రంగారెడ్డి

జోరుగా పట్టణ ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో మూడో రోజు బుధవారం జోరుగా కొనసాగింది. ఆయా మున్సిపాల్టీల పరిధిలో చైర్‌పర్సన్‌లు, కౌన్సిలర్‌లు అధికారులతో కలిసి వార్డుల్లో పర్యటించారు. వార్డుల్లో నర్సరీల సందర్శన, అవసరమైన మొక్కలను సేకరించడం, కొత్త నర్సరీల ప్రారంభం, రోడ్లపై గుంతలను పూడ్చడం, ఇళ్ల మధ్యలో ఉన్న ఖాళీ స్థలాలను శుభ్రం చేయడం, పిచ్చి మొక్కలు, పాదులు, తుప్పులు, తొలగించడం, అంగ్‌వాడీ కేంద్రాల తనిఖీ కార్యక్రమాలను ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. అధికారులు కూడా ప్రజాప్రతినిధులతో కలిసి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.
మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో
మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం చైర్‌పర్సన్ మర్రీ దీపికా నర్సింహా రెడ్డి 15వ వార్డు కౌన్సిలర్ జంగ హరికృష్ణ యాదవ్‌తో కలిసి పర్యటించారు. వార్డులో నెలకొన్న పలు సమస్యలను కౌన్సిలర్ అధికారులకు చైర్‌పర్సన్‌కు వివరించారు. అనంతరం ఓం శివసాయి ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన సమావేశంలో చైర్‌పర్సన్, కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నదని ప్రజలందరు స్వచ్ఛందంగా తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొని సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైస్‌చైర్మన్ చీర్ల రమేశ్, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని 3వ రోజు బుధవారం కొనసాగించి 11, 13, 14 వార్డుల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి కౌన్సిలర్‌లతో కలిసి పర్యటించి సమస్యలను గుర్తించారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను కౌన్సిలర్‌లు చైర్‌పర్సన్‌తో పాటు కమిషనర్ అమరేందర్ రెడ్డికి వివరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో చైర్‌పర్సన్ లక్షీ రెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇంటింటికి మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని కోరారు. వార్డుల్లో ఖాళీ స్థలాలను గుర్తించి నర్సరీలను తయారు చేయాలని సూచించారు. వార్డుల్లో కావాల్సిన మొక్కలను వార్డు నర్సరీలోనే పెంచే విధంగా చూడాలని అన్నారు. ప్రజలు అధికారులు కౌన్సిలర్‌లందరు కలిసికట్టుగా పనిచేస్తూ మున్సిపాల్టీని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి ఆదర్శంగా తీర్చిదిద్దాలని చెప్పారు. సమావేశంలో వైస్‌చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్‌లు మల్లికార్జున్, జైపాల్ రెడ్డి, హేమంత్ రెడ్డి, బాలరాజు పాల్గొన్నారు.