రంగారెడ్డి

యాదాద్రి హైవే-163కి పచ్చతోరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఫిబ్రవరి 27: చారిత్రాత్మక యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నర్సింహ స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు దాదాపు 30 కిలోమీటర్ల మేరకు సెంట్రల్ మిడెన్ (2.3) మీటర్లు బ్యూటిఫికేషన్ పనులకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) శ్రీకారం చుట్టింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ పర్యవేక్షణలో నేషనల్ హైవే-163 (్ఫర్ లైన్) ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) ఘట్‌కేసర్ నుంచి భువనగిరి రాయగిరి (యాదాద్రి) వరకు 30 కిలోమీటర్ల వరకు గ్రీనరీ పనులు ప్రారంభమయ్యాయి. హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో రూ.5.55కోట్ల వ్యయంతో యుద్ధప్రాదిపదికన చేపట్టన బ్యూటిఫికేషన్ పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. ఒక్క కిలో మీటర్ రూ.18.50లక్షల అంచనా వ్యయంతో పనులను ప్రారంభించారు. యాదాద్రి ఆలయ పనులు వేగవంతంగా పూర్తవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు లోబడి నేషనల్ హైవే-163 యాదగిరిగుట్ట వరకు గ్రీనరీ బ్యూటీఫికేషన్ పనులు చేపట్టేందుకు హెచ్‌ఎండీఏ బాధ్యతలు స్వీకరించింది. ఏడు భాగాలుగా విభజించి అతి తక్కువ సమయంలో పనులు పూర్తి చేయాలని భావిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణలో భాగంగా 2.3మీటర్ల స్థలంలో పగడ, పుత్రన్ జీవ తదితర మొక్కలు నాటాలని నిర్ణంచింది. మొత్తంగా సెంట్రల్ మిడెన్‌లో దాదాపు 3.72లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
రూమ్ టు రీడ్ ఆధ్వర్యంలో
జాతీయ సైన్స్ దినోత్సవం
మేడ్చల్, ఫిబ్రవరి 27: మేడ్చల్ మున్సిపల్ పరిధి రైల్వేస్టేషన్ రోడ్డులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూమ్ టు రీడ్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్రలేఖనం పోటీలు, విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టును ప్రదర్శించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు గోపాల్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచి శాస్త్ర విఙ్ఞనాన్ని పెంపొందించుకోవాలని, కొత్త రకమైన ప్రాజెక్టులు రూపకల్పన చేయాలని సూచించారు. రూమ్ టు రీడ్ గ్రంథాలయంలో సైన్స్ అభివృద్ధికి సహాయపడే పుస్తకాలు చాలా ఉన్నాయని తెలిపారు. ఇప్పటికీ కొనసాగుతున్న మూఢ నమ్మకాలను వీడేలా విద్యార్థులు, వారి తల్లితండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. చిత్రలేఖన పోటీలో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో రూమ్ టు రీడ్ ఇన్‌చార్జి గోవర్ధన్ నాయుడు, పాఠశాల ఉపాధ్యాయులు రమేశ్, రామారావు, సుజాత పాల్గొన్నారు.