు వీటిలో పుష్కలంగా లభిస్తాయి. ఈ దుంపల్లోని విటమిన్లు, పీచు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు గుండెకు మేలు చేస్తాయి. బంగాళాదుంపల రసం చర్మ సంబంధ సమస్యలకి, బెణుకులకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఉదర భాగంలో క్యాన్సర్లను అడ్డుకునే శక్తి ఈ దుంపల్లో ఉందని చైనాలోని జిజియాంగ్ విశ్వవిద్యాలయం పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ప్రోస్టేట్, గర్భాశయ క్యాన్సర్లు, కణతుల నివారణకు ఇవి పనిచేస్తాయి. కాలేయం, పిత్తాశయంలోని వ్యర్థాలను బయటకు పంపేలా ఈ దుంపలు ప్రభావం చూపుతాయి. జపాన్‌లో హెపటైటిస్ చికిత్సకు బంగాళాదుంపల రసాన్ని ఉపయోగిస్తారు. క్యాన్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలు, మధుమేహం, కిడ్నీ, గుండె, కాలేయ వ్యాధులు వంటివి దరిచేరకుండా ఉండాలంటే ప్రతిరోజూ గ్లాసుడు బంగాళాదుంపల రసం తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

-సాయి ఆనంద మైత్రేయ