రంగారెడ్డి

సీఏఏకు వ్యతిరేకంగా మాట్లాడితే దేశ ద్రోహులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఫిబ్రవరి 19: సీఏఏకు వ్యతిరేకంగా మాట్లాడే వారంతా దేశ ద్రోహులేనని కేంద్ర బీసీ కమిషన్ సభ్యుడు టీ.ఆచారి ధ్వజమెత్తారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని రంగారెడ్డి నగర్‌లో ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు నందనం దివాకర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఉత్సవాలకు ముఖ్యఅతిథులుగా కేంద్ర బీసీ కమిషన్ సభ్యుడు టీ.ఆచారి, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ విచ్చేసి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆచారి మాట్లాడుతూ మనల్ని మనం రక్షించుకోవడానికే శివాజీ పుట్టాడని, ధర్మాన్ని, సంస్కృతిని కాపాడుకునేందుకు సుమారు 300 యుద్ధాలు శివాజీ చేశాడని వివరించారు.
శివాజీ చూపిన బాటలో పయనిస్తే తప్ప బ్రతకలేమని చిన్న పిల్లల నుండే అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో అత్యంత నీతివంతుల జాబితాలో నరేంద్ర మోదీ ఉన్నారని అన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ హిందూ ధర్మం కోసం, దేశం కోసం హిందూ జాతిని ఐక్యం చేసి హిందూ వ్యతిరేకులతో పోరాడిన మరాఠ యోధుడు శివాజీ అన్నారు.
రాష్ట్రంలో కూడా ఓ ఔరంగజేబు తయారైండని, భయంకరమైన హిందూ అంటే యాదాద్రికి వెళ్లి షూలతో ఆలయానికి వెళ్తారని, ఇదేమిటని అడిగితే విగ్రహ ప్రతిష్ఠాపన కాలేదని సమాధానమిచ్చారని చెప్పడం శోఛనీయమని అన్నారు. పుట్టినరోజున షూలతో కృష్ణ దేవ భగవానున్ని ముట్టుకుని మొక్కిన వ్యక్తి హిందూవాదా అని విమర్శించాడు. అయోద్యలో రామమందిరం నిర్మాణం ప్రారంభం కానుందని, ఇద్దరు అభినవ శివాజీలు మోదీ, అమిత్ షా.. దేశాన్ని, ధర్మాన్ని కాపాడుతున్నారని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నాయకులు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, చంద్రయ్య, కాంతారావు, రంగా శ్రీనివాస్ గౌడ్, రవి కిరణ్, ఆషా, రాజేశ్వరి, వేణు పాల్గొన్నారు.