రంగారెడ్డి

ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు మరోసారి అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఫిబ్రవరి 19: అనధికార లేఅవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేసి ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం కింద ఫీ నోటీసు పొందిన 13576 మంది దరఖాస్తుదారులకు హెచ్‌ఎండీఏ మరోసారి అవకాశం కల్పించింది. హెచ్‌ఎండీఏ నుంచి అప్రూవల్ ఫీ నోటీసు పొంది పేమెంట్ చేయని వారు జనవరి 31వ తేదీలోగా డేట్ ఆఫ్ ఇంటిమేషన్ నుంచి 10 శాతం సాధారణ వడ్డీతో మిగితా డబ్బులు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని ఫీ నోటీసు పొందిన వారు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ పీఆర్‌ఓ లలిత పేర్కొన్నారు.
వాయుసైన్యంలో చేరాలని అవగాహన
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 19: దేశ రక్షణ కోసం యువత వాయుసైన్యంలో చేరాలని వింగ్ కమాండర్ యోగేశ్ మొహ్ల యువతకు పిలుపునిచ్చారు. బుధవారం ఇబ్రహీంపట్నం అటవీశాఖ శ్రేణి పరిధిలోని గుర్రంగూడ సంజీవని వనంలో యువతకు జాగ్ ఇన్‌టూ ఐఎఎఫ్ పేరిట అవగాహన సదస్సు నిర్వహించారు. వింగ్ కమాండర్ యోగేశ్, వారెంట్ ఆఫీసర్ జోగిందర్ సింగ్‌లు మాట్లాడుతూ యువత దేశ రక్షణ కోసం వాయుసైన్యంలో చేరాలని అన్నారు. 17 నుంచి 21 సంవత్సరాల వయసున్న యువత వాయుసైన్యంలో చేరేందుకు అర్హులని, మరిన్ని వివరాలకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సూచించారు. అటవీశాఖ డీఆర్‌ఓ సత్యనారాయణ రెడ్డి, సెక్షన్ ఆఫీసర్ భాస్కరాచారి, టీఏ శ్రీనివాస్ రెడ్డి, అశోక్ పాల్గొన్నారు.