రంగారెడ్డి

బోడుప్పల్‌లో రూ.1.65కోట్లతో అభివృద్ధి పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఫిబ్రవరి 20: బోడుప్పల్ నగర పాలక సంస్థ కౌన్సిల్ తొలి సమావేశం గురువారం జరిగింది. మేయర్ సామల బుచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవిగౌడ్, కమిషనర్ శంకర్, కార్పొరేటర్లు పాల్గొని రూ.1.65కోట్ల వ్యయంతో అత్యవసరమైన అభివృద్ధి పనులు చేపట్టాలని తీర్మానించారు. రోడ్ల గుంతలకు మరమ్మతులు, నీటి సరఫరా కోసం బోర్లు రిపేరు, పాడైన మ్యాన్‌హోల్స్‌ను పునరుద్ధరించాలని, రూ.6.5లక్షలతో మేయర్, కమిషనర్ చాంబర్‌లో ఫర్నిచర్‌ను ఏర్పాటు చేసి, అదనపు గదులను కల్పించాలని తీర్మానంలో పేర్కొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో అవసరమైన పరికరాలను కొనుగోలు చేసి సిబ్బందికి యూనిఫామ్, రక్షణ పరికరాలను అందజేయాలని నిర్ణయించా రు. కార్యాలయంలో రెగ్యులర్ ఉద్యోగులు తక్కువగా ఉన్నందున ఆర్టీఐ ఫిర్యాదులపై సకాలంలో జవాబిచ్చుటకోసం కాంట్రాక్టు పద్ధతిలో రూ.25వేల జీతంతో రిటైర్డ్ డివిజనల్ అధికారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తూ తీర్మానించారు. కుక్కలు, పందుల బెడద లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని డివిజన్ కార్పొరేటర్లు కోరడంతో స్పందించిన మేయర్ బుచ్చిరెడ్డి నివారణ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వేసవి కాలం నేపథ్యంలో నీటి సమస్య తలెత్తకుండా యుద్ధప్రతిపాదికన చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులను ఆదేశించారు. 24 నుంచి ప్రారంభమ య్యే పట్టణ ప్రగతిలో డివిజన్ల సమస్యలను పరిష్కరించడానికి అవసరమై న ప్రణాళికను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు డివిజన్లలో సమస్యలపై ముఖ్యంగా దోమ లు, పందులు, కుక్కల నుంచి ప్రజల కు రక్షణ కల్పించాలని కోరారు. మహి ళా కార్పొరేటర్లు ఎక్కువగా ఉన్నందున సమస్యలపై చర్చించుకోవడానికి, అభివృద్ధి కార్యక్రమాల్లో తన వంతు కృషి చేయడానికి మహిళా డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి గౌడ్‌కు మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక ఛాంబర్‌ను ఏర్పాటు చేయాలని కమిషనర్ శంకర్‌కు వినతి పత్రం అందజేశారు.
కౌన్సిల్ సమావేశానికి
విలేఖరులకు అనుమతి నో..
బోడుప్పల్ నగర పాలక సంస్థ కౌన్సిల్ తొలి సమావేశానికి విలేఖరులను అనుమతించలేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే లోపలకి అనుమతి లేదని కొత్తగా జీవో వచ్చిందని కమిషనర్ శంకర్ పేర్కొన్నారు. సమావేశం అనంతరం కౌన్సిల్ తీర్మానల వివరాలను మేయర్ సామల బుచ్చిరెడ్డి చెప్పాల్సి ఉండగా తీవ్ర జ్వరం వచ్చినందున నమస్తే పెట్టి వౌనంగా కూర్చోగా మేయర్‌కు బదులు కమిషనర్ శంకర్ కౌన్సిల్ తీర్మానాలను విలేఖరులకు వివరించారు.