రంగారెడ్డి

ముస్తాబైన రామలింగేశ్వరస్వామి ఆలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఫిబ్రవరి 19: మేడ్చల్ మండలంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన స్వయంభూ రామలింగేశ్వరస్వామి ఆలయం మహాశివరాత్రి పర్వదిన వేడుకలకు ముస్తాబైంది. లక్షలాది భక్తులకు ఆరాధ్య దైవంగా ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి పర్వదిన వేడుకలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. మహాశివరాత్రి పర్వదిన వేడుకల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అభిషేక కార్యక్రమాలు కన్నుల పండువగా జరుగనున్నాయి. శుక్రవారం శివరాత్రి సందర్భంగా సామూహిక రుద్రాభిషేకాలు ఉంటాయి. 22వ తేదీన శాంతి అన్నపూజలతో వేడుకలను సమాప్తం చేశారు. మేడ్చల్ రామలింగేశ్వరస్వామి ఆలయానికి పురాతన చరిత్ర ఉంది. సుమారు 400 సంవత్సరాల క్రితం ధాత్రిక రాజలింగం కలలోకి స్వామివారు వచ్చి ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని సూచించినట్లు పురాణ గాధ ప్రాచుర్యంలో ఉంది. స్వయంభూగా ప్రసిద్ధిగాంచిన రామలింగేశ్వరస్వామి ఆలయంలోనే ఉంటారు. 41 రోజుల పాటు శివస్వాముల శివనామస్మరణతో ఆలయం మారుమోగుతుంది. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కాశీనాథ్ ఆధ్వర్యంలో శివస్వాములకు 41 రోజుల పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయాన్ని రంగులతో తీర్చిదిద్దడంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దారు. మేడ్చల్ మండలంలోని శివాలయాలు ఎంతో సుందరంగా చూడముచ్చటగా ముస్తాబయ్యాయి. శివరాత్రికి భక్తుల రాకకు నిర్వాహకులు తగు ఏర్పాట్లను చరుగ్గా చేస్తున్నారు. విద్యుత్ దీపాల కాంతులతో కళ్లుజీగేల్ మనేలా అలంకరించారు. ఆలయాల్లోనే శివభక్తులు ఉపవాస దీక్షలను చేపట్టి.. సాయంత్రం దీక్షను విడిచి మహాశివున్ని దర్శించుకునేందుకై తగు ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు. కేఎల్‌ఆర్ వెంచర్‌లో శివాలయం, అత్వెల్లి శివాలయం, తదితర ఆలయాల వద్ద ఇప్పటికే తగు ఏర్పాట్లు చేశారు.