రుచి

వెలగతో వంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు’ అని అంటుంటాం. ఎందుకంటే మరీ
వగరుగా ఉండే దీని గుజ్జు గొంతు దిగడం చాలా కష్టం. అయినా దీంతో
చేసే పచ్చడి, పెరుగు పచ్చడి, పప్పు కూర, హల్వా వంటివి ఏడాదికోసారైనా రుచి చూడాల్సిందే. పండిన గుజ్జు మంచి వాసనతో తీపి, పులుపూ
కలగలిసిన భిన్నమైన రుచితో ఉంటుంది. వినాయక చవితి నాడు గణపతికి అంత్యంత ప్రీతిపాత్రమైన వెలక్కాయలను పాలవెల్లి అలంకారంగాను,
నైవేద్యంగాను పెట్టడం ఆచారంగా వస్తోంది. వేసవిలో విరివిగా
లభించే వీటితో చేసే వంటకాలు రుచికరంగా ఉంటాయి. వీటిలో విలువైన పోషకాలే కాదు ఎన్నో ఔషధగుణాలూ ఉన్నాయి. మాంసకృత్తులు, పీచు, పిండి పదార్థం, విటమిన్లు, ఖనిజాలు వెలగపండులో పుష్కలంగా లభిస్తాయి. వెలగ ఆకుల నుంచి తీసిన రసాన్ని తాగితే కడుపునొప్పి తగ్గుతుంది. దంత వ్యాధులు, మలబద్ధకం, అజీర్తి, పైత్యం, అధిక దాహం, నీరసం, కడుపులో గ్యాస్, హృద్రోగాలు, మహిళల్లో రొమ్ము క్యాన్సర్, రక్తహీనత, నోటిపూత, శ్వాస సంబంధ సమస్యలను దూరం చేసేందుకు ఈ పండు దోహదపడుతుంది. పూజాఫలంగా మాత్రమే భావించకుండా, అమృతతుల్యమైన
ఈ పండులోని ఔషధగుణాల గురించి అవగాహన పెంచుకుని రుచికరమైన వంటకాలు చేసుకుంటే పలు అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చు.

పెరుగుపచ్చడి
పచ్చి వెలక్కాయ గుజ్జు - 4 కప్పులు
అల్లం - చిన్న ముక్క
ఉప్పు - 2 చెంచాలు
పచ్చిమిర్చి - 6
జీలకర్ర - 2 చెంచాలు
ఎండుమిర్చి - 8
బెల్లం - కొంచెం
నూనె - 5 చెంచాలు
పెరుగు - 1/2 లీటరు
కొత్తిమీర - కొంచెం
ఇంగువ - చిన్నముక్క
పసుపు - 1/2 చెంచా
ఆవాలు - 2 చెంచాలు
పచ్చి వెలక్కాయ గుజ్జులో ఉప్పు, పసుపువేసి మెత్తగా చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి ముక్కలు వేయించి వెలక్కాయ ముద్దలో కలపాలి. ఇందులో బెల్లం, పెరుగు, అల్లం కోరు కలిపితే పెరుగు పచ్చడి సిద్ధం.

పచ్చడి
ఎండుమిర్చి - 6
పచ్చిమిర్చి - 2
వెలగ పండు గుజ్జు - 2 కప్పులు
ఆవాలు - 2 చెంచాలు
జీలకర్ర - 1 చెంచా
ఇంగువ - చిన్నముక్క
శెనగపప్పు - 2 చెంచాలు
కొత్తిమీర - కొంచెం
నూనె - 5 చెంచాలు
ఉప్పు - 2 చెంచాలు
బెల్లం - 4 చెంచాలు
చింతపండు గుజ్జు - 5 చెంచాలు
బాణలిలో ఆవాలు, శెనగపప్పు, ఎండుమిర్చి వేయించాక వెలగపండు గుజ్జు కలిపి 5 నిమిషాలు వేయించి తియ్యాలి. తర్వాత ఇందులో ఇంగువ, బెల్లం తరుగు, ఉప్పు కలిపి మిక్సీ పట్టాలి. ఉడికించిన చింతపండు గుజ్జు, పోపులను పచ్చడిలో కలపాలి. ఈ పచ్చడి రెండు, మూడు రోజుల పాటు చెడిపోకుండా నిల్వ ఉంటుంది.

హల్వా
మాగిన వెలగపండు గుజ్జు- 1 కప్పు
బెల్లం తరుగు లేదా పంచదార - 1 కప్పు
యాలకుల పొడి - 1 టి.స్పూను
కొబ్బరి పాలు - 2 కప్పులు
నెయ్యి - 1టి.స్పూను
జీడిపప్పు - 12
శెనగపిండి - అర కప్పు
కిస్‌మిస్ - 12
ఖర్జూరం -12
జీలకర్ర - అర టి.స్పూను
ముందుగా బాణలిలో వెలగపండు గుజ్జు, బెల్లం తరుగు లేదా పంచదార, కొబ్బరిపాలు, ఖర్జూరం, నెయ్యి, జీలకర్ర, శెనగపిండి వేసి సన్నటి మంటపై ఉడికించాలి.
హల్వా చల్లబడి నెయ్యి పైకి తేలాక యాలకుల పొడి, వేపిన జీడిపప్పు, కిస్‌మిస్ కలపాలి.
హల్వా పూర్తిగా చల్లారాక నెయ్యి రాసిన పళ్లెంలో వేసి నచ్చిన ఆకారంలో ముక్కలుగా కోసుకోవాలి. సువాసన వెదజల్లే ఈ హల్వా రుచికరంగానూ ఉంటుంది.

-వాణి