రుచి

మేలు చేసే మెంతికూర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధిక ఔషధ గుణాలు, విలువైన పోషకాలున్న మెంతికి ఆకుకూరల్లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. మెంతి ఆకుల్లో పీచు, పొటాషియం, ప్రొటీన్లు, విటమిన్-సి, నియాసిన్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. వంటల్లో తరచూ మెంతికూరను వాడితే రక్తంలో హానికారక కొలెస్ట్రాల్ తగ్గుముఖం పడుతుంది. బాలింతల్లో చనుబాలు పెరిగేందుకు ఇది దోహదపడుతుంది. ఆహారంలో మెంతికూర కలిపి తింటే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఇందులోని పీచు పదార్థం రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రిస్తుంది. గుండె సంబంధ రోగాలను నివారించే ఔషధాలు ఇందులో ఉన్నాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరచేందుకు, మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు కూడా దీన్ని తినడం ఉత్తమం. మెంతి ఆకుల్లో లభించే అమినోయాసిడ్ల వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తవుతుంది. ఫలితంగా రోగనిరోధక శక్తి వృద్ధి చెందుతుంది.