రంగారెడ్డి

సమాజానికి పోలీసులకు వారధులుగా ‘క్యాడెట్లు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, ఫిబ్రవరి 24: శిక్షణ పూర్తి చేసుకున్న స్టూడెంట్ పోలీసు క్యాడెట్లు సమాజానికి, పోలీసులకు వారధులుగా పని చేయాలని తెలంగాణ సోషల్ వేల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపు నిచ్చారు. సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్టూడెంట్ క్యాడెట్ శిక్షణ ఇస్తున్నారు. స్టూడెంట్ పోలీసు క్యాడెట్ పాసింగ్ ఆవుట్ పరేడ్ కార్యక్రమం గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కుటుంబాల్లో సమస్యలు అందరికి ఉంటాయని వాటిని అధిగమించి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చెప్పారు. చదువే సమాజంలో మనిషికి విలువను పెంచుతుందని క్రమశిక్షణతో కూడిన విద్యాద్వారానే ఎదిగినట్లు వివరించారు. నటుడు రానా దుగ్గుబాటి మాట్లాడుతూ ఎస్‌సీసీలో తాను నేర్చుకున్న క్రమశిక్షణ తన జీవితంలో ఎదుగుదలకు కారణం అయిందని తెలిపారు. విద్యార్ధులకు చిన్నతనం నుంచి సమాజంపై అవగహన కల్పించేందుకు సైబరాబాద్ సీపీ పోలీసు క్యాడెట్ శిక్షణ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ 2500 మంది విద్యార్ధులు శిక్షణ పూర్తి చేసుకుని పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాట్గొన్నారని తెలిపారు. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ చౌరస్తా నుంచి స్టేడియం వరకు శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్‌సీ క్యాడెట్లతో కలసి రానా, కమిషనర్ సజ్జనార్ కవాతు నిర్వహించారు. పాసింగ్ ఔట్ పరేడ్ పురష్కరించుకుని నిర్వహించిన పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులను అందించారు.