రంగారెడ్డి

జమ్మ మల్లారికి అరుదైన గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాచారం, మార్చి 8: సాంప్రదాయ ఒగ్గు కథలో ఒగ్గు కళాకారిణిగా పేరొందిన జమ్మ మల్లారికి రాష్ట్ర ప్రభుత్వం అరుదైన గౌరవాన్నిచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ మహిళా దినోత్సవ అవార్డు 2020కి మల్లారిని ఎంపిక చేసింది. ఆదివారం నగరంలోని రవీంద్ర భారతిలో జమ్మ మల్లారి అవార్డును కేంద్ర హోంశాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ అందజేసారు. అవార్డుతో పాటు రూ.లక్ష రూపాయల చెక్కును అందజేసి మల్లారిని సత్కరించారు. యాచారం మండల పరిధిలోని మేడిపల్లి గ్రామం మల్లారి స్వస్థలం. ఇక్కడి నుండే ఎన్నో ఏళ్లుగా ఒగ్గు కథతో ప్రజల జీవన విధానాన్ని కళ్లకు కట్టేట్లు చూపించింది.