జాతీయ వార్తలు

ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికుల ఆందోళనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:ఆర్టీసీ సమ్మె 43వ రోజుకు చేరుకోవటంతో కార్మికులు ఈరోజు డిపోల ఎదుట ఆందోళనలు చేపట్టారు. కాగా ఆందోళనలు చేస్తున్న కార్మికులను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట డిపో ఎదుట ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. బస్టాండ్ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేస్తున్న వివిధ పార్టీల నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు.హైదరాబాద్ ఫారూఖ్‌నగర్ డిపో వద్ద ఆందోళన చేస్తున్న 15మంది కార్మికులను అరెస్టు చేశారు. అలాగే ఫలక్‌నుమా బస్టాండ్ వద్ద 40 మంది కార్మికులను అరెస్టు చేశారు. నర్సంపేట, ఖమ్మం జిల్లాలోని పలు డిపోల ఎదుట కార్మికులు ఆందోళనలు చేయగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఇదిలా వుండగా పలు డిపోల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.